Tuesday, April 12, 2022

మంచి మాట...లు (02-04-2022)

విష్ణు స్తోత్రం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥

హనుమ స్తోత్రాః
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥

దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

సుబ్రహ్మణ్య స్తోత్రం
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం ।
స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది మరియు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు...మా ఇంటి దైవం రామ భక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు..లక్ష్మి పద్మావతి సమేత తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు.. మరియు వల్లి దేవ సేనా సమేత తిరుత్తని బాల సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు 💐

02-04-2022:-శనివారం

ఈ మంత్రం చదువుతూ ఉగాది ప్రసాదం స్వీకరించాలి
శతయుర్వజ్రదేహయ
సర్వ సంపత్కరాయ చ
సర్వారిష్ఠ
నింబకదళ భక్షణమ్

ఈ రోజు AVB మంచి మాట..లు

కష్టం - ప్రార్ధన నేర్పిస్తుంది, ఇష్టం - త్యాగాన్ని నేర్పిస్తుంది, శ్రమ - ఓర్పు ను నేర్పిస్తుంది, ప్రేమ - క్షమించడం నేర్పిస్తుంది, విజయం - గెలుపు విలువ నేర్పిస్తుంది, ఓటమి - కన్నీటి బరువును నేర్పిస్తుంది.


మంచివాడిగా బ్రతకాలంటే చాలా వదులుకోవాలి, అదే చెడ్డవాడిగా బ్రతకాలంటే మంచితనం మాత్రం వదిలేస్తే చాలు.

బుద్ధిమంతులు తోను, మూర్ఖులు తోను, మిత్రులు తోను, గురువులు తోను, ఇష్టమైన వారితోను అనవసరం గా వాగ్వివాదానికి దిగకూడదు.

ప్రతి అనుభవం జీవితం లో ఎక్కడో ఒకచోట ఉపయోగ పడుతుంది. ఎందుకంటే, ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప.

మంచి వారికి చేసిన మేలు శిల మీద అక్షరం లా కలకాలం నిలిచి ఉంటుంది. చెడ్డ వారికి చేసిన మేలు నీటి మీద రాతలా వెంటనే మాయమై పోతుంది.
సేకరణ ✒️ AVB సుబ్బారావు.📱 9985255805

సేకరణ

No comments:

Post a Comment