Monday, April 11, 2022

నేటి మంచిమాట. మితిమీరిన కోపం ఉందంటే, అది ఆ వ్యక్తి దోషం కాదు?

నేటి మంచిమాట.

వ్యక్తిగత విభేదాలు లేకుండా,ఒక వ్యక్తి మీద నీకు మితిమీరిన కోపం ఉందంటే,అది ఆ వ్యక్తి దోషం కాదు? నీ అహం లో ఉన్న లోపం అది.. ఒకటి మాత్రం నిజం,నువ్వు ఆ కోపం దగ్గరే ఆగిపోతావు,వారు నీ కోపాన్ని ఇంకా ఇంకా పెంచే స్థాయికి చేరుకుంటారు..

🔸ఏ ఇద్దరి మనస్తత్వాలు,
అభిరుచులు,ఏ రెండు అణువుల మధ్య పోలిక ఒకేలా వుండవు ఇది సైన్స్ చెపుతున్న తీయరి కానీ నైతిక పరమైన అంశాలు కొన్ని వుంటాయి వాటిని కాపాడుకుంటూ మానవత్వపు విలువలని సాటి చెపుతూ సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తూ ఆదర్శ వంతంగా వుంటున్న వారు ధన్యులు..

🔹తెలివి కి నిదర్శనం తప్పులు ఎత్తి చూపటం కాదు దానికి పరిష్కారం వెతకడం..

🔸అభాండం వేసే ముందు వెనుక ముందు ఆలోచించ కుండా వేయకూడని నింద వేస్తే అది నిజం కాక పోతే నీ జీవితం లోనే దానికి మాల్యం చెల్లించాల్సి ఉంటుంది..

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment