Sunday, April 10, 2022

Steve Jobs Golden words, స్టీవ్_జాబ్స్ చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు...

నేటి జీవిత సత్యం.

#స్టీవ్_జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:
🍀🌹💦🔥💦🌹🍀

పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.

రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.

నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే జీవితం.

అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.

మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.

30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.

మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు.

ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.

మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే.
నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.

నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.

అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.

👉జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి:

1. మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.

2. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.

3. వంద కారణాలు చూపినా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.

4. మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.

5. వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.

చివరగా, వీటిని గుర్తుంచుకో:
వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం !

మళ్ళీ చెప్తున్న నీ జీవితంలో ప్రతిమలుపులో..!!

నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకో !!

✍ Steve Jobs Golden words

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment