Monday, September 8, 2025

 *నాకు చాల బాగ నచ్చిన కథ...*
*ఒక ఊరిలో కొత్తగా పెళ్ళి అయిన జంట ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటారు. అతని భార్య అందంగా ఉంటుంది.*
*పేదరికంలో ఉంటారు.*
*రోజు ఆరుబయట వంట చేస్తూఉండేది ఆమె.  ఆ ఊరిలో ఉన్న మగవారంతా ఆమెను చూస్తూ ఉండేవారు.  భర్తకు ఇదంతా చూసి బాధగా అనిపించేది. అలా భార్య తో ఒకరోజు*
*మనం చేసేది కూలీ పనేకదా ఈ ఊర్లో పరిస్థితి బాగాలేదు వేరే ఊరు వెళ్లి ఇదే పని అక్కడ చేసుకుందాం అంటాడు.*
*భర్త ను గౌరవించే భార్య కనుక సరే అని ఉన్న సామాను అంత సర్ది ఒక ఎద్దుల బండి లో వేసుకుంటారు.*
*ఇంకా ఏమైనా ఉన్నాయా అని భర్త అడుగుతాడు....*
*అప్పుడు భార్య బైట పొయ్యి రాళ్లు 3ఉన్నాయి తెచ్చి బండి లో పెట్టండి అంటుంది.*
*అప్పుడు భర్త అంటాడు ఈ మాత్రం రాళ్లు అక్కడ ఉండవా అని.*
*అప్పుడు భార్య అంటుంది ఈ మాత్రం చూసే మగవాళ్ళు ఆ ఊరిలో ఉండరా....?*
*కావాల్సింది నమ్మకం*
*మన హద్దులు తప్ప వేరే వాళ్లకు భయపడ కూడదు అంటుంది.* 
*భర్త అప్పుడు అన్ని సామాన్లు దించి అదే ఊర్లో కాపురం ఉంటారు....!*
*భార్యాభర్తల బంధం నమ్మకంతో వుండాలి*
*ఒకరిపట్ల ఒకరికి గౌరవము ప్రేమాభిమానాలు*
*ఉండాలి డబ్బు పిచ్చి మద పిచ్చి కాదు*
*కట్టుకున్న భార్య శరీరాన్నే కాక మనసుని ఆమె*
*మానశిక సౌందర్యానికి* *ఆరాధ్యుడై ,తోడై అమెకే నీడై*
*నిలిచి జీవితాన్ని గెలిచే ప్రతి భర్తకీ..భార్యకీ*
*నా సవినయ వందనం👸💕🙍*

No comments:

Post a Comment