🪐కాలమంతా
శుభకరమే ☸️
🕉️🌞🌎🏵️🌼🚩
మేలైన విషయాలే వినాలి, మంచి సంఘటనలనే చూడాలి' అని వైదిక స్వస్తి మంత్రాలు చెబుతున్నాయి. ఇది ఒక ఆకాంక్ష, ఆశీస్సు. ఇందులో ఇంకా ఎన్నో ఆంతర్యాలున్నాయి. లోకంలో ఏమి జరిగినా, అందులో మేలైన వాటినే స్వీకరించాలి. మంచివి కానివి విడిచిపెట్టాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులలో చెడు వెతకకుండా, ఉన్నా పట్టించుకోకుండా, మంచిని మాత్రమే స్వీకరించి, అభినందించి, ఆదర్శంగా తీసుకుంటే, ఉభయతారకం.
‘ఇతరులు వంద తప్పులు చేసినా లెక్కించకుండా, ఒక్క ఒప్పును ఆచరించినా అభినందించడం' శ్రీరాముడి లక్షణంగా వాల్మీకి వర్ణించారు. శ్రీరాముడు విజయం సాధించాక, ఆ వార్తను సీతమ్మకు హనుమంతుడు తెలియజేసి- 'అమ్మా! నిన్ను ఇంతకాలం సూటిపోటి మాటలతో బాధించిన ఈ రాక్షస స్త్రీలను ఒక్క దెబ్బతో శిక్షిస్తాను' అంటాడు. అప్పుడు జానకీదేవి హనుమను వారిస్తూ- 'నాయనా! అప్పటి పరిస్థితుల్లో వారి ప్రవర్తన అది. ఇప్పుడు వేరు. వారిని క్షమించాలి' అన్నది. అది భూపుత్రిక ఉదార దృష్టి.
వనవాసానికి ఆజ్ఞాపించిన కైకేయిలోనూ ఉత్తమ భావాన్నే దర్శించి మన్నించాడు సీతాపతి. శత్రువైనా సరే 'తప్పును ఒప్పుకొని, మరి చేయనని శరణాగతుడైతే క్షమిస్తాను' అని అభయమిచ్చాడా స్వామి.
మంగళాలే వినబడాలి, కనబడాలి- అనే వేదాశీస్సులలో ఆంతర్యం ఏమిటి? మనకు ప్రతికూలం(అశుభం) అనిపించే సంఘటనల్లోనూ వేదనకు తొందరకు గురికాకుండా సహనం వహించడం,
సానుకూలంగా మలచుకోవడం చేతనవ్వాలి. ఇవి శుభలక్షణాలు. తమ జీవన గతిలో అనుకోకుండా సంభవించిన ప్రతికూలతల్నీ తెలివిగా సానుకూలంగా మలచుకొని, విజయాలను సాధించిన గొప్పవారి జీవితాలెన్నో ఉదాహరణలుగా కనిపిస్తాయి. అవి శుభకర జీవితాలు. ఆదర్శంగా తీసుకొనేవారికి శుభకృత్తులు.
భగవంతుడంటేనే మంగళస్వరూపుడు. సూర్యుడు కాంతిమయుడు, బెల్లం తీపిమయం- అయినట్లే భగవంతుడు శుభస్వరూపుడు. అలాంటి దైవాన్ని హృదయంలో ధ్యానించేవారు, చింతించేవారు శుభకరమైన ఆలోచనలోనే ఉంటారు.మన సనాతన సంస్కృతిలో 'భగవంతుడు అందరి హృదయంలో ఉన్నాడు' అనే దర్శనం ఉంది. అందరిలో ఉన్నా, ఉన్నాడనే స్పృహ కొందరిలోనే ఉంటుంది. అటువంటివారు అన్నింటిలో, అందరిలో
మంగళాత్మకుడైన ఈశ్వరుడున్నాడనే స్పృహతో ఉంటారు. కనుక అందరినీ సాదరంగా చూడగలరు, సానుభూతితో సహకరించగలరు.
ఎండలో, వానలో, చలిలో కాలంలోని మార్పుల్లో, ప్రకృతి పరిణామాల్లో శుభాలు, అశుభాలు- రెండూ ఉన్నట్లు కనబడుతున్నా- అవి సహజాలు. కొన్నింటిని సహిస్తూ, సానుకూలంగా మలచుకుంటూ, ఇంకొన్నింటిని ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ తృప్తిగా జీవించడం అలవాటు చేసుకుంటున్నాం. అలాగే జీవితంలోని మలుపుల్నీ స్వీకరించాలి.
ప్రతి కొత్త సంవత్సరంలో శుభాలను కోరుకోవడంతోపాటు, శుభాచరణలకు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. దయ, సహకారం, సహనం, ప్రేమ, నైతికత వంటి శుభ స్వభావాలకు, భావాలకు కాలం ఎప్పడూ 'శుభకృత్' గానేఅనుకూలిస్తుందని ధార్మిక గ్రంథాలు బోధలతో గాథలతోవివరిస్తున్నాయి.
✍🏻సామవేదం షణ్ముఖశర్మ
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment