Monday, September 8, 2025

*సుమతీ శతకము 44*

*తన కలిమి యింద్ర భోగము, తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్‌, దన చావు జల ప్రళయము, తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ !*

భావం: తన యొక్క ఐశ్వర్యమే దేవలోక వైభవము, తన దారిద్ర్యమే సమస్తమైన లోకములకు దారిద్ర్యము, తన చావే ప్రపంచమునకు ప్రళయము, తాను ప్రేమించినదే రంభ. ఈ విధముగా మనుజులు భావింతురు. నిజము ఇది.

*సుమతీ శతకము 45*

*తన వారు లేని చోటను, జనమించుక లేని చోట, జగడము చోటన్‌, అనుమానమైన చోటను, మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ !*

భావం: తనకు కావలసిన చుట్టములు లేనిచోటునను, తనకు చెల్లుబడి లేని తావునను, తగువులాడుకొను చోటునను, తను అనుమానించు ప్రదేశమునను మానవుడు నిలువరాదు.         

No comments:

Post a Comment