Monday, September 8, 2025

 *ధర్మరాజు దగ్గర నుంచి ఇంద్రప్రస్థ ని పరిపాలించిన రాజుల వివరాలు.*

*ధర్మరాజు ని మొదలుకొని యశ్వపాల మహారాజు పర్యంతం వరకు సుమారు 124 మంది రాజులు 4157 సంవత్సరాల 9 నెలల 14 రోజులు ఇంద్రప్రస్థ ని పరిపాలించారు. వారి వివరములు.*

ధర్మరాజు వంశములో 30 మంది రాజులు 1770 సంవత్సరాల 11 నెలల 10 రోజులు రాజ్యమును పరిపాలించారు. 

1)ధర్మరాజు 39 సంవత్సరాల 8 నెలల 18 రోజులు

2)పరీక్షిత్     60 సంవత్సరాలు

3)జనమేజియుడు 84 సంవత్సరాల 7 నెలల 23 రోజులు

4)అశ్వమేధుడు  82 సంవత్సరాల 8 నెలల 22 రోజులు 

5)రామరాజ ద్వితీయుడు 88 సంవత్సరాల 2 నెలల 8 రోజులు.

6)ఛత్రమలుడు  81 సంవత్సరాల 11 నెలల 27 రోజులు

7)చిత్రరధుదు 75 సంవత్సరాల 3 నెలల 18 రోజులు

8)దుష్టశైల్యుడు 75 సంవత్సరాల 10 నెలల 24 రోజులు

9)ఉగ్రసేనుడు 78 సంవత్సరాల 7 నెలల 21 రోజులు

10)శూరసేనుడు 78 సంవత్సరాల 7 నెలల 21 రోజులు

11)భువనపతి 69 సంవత్సరాల 5 నెలల 5 రోజులు

12)రణజీతుడు 65 సంవత్సరాల 10 నెలల 4 రోజులు

13)ఋక్షకుడు 64 సంవత్సరాల 7 నెలల 4 రోజులు

14)సుఖదేవుడు 62 సంవత్సరాల 24 రోజులు

15)నరహరిదేవుడు 51 సంవత్సరాల 10 నెలల 2 రోజులు

16)సుచీరధుడు 42 సంవత్సరాల 11 నెలల 2 రోజులు

17)రెండవ శూరసేనుడు 58 సంవత్సరాల 10 నెలల 8 రోజులు

18)పర్వతసేనుడు 55 సంవత్సరాల 8 నెలల 10 రోజులు

19)మేధావి 52 సంవత్సరాల 10 నెలల 10 రోజులు

20)సోనచీరుడు 50 సంవత్సరాల 8 నెలల 21 రోజులు.

21)భీమదేవుడు 47 సంవత్సరాల 9 నెలల 20 రోజులు

22)నృహరిదేవుడు 45 సంవత్సరాల 11 నెలల 23 రోజులు

23)పూర్ణమల్లుడు 44 సంవత్సరాల 8 నెలల 7 రోజులు

24)కరదవి 44 సంవత్సరాల 10 నెలల 8 రోజులు

25)అలమ్మిక 50 సంవత్సరాల 11 నెలల 8 రోజులు

26)ఉదయపాలుడు 38 సంవత్సరాల 9 నెలలు

27)దువనమలుడు 40 సంవత్సరాల 10 నెలల 26 రోజులు

28)దమాత 32 సంవత్సరాలు

29)భీమపాలుడు 58 సంవత్సరాల 5 నెలల 4 రోజులు

30)క్షేమకుడు 48 సంవత్సరాల 11 నెలల 21 రోజులు.

క్షేమకురాజుకు మంత్రిగా ఉన్న విశ్రవుడు క్షేమకుని చంపి రాజ్యమునకు అధిపతి అయ్యెను.అతని నుంచి అతని వంశం లోని 14 మంది రాజులు 500 సంవత్సరాల 3 నెలల 17 రోజులు రాజ్యమును పరిపాలించారు. 

