*ఇంట్లో గొడవలు వెంటనే తగ్గాలంటే పాటించవలసిన భగవద్గీత ముఖ్య సూత్రాలు:*
1. *గొడవలు ఎందుకు వస్తాయో భగవద్గీత చెబుతుంది:*
శ్లోకం:
భగవద్గీత 3.37
కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్
భావార్థం:
ఇంటి గొడవలు కామం (తనకు కావలసినట్టే జరగాలని కోరే మనోభావం), క్రోధం (అది రాకపోతే ఉద్భవించే కోపం) వల్లే వస్తాయి. ఇది మన అజ్ఞానం వల్ల వస్తుంది – ఇది మన అసలైన శత్రువు.
ఎప్పుడైతే హరే కృష్ణ మహా మంత్రం జాగ్రత్తగా జపం చేసి వింటమో ఆ భగవంతుని యొక్క నామ జప శక్తి ద్వారా మన హృదయం పవిత్రంగా మారుతుంది.
"కలియుగంలో ఇది ఒక్కటి చేస్తే చాలు, ప్రతి విషయంలో ఇక ఆనందమే"
2. గొడవలు తగ్గాలంటే ఓర్పు అవసరం
శ్లోకం:
భగవద్గీత 2.14
మాత్రా-స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ-సుఖ-దుఃఖదాః
భావం:
జీవితంలో వచ్చే అనుభవాలు తాత్కాలికమైనవే. మనసుకు సుఖమో, కష్టం రావచ్చో, వాటిని ఓర్పుతో తట్టుకోవాలి. భార్య, భర్తలు కూడా ఇదే తత్వాన్ని తెలుసుకుంటే గొడవలు తక్కువ అవుతాయి.
హరే కృష్ణ మహా మంత్రం జపం చేయడం వల్ల రాధా రాణి శక్తి ద్వారా ఓర్పు, సహనం పెరుగుతుంది.
3. హరినామం వల్ల లక్షణ మారుతుంది
నిత్య హరినామ సంకీర్తనం చేస్తే మన హృదయం తొందరగా పవిత్రం అవుతుంది .
ఉదాహరణ:
ఒక సమయంలో భర్త చాలా కోపం ఉండే వ్యక్తి. అతని భార్య హరినామ జపం చేయడం మొదలుపెట్టింది. రోజూ శాంతంగా ప్రవర్తించేది. కొన్ని నెలల్లో భర్తలో మార్పు వచ్చింది.
భార్య హరే కృష్ణ మహా మంత్రం జపం చేయడం ద్వారా భార్య సరైన చైతన్యంతో భగవంతునికి నివేదించిన ఆహారం భర్తకు పెట్టడం ద్వారా భర్తలో మార్పులు సులభంగా వచ్చాయి.
మనం ఒక వ్యక్తితో ఎలా మాట్లాడితే తిరిగి మనతో వారు అదే విధంగా మాట్లాడుతారు. ఒకవేళ రెచ్చగొట్టి విధంగా మాట్లాడితే జప శక్తి మీలో ఉంటుంది కాబట్టి మీరు అంత తొందరగా రియాక్ట్ అవ్వరు.
చాందుగ్య ఉపనిషత్తు ప్రకారం భగవంతుని యొక్క ప్రసాదం మనిషి యొక్క మనసును మారుస్తుంది.
"గృహస్తులు బయట ఆహారం తీసుకోవడం ద్వారా వారి ఇంట్లోకి నెగిటివ్ ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది.
మీరు ఏ ఆహారం తీసుకున్న భగవంతుడుకు కచ్చితంగా నివేదించాలి. మీ ఇంట్లో శాకాహారం, సత్వగుణంతో ఉండే ఆహారం మాత్రమే ఎంచుకోవాలి (భగవద్గీత 3.13, 17.8, 9 శ్లోకాలు చదవండి)"
🌺 4. భార్య భర్త ఎక్కడ తగ్గాలి?
భర్త బాధ్యత:
భర్త ఓర్పుతో భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆమె మాట వినాలి. ఆమె కోపపడితే వినికిడి గుణం కనబరచాలి.
భార్య బాధ్యత:
భర్త పనులకు గౌరవించాలి. అతని పరిమితులను అర్థం చేసుకోవాలి.
💐 భార్యాభర్తల శాంతి జీవితం కోసం 10 ముఖ్యమైన జాగ్రత్తలు
1. ఓర్పు – తాత్కాలిక భావోద్వేగాలు తట్టుకోవాలి
భగవద్గీత 2.14 ప్రకారం సుఖ-దుఃఖాలు తాత్కాలికం. కోపానికి తలొగ్గకుండా ఓర్పు చూపాలి.
2. కోపాన్ని నియంత్రించండి
భగవద్గీత 3.37 చెబుతుంది – కోపం మన అసలైన శత్రువు. ఆ సమయంలో మౌనంగా ఉండటం గొడవను ఆపుతుంది.
