Wednesday, November 4, 2026

ప్రైవేట్ పార్ట్స్ విషయంలో ఈ 4 తప్పులు చేస్తున్నారా? వెంటనే తెలుసుకోండి! | Health Tips Telugu

ప్రైవేట్ పార్ట్స్ విషయంలో ఈ 4 తప్పులు చేస్తున్నారా? వెంటనే తెలుసుకోండి! | Health Tips Telugu

Author Name:Vardhan Ayurveda

Youtube Channel Url:https://www.youtube.com/@Vardhanayurveda

Youtube Video URL:https://www.youtube.com/watch?v=myouPEnzEIA





Title: ప్రైవేట్ పార్ట్స్ విషయంలో ఈ 4 తప్పులు చేస్తున్నారా? వెంటనే తెలుసుకోండి! | Health Tips Telugu

Author Name: Vardhan Ayurveda

Description: 60 దాటిందా? ఈ 4 ప్రైవేట్ పార్ట్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దు | Never Ignore These 4 Private Body Parts | Health Tips Telugu | Vardhan Ayurveda

Invite your friends to join our WhatsApp Group for daily health tips from Vardhan Ayurveda.
https://chat.whatsapp.com/Ecgv83MDEGZ...

Essential intimate hygiene tips for men and women after 60. Learn proper private parts care, prevent infections, and know the warning signs you should never ignore
#privatepartshealth #privatepartscare #privatepartshygiene #intimatehealth #intimatehygiene #genitalhealth #genitalhygiene #seniorhealth #menshealth #womenshealth #sexualhealth #reproductivehealth #personalhygiene #healthawareness #teluguhealthtips #healthtips

timestamps
00:00 - Private Parts Hygiene: Mistakes You Should Avoid
01:05 - Why Should People Over 60 Be More Careful?
02:10 - What Does Ayurveda Say About Intimate Hygiene?
03:15 - How to Clean the Groin Area Properly
05:10 - Itching and Fungal Infections in the Groin Area
06:15 - Male Intimate Hygiene: Essential Tips
07:35 - What Is Smegma? Causes and Health Risks
08:35 - 3 Essential Intimate Hygiene Tips for Men
09:20 - Female Intimate Hygiene: Proper Care
10:35 - 5 Golden Rules of Intimate Hygiene for Women
12:10 - Intimate Hygiene Tips for Women After 60
13:05 - How to Clean the Anal Area Properly
14:25 - Why Is Anal Hygiene Important After 60?
15:25 - 7 Essential Rules for Private Parts Hygiene
17:10 - Intimate Hygiene Mistakes You Must Avoid
18:15 - When Should You Consult a Doctor?
19:35 - Warning Signs of Private Parts Health Problems
20:35 - Important Intimate Hygiene Tips
21:30 - Conclusion

Welcome to Vardhan Ayurveda Hospital - Trusted Ayurvedic Healthcare

At Vardhan Ayurveda Hospital, we offer authentic Ayurvedic treatments, Panchakarma therapies, and natural healing solutions for a wide range of health problems. Our experienced Ayurvedic doctors specialize in joint pain relief, diabetes management, nerve disorders, stress relief, skin care, weight loss, and chronic disease management.

We focus on treating the root cause naturally and holistically, ensuring long-term wellness.

What You’ll Find on Our Channel:
🪔 Ayurvedic Health Tips & Remedies
🪔 Panchakarma & Detox Treatments
🪔 Patient Testimonials & Success Stories
🪔 Doctor Consultations & Expert Advice
🪔 Daily Wellness & Lifestyle Guidance

🔔 Book Your Consultation Today
📞 Call Us: +91 9056 95 95 95
🌐 Explore More: vardhanayurveda.com

📢 Follow Us on Social Media:
👉 Facebook:   / vardhanayurvedahospital  
👉 Twitter:   / vardhan32593656  
👉 Instagram:   / vardhanayurvedahospital  