31)విశ్రపుడు 17 సంవత్సరాల 3 నెలల 29 రోజులు

32)పురసేనుడు 42 సంవత్సరాల 8 నెలల 21 రోజులు

33)వీరసేనుడు 52 సంవత్సరాల 10 నెలల 7 రోజులు

34)అనంగశాయి 47 సంవత్సరాల 8 నెలల 23 రోజులు

35)హారిజిత్ 35 సంవత్సరాల 9 నెలల 17 రోజులు

36)పరమసేని 44 సంవత్సరాల 2 నెలల 23 రోజులు

37)సుఖపాతాలుడు 30 సంవత్సరాల 2 నెలలు 21 రోజులు

38)కద్రుతుడు 42 సంవత్సరాల 9 నెలల 24 రోజులు

39)సజ్జనుడు 32 సంవత్సరాల 2 నెలల 14 రోజులు

40)అమరచూడుడు 27 సంవత్సరాల 3 నెలల 16 రోజులు

41)అమీపాలుడు 22 సంవత్సరాల 11 నెలల 25 రోజులు

42)దశరధుడు 25 సంవత్సరాల 4 నెలల 12 రోజులు

43)వీరసాలుడు 31 సంవత్సరాల 8 నెలల 11 రోజులు

44)వీరసాలసేనుడు 47 సంవత్సరాల 14 రోజులు

వీరసాలసేనుని అతని మంత్రిగా నుండిన వీరమహుడు అతనిని చంపి తాను రాజ్య పరిపాలకూడయ్యెను.అతని నుంచి అతని కుటుంబం లో 16 మంది రాజులు 445 సంవత్సరాల 5 నెలల 3 రోజులు రాజ్యమును పరిపాలించిరి. 

45)వీరమహుడు 35 సంవత్సరాల 10 నెలల 8 రోజులు

46)అజితసింహుడు 27 సంవత్సరాల 7 నెలల 19 రోజులు

47)సర్వదత్తుడు 28 సంవత్సరాల 3 నెలల 10 రోజులు

48)భువనపతి 15 సంవత్సరాల 4 నెలల 10 రోజులు

49)మొదటి వీరసేనుడు 21 సంవత్సరాల 2 నెలల 13 రోజులు

50)మహీపాలుడు 40 సంవత్సరాల 8 నెలల 7 రోజులు

51)శత్రుశాలుడు 26 సంవత్సరాల 4 నెలల 3 రోజులు

52)సంఘరాజు 17 సంవత్సరాల 2 నెలల 10 రోజులు

53)తేజపాలుడు 78 సంవత్సరాల 11 నెలల 10 రోజులు

54)మాణిక చందుడు 37 సంవత్సరాల 7 నెలల 21 రోజులు

55)కామసేని 42 సంవత్సరాల 5 నెలల 10 రోజులు.

56)శత్రుమర్ధనుడు 8 సంవత్సరాల 11 నెలల 10 రోజులు

57)జీవనలోకుడు 28 సంవత్సరాల 9 నెలల 17 రోజులు

58)హరిరావు 26 సంవత్సరాల 10 నెలల 29 రోజులు

59)రెండవ వీరసేనుడు 35 సంవత్సరాల 2 నెలల 20 రోజులు

60)ఆదిత్య కేతువు 23 సంవత్సరాల 11 నెలల 13 రోజులు.

ఆదిత్యకేతువును ప్రయోగకు రాజుగా నుండిన ధంధ రుడు చంపి ఆ రాజ్యమును స్వాధీనం చేసుకోనెను. అతని నుంచి అతని వంశం లో 9 మంది రాజులు 374 సంవత్సరాల 11 నెలల 26 రోజులు రాజ్యమును పరిపాలించిరి. 

61)ధంధరుడు   42 సంవత్సరాల 7 నెలల 24 రోజులు

62)మహర్షి     41 సంవత్సరాల 2 నెలల 29 రోజులు

63)సనరచ్చి 50 సంవత్సరాల 10 నెలల 19 రోజులు

64)మహాయుద్దుడు 30 సంవత్సరాల 3 నెలల 8 రోజులు

65)దురనాధుడు 28 సంవత్సరాల 5 నెలల 25 రోజులు

66)జీవనరాజు 45 సంవత్సరాల 2 నెలల 5 రోజులు

67)రుద్రసేనుడు 47 సంవత్సరాల 4 నెలల 28 రోజులు

68)ఆరిలకుడు 52 సంవత్సరాల 10 నెలల 8 రోజులు

69)రాజపాలుడు 36 సంవత్సరాలు.

రాజపాలుడు అను రాజును అతని సామంతుడగు
మహాపాలుడు చంపి 14 సంవత్సరాలు రాజ్యం ఏలేను.

70)మహాపాలుడు 14 సంవత్సరాలు

అవంతికాపుర ఉజ్జయినాదిశుదగు విక్రమాధిత్యుడు మహాపలుని రాజ్యం మీదకి దండేత్తి వెళ్లి అతన్ని చంపి 36 సంవత్సరాలు రాజ్యం ఏలేను

71)విక్రమాదిత్యడు 36 సంవత్సరాలు

శాలివాహనుని సామంతుడిగా నుండి పైఠనుడైన
సముద్రపాలయోగి విక్రమాధిత్యుడిని చంపి అతని రాజ్య పరపాలకుడు అయ్యెను.అతని నుంచి అతని వంశం లో 16 మంది రాజులు 372 సంవత్సరాల 4 నెలల 27 రోజులు రాజ్యం పరిపాలించేను.

