How a Father Lives Inside a Son — Franz Kafka #subscribe #support @PhiloVi #happyfatherday #kafka
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QhSL0MPRfqo
Transcript:
(00:07) నీ తండ్రి ఒక్కసారి నిన్ను చూసి [సంగీతం] నువ్వు పనికి మాలిన వాడివి అన్నాడు. ఆ మాట నీలో ఎంతకాలం నిలిచింది ఒక్క రోజా ఒక్క [సంగీతం] నెల కాఫ్కాకు మాత్రం అది జీవితాంతం మిగిలిపోయింది. అతని తండ్రి అతన్ని [సంగీతం] చంపింది చేతులతో కాదు మాటలతో చూపులతో నిర్లక్ష్యంతో కాఫ్కా ఆ నొప్పిని ఒక ఉత్తరంగా రాశడు. అది కేవలం ఒక ఉత్తరం కాదు తండ్రి భయంతో గాయపడిన ఒక మనసు యొక్క అరుపు కాఫ్కా తన తండ్రికి రాసిన ఆ ఉత్తరంలో 45 పేజీల పొడవు కానీ ఆ ఉత్తరం తండ్రి కళ్ళ వరకు చేరలేదు మధ్యలోనే ఆగిపోయింది.
(00:42) కాఫ్కా తల్లి దాన్ని అతనికే తిరిగిచ్చింది. అయితే ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ [సంగీతం] ఉత్తరాన్ని తండ్రి చదవలేదు. కానీ ప్రపంచం మొత్తం చదివింది. నేడు దాన్ని లెటర్ టు హిస్ ఫాదర్ అని పిలుస్తారు. లిటరీ హిస్టరీలో అత్యంత [సంగీతం] శక్తివంతమైన ఉత్తరాల్లో అది ఒకటి. కాఫ్కా ఆ 45 పేజీల ఉత్తరంలో ఒకచోట ఇలా రాశడు. మై డియరెస్ట్ ఫాదర్ యు ఆస్క్ మీ రీసెంట్లీ వై ఐ మెంటన్ దట్ ఐ యమ్ అఫ్రైడ్ ఆఫ్ యు యస్ యూజువల్ ఐ వాస్ అబుల్ టు థింక్ ఆఫ్ ఎనీ ఆన్సర్ పార్ట్లీ ఫర్ ద వెరీ రీసన్ దట్ ఐ యమ్ అఫ్రైడ్ ఆఫ్ యు.
(01:11) తెలుగులో చెప్పాలి అంటే [సంగీతం] నీ ముందు నిలబడినప్పుడు నేను చాలాసార్లు మౌనంగా ఉండిపోయేవాడిని. నువ్వు మాట్లాడొద్దని చెప్పలేదు. కానీ నేను ఏమి చెప్పినా అది నీకు నచ్చదని నాకు తెలుసు. [సంగీతం] నచ్చకపోతే నీ చూపులు మారేవి. ఆ చూపులే నన్ను ఎక్కువగా భయపెట్టేవి.ఈ ఈ మాటలు చదివినప్పుడు అవి కేవలం కాఫ్కా మాటల్లా అనిపించవు.
(01:30) చాలా మంది పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిన బాధలా అనిపిస్తాయి. ఆ బాధను అనుభవించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దాన్ని మాటల్లో బంధించినవాడు కాఫ్కా ఇది [సంగీతం] కేవలం ఒక కొడుకు రాసిన ఉత్తరం కాదు భయంతో పెరిగిన ఒక మనసు యొక్క సాక్ష్యం. కాఫ్కా రాసిన మాటలు చదివినప్పుడు ఒళ్ళు గగురుపొడుస్తాయి. ఎందుకంటే మనల్ని ఎప్పుడూ మాటలే గాయపరచవు.
(01:52) కొన్నిసార్లు ఒక చూపే చాలుతుంది. అతని తండ్రి చూపు ఏమి చేస్తుందో కాఫ్కా చెప్పాడు. అది మనిషిలోని ధైర్యాన్ని నెమ్మదిగా చంపేస్తుంది. ఆ చూపు తన మీద తనకే డౌట్ వచ్చేలా చేస్తుంది [సంగీతం] అని చెప్పాడు. కాఫ్కా నేరుగా తన తండ్రి గురించి కథలు రాయలేదు. కానీ అతని ప్రతి కథలో [సంగీతం] అతని తండ్రి నీడ కనిపిస్తుంది వేరే రూపంలో. మెటమార్ఫసిస్ అనే కథ రాశాడు.
