Monday, September 8, 2025

 Vedantha panchadasi:
పంచదశము:బ్రహ్మానందమున
విషయానంద ప్రకరణము
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

అథాత్ర విషయానందో బ్రహ్మానందాంశరూపభాక్ ౹
నిరూప్యతే ద్వారభూతస్త దంశత్వం శ్రుతిర్జగౌ 
౹౹1౹౹
ఏషోఽ స్య పరమానందో యోఽ ఖండైక రస్మాత్మకః ౹
అన్యాని భూతాన్యేతస్య మాత్రమేవోపభుంజతే
౹౹2౹౹

ఇచ్చట బ్రహ్మానందపు అంశము, బ్రహ్మానంద అనుభవమునకు ద్వారతుల్యము అయిన విషయానందము వర్ణింపబడుచున్నది.
విషయానందము బ్రహ్మానందపు అంశమే అని శ్రుతి చెప్పును.

బ్రహ్మానందానికి అంశభూతమైన విషయానందం ఈ ప్రకరణంలో నిరూపింపబడుతుంది.
విషయానందమనేది బ్రహ్మానంద జ్ఞానానికి ద్వారం లాంటిది - సాధనం లాంటిది.
దీనిని బ్రహ్మానందాంశంగా,
లేశానందంగా శ్రుతి పేర్కొన్నది.

మన ముఖబింబానికి సంబంధించిన జ్ఞానం కలగాలంటే,దర్పణంలోని ప్రతిబింబంవల్ల కలుగుతోంది.
అట్లాగే,
బ్రహ్మానందాన్నివతెలుసుకోవాలంటే మానసిక వృత్తులందు ప్రతీయమానమయ్యే బ్రహ్మానందం యొక్క ప్రతిబింబంలాంటిదైన విషయానందం ద్వారా తెలుసుకోవాలి.
అందుకే విషయానందాన్ని బ్రహ్మానందానికి అంశ అన్నారు.

అఖండము,ఏకరసము,
ఆనందము అయినది ఆత్మ.
అది పరబ్రహ్మకు స్వరూపమైన పరమానందమే!
ఎందుచేతనంటే,

సమస్తభూతాలూ,ప్రాణులూ ఈ పరమానందాన్నే అల్పాంశలో- 
కొద్ది పరిమాణంలో -
విషయానందం రూపంలో అనుభవిస్తున్నాయి.
ఇందులకు శ్రుతి ప్రమాణం-

అఖండము ఏకరసము అయిన బ్రహ్మమే పరమానందము.అజ్ఞానముచే కల్పింపబడిన ఇతర జీవులన్నీ ఈ ఆనందమునందొక కణమును మాత్రమే అనుభవించును. బృహదారణ్యక ఉపనిషత్తు 
4.3.32.

శాన్తా ఘోరస్తథా మూఢా మనసోవృత్తయ స్త్రిధా ౹
వైరాగ్యంక్షాన్తిరౌదార్య మిత్యాద్యాః శాన్తవృత్తయః 
౹౹3౹౹
తృష్ణా స్నేహో రాగలోభావిత్యాద్యా ఘోరవృత్తయః ౹
సంమోహో భయమిత్యాద్యాః కథితా మూఢ వృత్తయః
౹౹4౹౹
వృత్తిష్వేతాసు సర్వాసు బ్రహ్మణశ్చిత్స్వభావతా ౹
ప్రతిబింబతి శాన్తాసు సుఖం చ ప్రతిబింబతి 
౹౹5౹౹

శాంత,ఘోర,మూఢ అని మనస్సు యొక్క వృత్తులు మూడు విధములు.
చూ.ప్ర.2.14-15

మానసిక వృత్తులు మూడు రకాలుగా ఉంటాయి.
1)శాంత వృత్తులు
2)ఘోర వృత్తులు
3)మూఢ వృత్తులు అని.

వైరాగ్యము,క్షమ,
ఔదార్యము మొదలైన సాత్వికమైన వృత్తులన్నీ శాంతవృత్తులు.

తృష్ణ,రాగం,లోభం, స్నేహం మొదలైన రాజసవృత్తులన్నీ 
ఘోర వృత్తులు.
విషయముల కొరకు దాహము, వాని పట్ల ప్రీతి అనురక్తి వాని కొరకు లోభము మొదలైనవి ఘోర వృత్తులు.