72)సముద్రపాలుడు 54 సంవత్సరాల 2 నెలల 20 రోజులు

73)చంద్రపాలుడు 36 సంవత్సరాల 5 నెలల 4 రోజులు

74)సహాయపాలుడు 11 సంవత్సరాల 4 నెలల 11 రోజులు

75)దేవపాలుడు 27 సంవత్సరాల నెల 28 రోజులు

76)నరసింహపాలుడు 18 సంవత్సరాల 20 రోజులు

77)సామపాలుడు  27 సంవత్సరాల నెల 27 రోజులు

78)రఘుపాలుడు 22 సంవత్సరాల 3 నెలల 25 రోజులు

79)గోవిందపాలుడు 27 సంవత్సరాల నెల 17 రోజులు

80)అమృతపాలుడు 36 సంవత్సరాల 10 నెలల 13 రోజులు

81)బలిపాలుడు 12 సంవత్సరాల 5 నెలల 27 రోజులు

82)మహిపాలుడు 13 సంవత్సరాల 8 నెలల 4 రోజులు

83)హరిపాలుడు 14 సంవత్సరాల 8 నెలల 4 రోజులు

84)సీసపాలుడు 11 సంవత్సరాల 10 నెలల 13 రోజులు

85)మదనపాలుడు 17 సంవత్సరాల 10 నెలల 19 రోజులు

86)కర్మపాలుడు 16 సంవత్సరాల 2 నెలల 2 రోజులు

87)విక్రమపాలుడు 24 సంవత్సరాల 11 నెలల 13 రోజులు

విక్రమపాలుడు పశ్చిమ దేశాధిపతి యగు మళ్ళుక చంద్ర భోహరుని మీదకు దాడి చేసి యుద్ధం లో చచ్చెను.అంతటితో మళ్ళుక చంద్రుడు ఇంద్రప్రస్థ కి రాజు అయ్యెను. అతని నుంచి అతని వంశం లో 10 మంది రాజులు 191 సంవత్సరాల నెల 16 రోజులు రాజ్యమును పరిపాలించేను.

88)మల్లుకచంద్రుడు 54 సంవత్సరాల 2 నెలల 10 రోజులు

89)విక్రమచంద్రుడు 12 సంవత్సరాల 7 నెలల 12 రోజులు

90)అమీనచంద్రుడు 10 సంవత్సరాల 5 రోజులు

91)రామచందుడు 13 సంవత్సరాల 11 నెలల 8 రోజులు

92)హరిచందుడు 14 సంవత్సరాల 9 నెలల 24 రోజులు

93)కళ్యాణచందుడు 10 సంవత్సరాల 5 నెలల 4 రోజులు

94)భీమచంధుడు 16 సంవత్సరాల 2 నెలల 9 రోజులు

95)లోవచందుడు 26 సంవత్సరాల 3 నెలల 22 రోజులు

96)గోవిందచందుడు 31 సంవత్సరాల 7 నెలల 12 రోజులు

97)పద్మావతి రాణి (గోవిందచందుని భార్య ) సంవత్సరం

పద్మావతి రాణి గతించేను. ఆమెకు సంతానం లేదు.హరిప్రేముని రాజును చేసిరి. అతని నుంచి అతని వంశం లో 4 రాజులు 50 సంవత్సరాల 21 రోజులు రాజ్యమును పరిపాలించేను.

98)హరిప్రేముడు 7 సంవత్సరాల 5 నెలల 16 రోజులు

99)గోవిందప్రేముడు 20 సంవత్సరాల 2 నెలల 8 రోజులు

100)గోపాలప్రేముడు 15 సంవత్సరాల 7 నెలల 28 రోజులు

101)మహాభాహుడు 6 సంవత్సరాల 8 నెలల 29 రోజులు

మహాభాహుడు తపస్సు చేయుటకు వనమునకు వెళ్ళిపోయెను.దీనిని విని బంగాళా దేశమునకు రాజుగా నుండిన అదిసేనుడు ఇంద్రప్రస్థ కి వచ్చి రాజు అయ్యెను. అతని నుంచి అతని వంశం లో 12 మంది రాజులు 151 సంవత్సరాల 11 నెలల 2 రోజులు రాజ్యమును పరిపాలించేను