(02:13) ఒక ఉదయం గ్రెగర్ సామ్సన్ నిద్రలేచేసరికి తాను ఒక భారీ పురుగుగా మారిపోయాడని తెలుసుకుంటాడు. ఈ కథ చదివిన చాలా మంది ఒకే ప్రశ్న అడిగారు మనిషి పురుగుగా ఎలా మారతాడు అని కాఫ్కా ఇలా సమాధానం ఇచ్చాడు. ఒక మనిషి [సంగీతం] కుటుంబానికి ఉపయోగపడకపోతే ఏమవుతాడు తండ్రికి గర్వకారణం కాకపోతే ఏమవుతాడు [సంగీతం] నెమ్మదిగా అతను మనిషిగా కనిపించడం మానేస్తాడు.
(02:34) అతను భారంగా మారతాడు. అవసరం లేని వాడిగా మారతాడు. తన ఇంట్లోనే పరాయివాడిగా మారతాడు. గ్రెగర్ సామ్సా నిజంగా పురుగుగా మారలేదు. కానీ అందరి కళ్ళలో అతను ఒక పురుగుగా మారిపోయాడు. మెటమార్ఫసిస్ కథలో దాగి ఉన్న ఆ బాధ కాఫ్కా సొంత జీవితంలోని బాధే అందుకే [సంగీతం] చాలామంది అంటారు మెటమార్ఫసిస్ ఒక పురుగు కథ కాదు తండ్రి అంగీకారం కోసం జీవితాంతం ఎదురుచూసిన ఒక కొడుకు కథ అని [సంగీతం] కాఫ్కా ద జడ్జ్మెంట్ అనే మరో కథ రాశాడు ఆ కథలో ఒక కొడుకు తన తండ్రితో మాట్లాడుతాడు తర్వాత అకస్మాత్తుగా తండ్రి అతనికి ఒక తీర్పు ఇస్తాడు నిన్ను మునిగి చావమని శిక్షిస్తున్నాను ఆశ్చర్యకరమైన
(03:10) విషయం ఏమిటంటే కొడుకు ఆ తీర్పును ఎదిరించడు ప్రశ్నించడు అతను నేరుగా వెళ్లి నదిలో దూకేస్తాడు. ఈ కథ చదివిన వాళ్ళు ఒకే ప్రశ్న అడిగారు. ఒక మనిషి ఇలా ఎందుకు చేస్తాడు? కాఫ్కా సమాధానం కథలోనే దాగి ఉంది. తండ్రి [సంగీతం] మాటకు కొడుకు తన జీవితాని కంటే ఎక్కువ శక్తి ఇచ్చాడు. తండ్రి తీర్పు తప్పు అని చెప్పే ధైర్యం అతనికి లేదు.
(03:32) [సంగీతం] తండ్రిని తిరస్కరించే బలం అతనికి లేదు. తండ్రి నువ్వు పనికిరావు అంటే కొడుకు దాన్ని ఒక అభిప్రాయంగా వినలేదు ఒక తీర్పులా స్వీకరించాడు. అలా నమ్మిన క్షణం నుంచే అతని లోపల ఏదో చనిపోవడం ప్రారంభంవుతుంది. కాఫ్కా తన మనసులో జరిగిన యుద్ధాన్ని ఈ కథ రూపంలో రాశాడు. [సంగీతం] అందుకే చాలా మంది అంటారు. ద జడ్జ్మెంట్ ఒక కథ కాదు తండ్రి తీర్పుతో జీవించిన ఒక కొడుకు మనసు కథ అని.
(03:56) [సంగీతం] కాఫ్కా తన ఉత్తరంలో తండ్రిని తిట్టలేదు. తండ్రిపై ప్రతీకారం తీర్చుకోలేదు. తండ్రిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకచోట అతను ఇలా రాశడు. ఐ డు నాట్ క్లేమ్ దట్ యు వర్ రాంగ్ యు ఆక్టెడ్ అకార్డింగ్ టు యువర్ నేచర్ అంటే [సంగీతం] నువ్వు చెడ్డ తండ్రివ అని నేను అనడం లేదు నువ్వు నీలాగే ఉన్నావు కానీ నేను నీ కొడుకుగా జన్మించడం అది నా తప్పు.
(04:17) కాఫ్కా జీవితం అంతా ఒక ప్రశ్నతో గడిచింది. నా తండ్రి నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు. కానీ బహుశా అతని తండ్రికి ఒక ప్రశ్న ఉండి ఉండవచ్చు. నా కొడుకు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడని మనందరం మన కథలో హీరోలమే. [సంగీతం] కానీ ఇంకొకరి కథలో మనమే గాయం కూడా కావచ్చు. కాఫ్కా కథ ముగిసేసరికి నాకు మాత్రం ఒక ప్రశ్న మిగిలింది నువ్వు కోరినట్లు నేను ఉండాలి అని ఆశించే నా తండ్రి మరి [సంగీతం] నీ తండ్రి కోరినట్లుగా నువ్వు ఉన్నావా ఓం
No comments:
Post a Comment