Thursday, April 7, 2022

|| కణ్ణదాసన్ పలుకు ||

|| కణ్ణదాసన్ పలుకు ||

"పుట్టడం వల్ల వచ్చేది ఏమిట"ని అడిగాను
"పుట్టి చూడు" అని భగవంతుడు అజ్ఞాపించాడు!
"చదువు అని అనడం ఏమిట"ని అడిగాను
"చదివి చూడు" అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
"తెలివిడి అని అనడం ఏమిట"ని అడిగాను
" తెలుసుకుని చూడు" అని‌ భగవంతుడు అజ్ఞాపించాడు!
"అనురాగం అని అనిపించేది ఏమిట"ని అడిగాను
" ఇచ్చి చూడు" అని‌ భగవంతుడు ఆజ్ఞాపించాడు!
"మమకారం అనేది ఏమిట"ని అడిగాను
"పంచి చూడు" అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
"ఇల్లాలి సుఖం అంటే ఏమిట" ని అడిగాను
"పెళ్లి చేసుకుని చూడు" అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
"బిడ్డ అనేది ఏమిట"ని అడిగాను
" కని చూడు" అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
"వృద్ధాప్యం అనేది ఏమిట"ని అడిగాను
" ఎదిగి‌ చూడు" అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
"బీదరికం అంటే ఏమిట" ని అడిగాను
"బాధపడి చూడు" అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
"మరణించాక ఏమిట"ని అడిగాను
" మరణించి‌ చూడు" అని భగవంతుడు ఆజ్ఞాపించాడు.
"అనుభవించి తెలుసుకోవడమే బ్రతుకంటే
భగవంతుడా నువ్వెందుకు?" అని‌ అడిగాను
భగవంతుడు కొంచెం దగ్గఱికి వచ్చి
"అనుభవం అన్నదే నేనే" అన్నాడు.

తెలుగులో
|| రోచిష్మాన్ ||

సేకరణ

No comments:

Post a Comment