సంమోహము,భయము మొదలైన తామస వృత్తులన్నీ మరియు భ్రాంతి వృత్తులన్నీ  మూఢవృత్తులని చెప్పబడినవి.

గుణోదోషాలను గూర్చిన వివేచన చేసేది మనస్సే!
సత్వము,రజస్సు,
తమస్సు అనేవి మనస్సు యొక్క గుణములు.

వైరాగ్యము,క్షమ,
ఔదార్యం మొదలైన 
దైవీ వృత్తులన్నీ సత్త్వగుణం వల్ల పుడుతున్నాయి.

ఆలస్యము - సోమరితనము,
తంద్ర - నిద్రమత్తు,
భ్రాంతి మొదలైన అసురీ వృత్తులన్నీ తమోగుణం వల్ల పుడుతున్నాయి.

సత్త్వగుణంవల్ల దాని కార్యాలైన వైరాగ్యాదుల వల్ల ఆత్మను తెలుసుకోవడం సులభతరమవుతుంది.
రజోగుణంవల్ల,
దానివల్ల జనించే కామక్రోధాదులైన కార్యాలవల్ల కర్మఫలాలను పెంచుకొని 
జ్ఞానానికి దూరమవడం జరుగుతుంది.ఇకపోతే,
తమోగుణం వల్ల,దాని కార్యాలైన ఆలస్య, తంద్రాదులవల్ల వ్యర్థంగా ఆయుక్షీణం అవటం తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు.మరియు జననమరణ భ్రాంతిలో పడిపోవడం జరుగుతుంది.

ఈ గుణాలలోని భేదం - దోషం వల్లనే మనస్సులో అనేక వృత్తులు, వికారాలు వ్యక్తమౌతూ ఉంటాయి.

ఈ వైరాగ్యాదులన్నీ బుద్దియందు ఉండేవి.
(వేదాంత శాస్త్రంలో
"అహం ప్రత్యయం"= నేను అనే అభిమానాన్ని కలిగి ఉండేవానిని కర్త లేక స్వామి ప్రభువు అంటారు.
లోక వ్యవహారంలో కూడా కార్యానికి కర్త అయినవానినే ప్రభువు అంటారు.కాబట్టి అంతఃకరణ వృత్తుల్లో అహంవృత్తి కలవాడే యజమాని అన్నమాట)

ఈ వృత్తులన్నింటి యందూ 
బ్రహ్మము యొక్క 
చైతన్య స్వరూపము ప్రతిబింబించును.

అలా అన్నింటి యందు ఒకే రకంగా ప్రతిబింబించుట దోషం కాదా ?

రూపం రూపం బభూవాసౌ ప్రతిరూప ఇతి శ్రుతిః ౹
ఉపమా సూర్యకేత్యాది సూత్రయామాస సూత్రకృత్ 
౹౹6౹౹
ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ౹
ఏకదా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్ 
౹౹7౹౹

ఈ వృత్తులన్నింటియందు
(మూడురకాల వృత్తులందు)
కూడా బ్రహ్మము యొక్క చిద్రూపత్వం-చిత్స్వభావం సమాన రూపంలోనే ప్రతిఫలిస్తూ ఉంటుంది.
కాని,
శాంతవృత్తుల్లో మాత్రం పరమాత్మయొక్క చిత్స్వభావంతో పాటు సుఖం కూడా ప్రతిబింబితమౌతూ ఉంటుంది.
ఇదే శాంతవృత్తుల్లోని విశేషం.

ఆ ఆత్మయే ప్రతిరూపానికి అనురూపమైనది;అనే శ్రుతివాక్య ప్రమాణం ఉన్నది.
అంటే, 
సృష్టియందలి ప్రతిరూపమూ ప్రకటమవటంలో ఈ ఆత్మయే ప్రతిబింబితమై ఉన్నది అని భావం.

