Monday, September 8, 2025

 *"అమర చైతన్యం"*
*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*
🕉🌞🌎🌙🌟🚩

*ప్రపంచానికి గురువులు మార్గదర్శకత్వం చేస్తారనే మాట ఏమిటి ?*

*జవాబు: మీ మనసులను బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖంగా తీసుకువెళ్ళండి అని చెప్పుటలేదా .. గురువుల ప్రసక్తి అందుకే.*

*జ్ఞాని ఒక్కచోటనే కూర్చొని ఏమైనా చేయగలడు ఆయన తలచుకుంటే. ఆయన యుద్ధములను ప్రేరేపించగలడు మాన్పగలడు. కాని ఆయనకు తెలుసు ఒక విశ్వశక్తి, ద్వారా సర్వము నిర్వహించబడుతున్నదని. అందువలన అతను తెలివి తక్కువగా విశ్వవ్యవహారాలలో జోక్యం చేసుకోడు. గురువేమి చేయును. ఆయనేమైనా సాక్షాత్కారాన్ని శిష్యుల చేతిలో పెడతాడా. జ్ఞానుల సాహచర్యములో వుంటే శిష్యుల అజ్ఞానము క్రమముగా తొలగి సాక్షాత్కారము అవుతుంది కదా. సాక్షాత్కారము శాశ్వతమైనది. అది కొత్తగా గురువు చేత ఇవ్వబడేది కాదు. అజ్ఞానం తొలగించటంలో ఆయన సహాయపడతాడు. శిష్యుడు గురువుకు తనను తాను సమర్పించుకుంటాడు. అపుడు శిష్యుని అహం ఆనవాలు కూడా లేకుండా నశించిపోతుంది. అపుడు దుఃఖానికి అవకాశమే లేదు. దీన్ని సరిగా అర్థం చేసుకొనకుండా గురువేదో శిష్యునికి 'తత్వమసి' లాంటిదేదో ఉపదేశిస్తాడని, దానివల్ల అతనికేదో శక్తులు వస్తాయని భావన చేస్తుంటారు. అసలే అజ్ఞానంలో వున్నాడు. ఇంకా అహం వృద్ధి చెందితే ఎలా వుంటుంది. అతని అజ్ఞానం ఇంకా పెరిగిపోతుంది. అహం (మిధ్యా, నేను) నశించాలి. అహం నశించడమే గురుసేవకు ఫలితం*    

No comments:

Post a Comment