Monday, September 8, 2025

 *ధ్యాన😌మార్గ*

_*"గ్రహింపు అనుభవంగా, జ్ఞాపకంగా మనసు ఏ విధంగా అందిస్తుంది ?"*_

_*మనకు అనేక విషయాలు గ్రహింపులో ఉన్నా, మన ధ్యాస దేనిపై ఉంటుందో అదే మన అనుభవంలోకి వస్తుంది. ప్రతి గ్రహింపు మనసులో జ్ఞాపకంగా ఉంటుంది. అందుకే నిద్ర మనకు అనుభవంలో లేకపోయినా దానికి సంబంధించిన శాంతిని మనసు జ్ఞాపకంగా అందించగలుగుతుంది. సినిమాలో లీనమైన మనసు ఆ కథాంశాన్నే గమనిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఏసి నిలిపివేసినందువల్ల వచ్చే ఉక్కపోతను, ఇరుకుగా కూర్చోవడం వల్ల వచ్చే కాళ్ళ నొప్పులను కూడా గ్రహిస్తూనే ఉంటుంది. కనుకనే ధ్యాస మారగానే అవి తిరిగి గమనింపులోకి వస్తాయి. అది కూడా చాలా సేపటి నుండి కాళ్ళు నొప్పెడుతున్న విషయంతో సహా తెలుస్తుంది. అంటే మనసు తాను గ్రహించిన విషయాన్ని అప్పటికి అనుభవంగా అందించలేకపోయినా, జ్ఞాపకంగా అందించేటప్పుడు ఏదీ మినహాయించకుండానే అందిస్తుందని అర్థమవుతుంది !*_

_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'*-   

No comments:

Post a Comment