Monday, September 8, 2025

 *సుమతీ శతకము 49*

*తల మాసిన, నొలు మాసిన, వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్‌ గులకాంతలైన రోతురు తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ!*

భావం: పరిశీలింపగా భూలోకములో, తలమాసినను, శరీరమునకు మురికిపట్టినను, ధరించెడి బట్టలు మాసిపోయినను చేసుకొన్న భర్తనైనను ఇల్లాండ్రు ఏవగించుకొందురు.

*సుమతీ శతకము 50*

*తాను భుజింపని యర్థము మానవ పతి జేరు గొంత మఱి భూగతమౌ గానల నీగలు గూర్చిన తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ!*

భావం: అరణ్యమునందు తేనేటీగలచే కూడబెట్టిన తేనె కడకు ఇతరుల పాలైనట్లు లోభివాడు తాను నోరుకట్టుకొని కూడబెట్టిన ధనము కొంత ప్రభువులపాలును కొంత భూమి పాలునగను.           

No comments:

Post a Comment