Sunday, March 2, 2025

 *ప్రేరణ 🎯 మార్గ*       ‘ఓర్పు ఉన్న వ్యక్తికి వేరే కవచం అవసరం లేదు. 

కోపం ఉన్నవాడికి వేరే శత్రువులు ఉండక్కరలేదు. 

దాయాదులు ఉంటే వేరే నిప్పు అవసరం లేదు. 

మంచి మిత్రులు ఉన్న వ్యక్తికి ఔషధాలు అక్కరలేదు. 

దుష్టులు దగ్గరుంటే భయంకరమైన విష సర్పాలతో పని లేదు. 

మంచి విద్య ఉన్నవారికి మరే సంపదలూ అక్కరలేదు. 

లజ్జ ఉన్నవారికి ఎటువంటి ఆభరణాలూ అవసరం లేదు.

 ఉదాత్తమైన కవితాశక్తి ఉన్నవాడికి రాజ్యం అవసరం లేదు’’ అని భావం.

👉 అంటే సహనం రక్షిస్తుంది. కోపం నాశనం చేస్తుంది. దాయాదులు కీడు చేస్తారు. స్నేహితులు హితవు కోరి, మంచి దారి చూపిస్తారు. దుష్టులు హాని చేస్తారు. విద్య తరగని నిధిగా ఆదుకుంటుంది. లజ్జ... అంటే యుక్తమైన ప్రవర్తనే అలంకారమవుతుంది. ఉదాత్తుడైన కవి... పాలకులను మించిన కీర్తిని పొందుతాడు.   

No comments:

Post a Comment