*సుమతీ శతకము 63*
*పతికడకు, దన్ను గూరిన సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్, సుతుకడకు రిత్తచేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ!*
భావం: ప్రభువు కడకును, భార్యకడకును, భగవంతుని సన్నిధానమునకును, గురుదేవుని దగ్గరకును, కుమారుని కడకును వట్టిచేతులతో బుద్ధిమంతులు పోరాదు. ఇదియే నీతిమార్గము.
*సుమతీ శతకము 66*
*పరసతి కూటమి గోరకు, పరధనముల కాసపడకు, బరునెంచకుమీ, సరిగాని గోష్టి సేయకు, సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ !*
భావం: ఇతరుల స్త్రీలతోడ కలయికను కోరకుము, ఇతరుల భాగ్యములకు నాసక్తిపడకు, ఇతరులయొక్క దోషములను లెక్కింపకుము. మంచిది కాని సంభాషణ చేయకుము, భాగ్యము పోయినప్పుడు బంధువులకడకు చేరవలదు.
No comments:
Post a Comment