🕉️ *జై శ్రీమన్నారాయణ* 🕉️
*_🌴 ఉన్నచోట లేనిదాన్ని వెతకడం, లేనిచోట ఉన్నదాన్ని వెతకడం మానవుని అజ్ఞానములో చెప్పుకోదగ్గ గొప్ప విషయం!! దేవుని కోసమేనని ఏవేవో చేస్తుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. అయితే ఆయన అసలు స్థానాన్ని మాత్రం తెలుసుకోలేక పోతున్నారు. పూజలు, పుష్కరాలు వంటి బాహ్య పూజల దగ్గరే ఆగిపోతున్నారు. అడవుల్లో ఆకులు తింటేనే యోగి అవుతారు అనుకుంటే మేకలన్నీ యోగులే అయిపోయేవి. పుష్కరాల వలన పాపాలు పోయి పుణ్యాత్ములు అయిపోతాం అనుకుంటే చేపలు కన్నా పుణ్యాత్ములు ఎవరూ ఉండరు. తల కిందులు చేయడం వలన తపస్వి అయిపోతాం అనుకుంటే గబ్బిలాలే గొప్ప తపస్విలవుతాయి కదా!! ఇది కాదు మనం చేయాల్సింది. ఆత్మ విశ్వాసం అభివృద్ది పరచుకోవాలి. నిజానికి అన్ని మన లోపలే ఉన్నాయి. పరమాత్మ కూడా మనలోనే ఉన్నాడు. ఆనందం, సుఖ సంతోషాలు, శాంతులు అన్ని మనలోనే ఉన్నాయి. మనలో లేనిదేదీ బయట లేదు. ఈ సత్యం బాగుగా తెలుసుకుంటే దేవుని కోసం ఎక్కడికీ వెళ్లనవసరం ఉండదు. ఉన్నచోటే అన్నీ చేసుకోవచ్చు. అప్పుడు మనకు అవసరమైనదంతా మన దగ్గరికే వస్తుంది.🌴_*
No comments:
Post a Comment