3. ఒకరినొకరు శ్రద్ధగా వినాలి
వినడం ప్రేమ చూపే ఒక రకమైన మార్గం. అప్పుడే అవగాహన పెరుగుతుంది.
4. తప్పులకన్నా గుణాలను గుర్తించండి
ఎవ్వరిలోనైనా లోపాలుంటాయి. గుణాలను చూసే దృష్టి పెరిగితే గౌరవం పెరుగుతుంది. హరే కృష్ణ మంత్రం జపం చేయడం వలన హంస లాగా ప్రతి ఒక్కరిలో మంచిని స్వీకరించి చెడుని విడిచి పెట్టగలం.
5. సమయాన్ని కేటాయించండి
రోజూ కొంత సమయం కలిసే కూర్చొని మాట్లాడండి. అనుబంధం బలపడుతుంది. హరేకృష్ణ వైష్ణవ సాంగత్యం తీసుకొని వెంటనే పరిష్కరించుకోగలరు.
6. క్షమాపణ అడగడం పరాజయం కాదు – ప్రేమ గుర్తు
ఒక చిన్న "క్షమించు" అన్న మాట పెద్ద గొడవను ఆపేస్తుంది. మనం భగవంతుడి యొక్క సేవకులము, ఈ భూమి మీద కొద్ది రోజులు కలిసి ఉంటాము. ఇద్దరు ఒకరికొకరు మోక్షం వచ్చేలా ప్రవర్తించాలి అనే జ్ఞానం ఎప్పుడు ఉంటే గొడవలు ఎట్టి పరిస్థితులలో రావు.
7. పోలికలు చేయవద్దు
ఇతర కుటుంబాలతో పోల్చడం వల్ల అసంతృప్తి, అపార్థాలు వస్తాయి. ఉన్నదానితో సంతృప్తి పడే లక్షణాలు హరే కృష్ణ మహా మంత్రం లో ఉండే చిత్ శక్తి మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి భక్తులు ఎక్కువగా జపం చేయగలరు.
8. హరినామ జపం కలసి చేయండి
ఒకే గదిలో, ఒకే సమయానికి హరే కృష్ణ మంత్రం చేయండి. మనసులు క్రమంగా కలుస్తాయి.
"కృష్ణుడే మీ లక్ష్యం అయినప్పుడు, మీ జీవితంలో నిర్లక్ష్యంగా గొడవలకి వెళ్లరు"
9. గౌరవంగా సంభాషించండి
ఎన్ని సంవత్సరాలైనా "కృతజ్ఞత", "ధన్యవాదం", "దయచేసి" అనే మాటలు వినిపిస్తూ ఉండాలి.
మీరు మీ భర్త గారు వారానికి ఒక్కసారైనా హరేకృష్ణ మందిరాలకు వెళ్లి సేవ చేస్తూ ఉండండి.
ముఖ్యంగా బృందావనం, జగన్నాథ్ పూరి యాత్రలకు కలిసి రాగలరు
10. ఇల్లు కృష్ణుని ఆలయం అనే భావన కలుపుకోండి
ఇల్లు కేవలం బట్టలూ, డబ్బులూ నిల్వ చేసే ప్రదేశం కాదు. అక్కడ కృష్ణుని సేవ ఉండాలి. భార్య భర్త ఇద్దరూ కలిసి తులసి మహారాణి ప్రదక్షిణ చేస్తూ, సంకీర్తన ఉదయం సాయంత్రం పూట చేయగలరు.
మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందించే దయ ఉంటే, మీలో దయ పెరుగుతుంది.
🌸 ముగింపు మాట
గృహస్థ ఆశ్రమం సంఘర్షణ స్థలం కాదు – శాంతి సాధనా స్థానం. మరో జన్మ లేకుండా చేసే స్థలం.
భగవద్గీత, హరినామం, ఓర్పు ఈ మూడూ ఉంటే – గొడవలు మారతాయి, జీవితం
కృష్ణ చైతన్యం చేసుకోవాలి .
✅ ప్రతి రోజూ హరే కృష్ణ మంత్రం జపం చేయండి:
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
✅ దంపతులు కలిసి గీత Class వినండి
✅ గృహస్థ ఆశ్రమం అనేది ఆధ్యాత్మికంగా ఉంటే గొడవలు తక్కువవుతాయి
✅ ప్రతిరోజు చైతన్య కృష్ణ దాస ప్రభు తరగతులు, భగవద్గీత కోర్సులు ఫాలో అవండి.
భార్య భర్తలు ఒకరి కోసం మరొకరు తగ్గే సంస్కృతి తీసుకురావాలి. మనం శాశ్వతమైన జీవులు, ఈ జీవితాన్ని తాత్కాలికంగా గడుపుతున్నాం. హరినామం, భగవద్గీత, ఓర్పు, కృష్ణసేవ – ఇవి మన ఇంట్లో శాంతి, ప్రేమ, ఐక్యం తీసుకురావడమే కాకుండా, భవబంధాల నుండి విముక్తి కుడా ఇస్తాయి.
హరే కృష్ణ 🙏
No comments:
Post a Comment