Thursday, April 7, 2022

నేటి మాటల ముత్యాలు.

నేటి మాటల ముత్యాలు.

గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు..వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది..

🌟చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు,ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం,చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు,వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం..

⭐ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు..నీ మీద వుంచిన నమ్మకాన్ని మంచి గౌరవాన్ని కోల్పోయావని త్వరలో తెలుస్తుంది..మోసాగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతోకాలం నిలువదు..

🔅అందంగా ఉన్నవన్నీ ఆనందాన్ని కలిగించవు..వస్తువులు, సదుపాయాలు కొంత వరకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి..కానీ మీ మనసు ప్రశాంతముగా ఉన్నప్పుడు మాత్రం అన్నీ అందంగానే కనిపిస్తాయి..

🔸ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసుని ప్రశాంతముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము..ఘర్షణ పడుతూ ఏమి సాధించగలగుతున్నాము..

🔹ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే..మనకు మనమే..మార్గదర్శకులుగా..మారతాం..
ఎవరికంటేనో గొప్పగా ఉండాలనుకోకు గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు..

శుభోదయం తో మానస 👏

సేకరణ

No comments:

Post a Comment