102)ఆదిసేనుడు 18 సంవత్సరాల 5 నెలల 21 రోజులు

103)విలావసేనుడు 12 సంవత్సరాల 4 నెలల 2 రోజులు

104)కేశవసేనుడు 15 సంవత్సరాల 7 నెలల 12 రోజులు

105)మాధవసేనుడు 12 సంవత్సరాల 4 నెలల 2 రోజులు

106)మయూరాసేనుడు 20 సంవత్సరాల 11 నెలల 27 రోజులు

107)భీమాసేనుడు 5 సంవత్సరాల 10 నెలల 9 రోజులు

108)కల్యాణసేనుడు 4 సంవత్సరాల 8 నెలల 21 రోజులు

109)హరిసేనుడు 12 సంవత్సరాల 25 రోజులు

110)క్షేమసేనుడు 8 సంవత్సరాల 11 నెలల 15 రోజులు

111)నారాయణసేనుడు 2 సంవత్సరాల 2 నెలల 29 రోజులు

112)లక్ష్మీసేనుడు 26 సంవత్సరాల 10 నెలలు

113)దామోదరసేనుడు 11 సంవత్సరాల 5 నెలల 19 రోజులు


దామోదర సేనుడు తన సామంతులను మిక్కిలి పీడించుచుండినందున, వారిలో నొకడగు
దీపసింహుడు బలము కూర్చుకొని యుద్ధమున దామోదర సేనుని చంపి, తాను రాజ్యపాలకుడయ్యెను. అతనితో ఆ సంతతివారు 6 గురు రాజులు. వీరు 107 సంవత్సరములు 6 నెలల 12 రోజులు రాజ్యమేలిరి. 

114)దీపసింహుడు 17 సంవత్సరాల నెల 26 రోజులు

115)రాజసింహుడు 14 సంవత్సరాల 5 రోజులు

116)రణసింహుడు 9 సంవత్సరాల 8 నెలల 11 రోజులు

117)నరసింహుడు 45 సంవత్సరాల 15 రోజులు

118)హరిసింహుడు 13 సంవత్సరాల 2 నెలల 29 రోజులు

119)జీవనసింహుడు 8 సంవత్సరాల ఒక రోజు

జీవనసింహుడు తన సేన నంతయును ఏదియో కారణమును బట్టి ఉత్తర దిశకు పంపెను.
ఈ వార్త విరాటరాజగు పృథ్వీరాజు చౌహాణుడు విని అతని మీద దాడి చేసి యుద్ధమున ఆ జీవనసింహుని చంపి తా నా ఇంద్రప్రస్థ రాజ్యమును ఆక్రమించెను, అతనితో ఆ సంతతివారు 5 గురు రాజులు, వీరు 86 సంవత్సరములు 20 రోజులు
రాజ్యమేలిరి. 

120)పృథ్విరాజు 12 సంవత్సరాల 2 నెలల 19 రోజులు

121)అభయపాలుడు 14 సంవత్సరాల 5 నెలల 17 రోజులు

122)దుర్జనపాలుడు 11 సంవత్సరాల 4 నెలల 14 రోజులు

123)ఉదయపాలుడు 11 సంవత్సరాల 7 నెలల 3 రోజులు

124)యశపాలుడు 36 సంవత్సరాల 4 నెలల 27 రోజులు.

.

సుల్తాన్ షహబుద్దీన్ గోరి గజనీ నుండి యశపాలరాజు మీదికి యుద్ధమునకు వచ్చి అతనిని
బట్టి ప్రయాగ కోటలో విక్రమశకము 1249 వ సంవత్సరమున చెరపట్టి, తాను ఇంద్రప్రస్థమున
రాజ్యమేలెను. అతనితో ఆ సంతతివారు 53 మంది రాజులు. వీరు 754 సంవత్సరములు 1
మాసము 12 దినములు రాజ్యమేలిరి. దీని వివరణ అనేక ఇతిహాస గ్రంథములలో కానవచ్చును.
కావున దాని నిచ్చట వ్రాయలేదు.

ఇక కొన్ని ఇతిహాసములలో మహారాజను పృథ్వీరాజుపై సుల్తాను షహబుద్దీన్ గోరి దండెత్తి
అనేక పర్యాయములు పృథ్వీరాజుచే పరాభవమొంది తిరిగి పోయె ననియు, తుదకు 1249 వ (విక్రమ) సంవత్సరమున అంతఃకలహముల కారణము బట్టి పృథ్వీరాజును జయించి, అతనిని అంధునిగా చేసి, తన దేశమునకు కొనిపోయితా నా ఇంద్రప్రస్థము నేలె ననియు, ముసల్మానుల రాజ్యము 45 తరములు 613 సంవత్సరములు నిలిచియుండెననియు వ్రాయబడియున్నది.      

No comments:

Post a Comment