బ్రహ్మసూత్రాల్లో వ్యాసుడీ విషయాన్నే ఉపమానంతో చెప్పాడు.
"అత ఏవ చోపమా సూర్యకాదివత్" - 
బ్ర.సూ.3-2-18

ఒకే సూర్యుడు అనేకమైన జలపాత్రల్లో ప్రతిబింబించటం వల్ల అనేకంగా కనిపిస్తున్నాడు.
అట్లాగే స్వప్రకాశమైన ఆత్మ,
ఉపాధి భూతములైన అనేక దేహాల్లో అనేకంగా కనిపిస్తోంది
అని.

కఠోపనిషత్తు ప్రమాణము -
"ఏకో వశీ సర్వభూతాన్త రాత్మా,
ఏకం రూపం బహుధా యంః కరోతి " -
ఆ పరమేశ్వరుడు సర్వభూతాన్తారాత్మ,
తన ఏక రూపమును బహురూపములుగా వ్యక్తపరచుచూ ఉన్నాడు.

వివిధ శరీరములందు ప్రవేశించి పరమాత్మ వివిధరూపములను దాల్చునని శ్రుతియనును. 

అమృతబిందోపనిషత్:12 ప్రమాణము -
పరమాత్మ ఒక్కటియే. అయినను అది ప్రతిజీవి యందూ అవస్థితమై ఉన్నది.జలమునందు ప్రతిఫలించిన చంద్రుని వలె ఒక 
విధముగను అనేక విధములుగను అది భాసించును.

వ్యాసుడు,
సూర్యుడు వివిధ రూపములు గల జలపాత్రలందు ప్రతిఫలించి వివిధ రూపములను పొందునట్లు బ్రహ్మము వివిధ శరీరములందు ప్రవేశించునని ఒక సూత్రమును కూడా రచించెను.
ఆకాశాది ఆవిర్భావ క్రమంలో కొంత వ్యత్యాసం శ్రుతుల్లో వినబబడుతున్నా 
సృష్టికర్త - స్రష్ట విషయంలో ఎటువంటి విగానం ఉపనిషత్తుల్లో లేదు.అన్ని వేదాంతములు కారణభూతమని సర్వజ్ఞుడు,సర్వాత్మ,
శక్తిమయుడు,అద్వితీయుడు అని నిర్దేశించిన పరమేశ్వరుణ్ణే స్రష్టగా చెపుతున్నాయి.

"సత్యం జ్ఞానం అనంతం" అని బ్రహ్మలక్షణాలను చెప్పి, తదనంతరము 
"సోఽ కామయత బహుస్యాం ప్రజాయేయ" అని సృష్టికర్తగా పరమేశ్వరుని కోరిక మనసులో మాట వ్యక్తం చేసి,చేతన స్వరూపమైన పరబ్రహ్మయే స్వతంత్రంగా జగత్ నిర్మణానికి కారణమని స్పష్టం చేయబడింది.

"స్రష్టగా"ఈశ్వరుడే ఉపాధి పరంగా సర్వభూతములందు ఉండే ప్రత్యగాత్మగా కూడా చెప్పడమైనది.నామ-రూప భేదములతో వ్యాకృతమైన స్రష్టకు-సృష్టింపబడిన జీవులకు భేదము లేదు అని బోధిస్తూ"ఇదం సర్వ మసృజత యదిదం కించ" -
కార్యజగత్తులో నున్న స్థావర - జంగములన్నీ ఆ పరమాత్మ వల్లే సృజింపబడినవి ;
అని చెప్పడం స్పష్టంగా శ్రుతుల్లో వినబడుతున్నది.

ఒకే అద్వితీయమైన పరబ్రహ్మం అన్ని ప్రాణుల్లోనూ ఉన్నది.
జలంలో ప్రతిబింబించిన చంద్రుడు అనేక రూపాలుగా కనిపించినట్లు !
అంటే -

పరబ్రహ్మరూపంలో - బింబరూపంలో ఒకడుగానూ;
జీవరూపంలో -
ప్రతిబింబరూపంలో అనేకంగానూ కనిపిస్తున్నాడని భావం.

బ్రహ్మము ఒకచోట చిన్మాత్రరూపంలోను,ఒక్కొక్కచోట చిదానందములనే రెండు రూపాలతోను ఎట్లా ప్రతీతమౌతోంది ?    

No comments:

Post a Comment