Tuesday, April 12, 2022

మంచి మాట...లు (12-04-2022)

హనుమ స్తోత్రాః
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥

దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

శ్రీరామ స్తోత్రాం
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః ।
సీతాముఖాంభోరుహాచంచరీకో నిరంతరం మంగళమాతనోతు ॥

సుబ్రహ్మణ్య స్తోత్రం
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం ।
స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు.. రామ భక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు... వల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
12-04-2022:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట..లు

మనం ఆనందంగా ఉంటే మన జీవితం బాగుంటుంది.. కానీ మన వల్ల ఇతరులు ఆనందంగా ఉంటే మన జీవితం గొప్పగా ఉంటుంది..

ఎవరికి తలవంచనిది ఆత్మగౌరం ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మభిమానం ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత ఈ మూడు కలిసిన జీవితమే ఆదర్శనీయం ,

స్నేహం చేయ్యడానికి ఒకే వయసు ఒకే అంతస్తు ఒకే హోదా ఉండనక్కర్లేదు అర్థం చేసుకునే రెండు హృదయాలు ఉంటే చాలు

స్కూల్లో నేర్పిన పాఠాలు అయినా మర్చిపోతామేమో కానీ కొందరు నిజజీవితంలో నేర్పిన గుణ పాఠాలను మాత్రం ఎప్పటికి మరచిపోలేం .

మనకెంత ఆస్తి ఉన్నా అన్నమే తింటాం...మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచిగుణాన్నే చూస్తారు..మనమే కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్నే చూస్తారు.. మనదె మతమైనా అందరూ చూసేది మనవత్వాన్నే

ధనముంటే ధనవంతుడు అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు .
✒️AVB సుబ్బారావు
📱9985255805

సేకరణ

No comments:

Post a Comment