*ప్రేరణ🏹మార్గ*
ఈ జీవితంలో ఎవరి స్వేచ్ఛ వారిది. ఎవరి నిర్ణయాలు వారివి.
🌿నీ ముందు క్షణాల్లో జీవితం మొత్తాన్నీ మార్చేసే పుస్తకం పెట్టినా, కనీసం దాన్ని పట్టుకోబుద్ది కూడా కాలేదు. అంటే అర్థం కొన్ని కర్మలు, కొన్ని అనుభవాలు పూర్తి చేస్తే గానీ అలాంటి వాటి పట్ల నీకు అసక్తి ఏర్పడదు అని!
👉అలాగే నీ చుట్టూ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వాళ్లు ఉన్నా, సాధకులు ఉన్నా వాళ్లెవరూ నీకు రుచించరు, కారణం... నువ్వు వారి కాన్షియస్‌నెస్ స్థాయికి చేరుకునే అర్హత ఇంకా సాధించలేదని అర్థం.
🌿నీ ఫ్రీక్వెన్సీలో ఉన్న వారే నీకు నచ్చుతారు. వారితోనే కలిసి తిరుగుతావు, కబుర్లు చెబుతావు.
👉కొన్నిసార్లు వేరే ఫ్రీక్వెన్సీలోని వారు నీతో సంబంధం కోసం నీ స్థాయి ఆలోచనలు ఎంటర్‌టైన్ చేసినా, కొన్నాళ్లకూ వాళ్ల ఎనర్జీ కూడా deplete అవుతూ ఉంటుంది. సో వాళ్లు దూరం జరిగిపోతారు.
🌿ఒకటే లాజిక్.. ఎవరి ప్రయాణం వాళ్లు చేస్తుంటారంతే. ఎవరూ ఎవర్నీ మార్చాల్సిన పనిలేదు. నువ్వు నువ్వు ప్రక్షాళించుకో..
👉 చుట్టూ ఉన్న వాళ్లని జడ్జ్ చెయ్యడం మానేయి. Be yourself. నీ అహాన్ని జయించు. అన్ని దూదిపింజలు అవే ఎగిరిపోతాయి.🍁.
No comments:
Post a Comment