_*ఆధ్యాత్మికతలో ఎనిమిది సోపానాలు.*_
✳️🥀🌹🌻🪷🕉️🔯🥀🌹🪷🌻✳️
_*భావనాబలాత్ భక్తిరుత్తమ*_
_*నహి జ్ఞానేన సదృశమ్ పవిత్ర మిహ విద్యతే*_
_*బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి*_
_*స్థాణోః అచలమ్ ధృవమ్*_
💐 భగవంతుడు ఎక్కడో వున్నాడు. నేను ఆయనకి దూరంగా ఇక్కడున్నాను అనుకోవటం ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు♪.
🪷 ఆ తరువాతి స్థాయి - నాకు అయన ధ్యానంలో కనిపిస్తున్నాడు - అంటే ఇక్కడే బాగా దగ్గరలోనే ఉన్నాడాయన అనిపించటం రెండో మెట్టు♪.
🪷 ఆ తరువాత, నేను ఆయనతోనే వున్నాను అనుకోవటం ఆ పై స్థాయి మూడో మెట్టు♪.
🪷 అది కూడా దాటాక, _*"నేనూ-ఆయనా ఒకటే" (అహం బ్రహ్మాస్మి)*_ అనుకోవటం ఆ తరువాతిది నాల్గవ మెట్టు♪.
🪷 ఆ తరువాత క్రమంలో జగత్తులోని జీవరాసులన్నీ ఆయనే•. ఆయన తప్ప ఇంకేమీ కాదని, లేదని తెలుసుకోవటం ఐదవ మెట్టు ఉత్తమం♪.
🪷 ఆపై తన నిజ స్వరూపాన్ని గ్రహించి సర్వవ్యాపక - సర్వాత్మక - సర్వేశ్వర తత్వాన్ని కలిగి ఉన్న బ్రహ్మమే సచ్చిదానంద స్వరూపం విశ్వ వ్యాప్తం అని గుర్తించడము ఆరవ మెట్టు♪.
🪷 సత్యజ్ఞానానంతమైన పరబ్రహ్మము విశ్వపురుషుడు - ఉత్తమ పురుషుడు - పురుషోత్తముడు - అన్యము లేదు♪. సర్వమూ శూన్యమే - శూన్యమే సర్వము అనే కేవలజ్ఞానము చేత కైవల్యం నిర్ధారణ అవుతుంది•. ఇది ఏడవ మెట్టు♪.
🪷 పరిపూర్ణమైనది పరబాహ్యము ముందు తెలియబడిన ఏడు స్థితులు లేనివని - ఆవరణరహితము పరాత్పరమని గ్రహించి ఊరకుండి ఉన్నదున్నట్లుగా ఉండుట ఎనిమిదవ మెట్టు♪.
🪷 ఈ ఎనిమిది నిర్ణయాలు కలిగిన వారు - తమను తాము పోగొట్టుకున్న వారు - నిర్ణయించే వాడే లేడని - ఊరకుండుట కూడా నీరవ - నిశ్చల - నిశ్శబ్ద - నిరీహ - నిర్గుణ - నీరంధ్ర - నిరుపాధిక - నిరామయ - నిరంజనమనియెడిదే పరిపూర్ణము జన్మరహితము “శుద్ధ వియత్“
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
✳️🥀🌹🌻🪷🕉️🔯🥀🌹🪷🌻✳️
No comments:
Post a Comment