Watch More Health Tips in Telugu | Vardhan Ayurveda
డాక్టర్ చెప్పిన స్పైన్ హీలింగ్ రహస్యాలు –    • డాక్టర్ చెప్పిన స్పైన్ హీలింగ్ రహస్యాలు  |...  
త్వరగా నిద్ర రావడానికి 6 సహజ మార్గాలు –    • త్వరగా నిద్ర రావడానికి 6 సహజ మార్గాలు | Be...  
వాకింగ్ చేయండి.. 12 రకాల జబ్బులు Bye Bye! –    • వాకింగ్ చేయండి.. 12 రకాల జబ్బులు Bye Bye! ...  
జీవితాన్ని మార్చే 14 శక్తివంతమైన అలవాట్లు –    • జీవితాన్ని మార్చే 14 శక్తివంతమైన అలవాట్లు ...  
మెడిసిన్ లేకుండా శరీరం వ్యాధులను పోగొడుతుందా? –    • మెడిసిన్ లేకుండా శరీరం వ్యాధులను పోగొడుతుం...  
100 Years Healthy Life Secret | నీళ్లు తాగే సరైన విధానం –    • 100 Years Healthy Life Secret 💧 | నీళ్లు త...  
60+ తర్వాత ఫిట్‌గా ఉంచే 5 రహస్యాలు –    • 60+ తర్వాత ఫిట్‌గా ఉంచే 5 రహస్యాలు | Stay ...  
శనగలు తినండి.. ఆరోగ్యాన్ని పొందండి –    • శనగలు తినండి ఆరోగ్యాన్ని పొందండి | 10 Bene...  
పెరుగు తినే సరైన విధానం ఇదే –    • పెరుగు తినే సరైన విధానం ఇదే I The Right Wa...  
రాగి జావ: 7 Health Miracles You Must Know! –    • రాగి జావ: 7 Health Miracles You Must Know!...  
60 తర్వాత తప్పక తినాల్సిన 10 ఫుడ్స్ –    • 60 తర్వాత తప్పక తినాల్సిన 10 ఫుడ్స్: Best ...  
రోజూ వెల్లుల్లి తింటే డాక్టర్ అవసరమే లేదు –    • రోజూ వెల్లుల్లి తింటే డాక్టర్ అవసరమే లేదు ...  
60 తర్వాత తప్పక పాటించాల్సిన 5 Morning Habits –    • 60 తరువాత తప్పక పాటించాల్సిన 5 మార్నింగ్ హ...  

Subscribe now for regular updates on Ayurveda, natural healing, and holistic wellness
#Ayurveda #Panchakarma #VardhanAyurveda #NaturalHealing #HolisticHealth
#VardhanAyurvedaHospital #Ayurveda #AyurvedicTreatment #Panchakarma #NaturalHealing #JointPainRelief #DiabetesManagement #NerveDisorders #StressRelief #SkinCare #WeightLoss #ChronicDiseaseManagement #HolisticHealth #AyurvedicDoctor #Wellness #HealthTips #AlternativeMedicine #AyurvedicTherapy #HealthyLifestyle #PainRelief #DetoxTreatment #AyurvedaForLife #NaturalWellness #AyurvedicSolutions #HealingNaturally #TeluguHealth #IndianAyurveda #AyurvedicCare #HolisticHealing #AyurvedaTips

Transcript:
(00:04) 60 దాటిందా ఈ నాలుగు ప్రైవేట్ పార్ట్స్ ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు ఇంతకుముందు మన ఛానల్ లో అందరూ ముఖ్యంగా 60 దాటిన వారు డైలీ క్లీన్ చేసుకోవాల్సిన ఐదు బాడీ పార్ట్స్ అనే వీడియో చేశాం. అది మీ అందరికీ చాలా బాగా నచ్చింది. మంచి ఉపయోగకరంగా ఉందని మీ అందరి నుండి మంచి స్పందన కూడా వచ్చింది. ఆ వీడియో చూసిన చాలామంది ప్రైవేట్ పార్ట్స్ క్లీనింగ్ గురించి ఒక వీడియో చేయమని అడిగారు.
(00:36) దాని ఎక్స్టెన్షన్ గానే ఈ వీడియో చేస్తున్నాం. మనం మన ఇంటిని రోజూ శుభ్రం చేసుకుంటాం. బట్టలు ఉతుక్కుంటాం, ముఖం కడుక్కుంటాం. పళ్ళు తోముకుంటాం. జుట్టు శుభ్రం చేసుకుంటాం. కానీ మన శరీరంలో బయట కనిపించని కొన్ని భాగాలను మాత్రం మనం అస్సలు పట్టించుకోం. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆ భాగాలలో చెమట, తేమ, మలినాలు చర్మం నుంచి వచ్చే స్్రావాలు కొన్నిసార్లు మూత్రం లేదా మల విసర్జన తాలకు అవశేషాలు పెరుగుపోతూ ఉంటాయి.
(01:11) దీనివల్ల దురద, మంట, దుర్వాసన, దద్దుర్లు, చర్మం పగిలిపోవడం ఇన్ఫెక్షన్లు రావడం వంటి అనేక సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఈరోజు నేను చెప్పబోయే విషయం కొంచెం పర్సనల్ కావచ్చు కానీ ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు సిగ్గుపడడం కంటే సరైన అవగాహన ఉండడమే ముఖ్యమని నేను భావిస్తాను. నమస్కారం నేను డాక్టర్ వర్ధన్ వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద YouTube ఛానల్.
(01:41) ప్రకృతి నుంచి లభించే ఔషధాల ద్వారా శరీరాన్ని లోపలి నుండి పునరుజ్జీవింప చేయడమే ఆయుర్వేదాన్ని అన్నిటికంటే శ్రేష్టమైనదిగా నిలబెడుతుంది. 10 లక్షల మందికి పైగా కొత్త జీవితాన్ని అందించిన 27 ఏళ్ల నా ఆయుర్వేద ప్రయాణంలో నేను తెలుసుకున్న అత్యంత విలువైన రహస్యాలు ఇవి. మీ జీవనశైలిని మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చేసే ఆ సీక్రెట్స్ ఏంటో ఈరోజు మీతో పంచుకుంటాను.
(02:13) ఈరోజు మనం ప్రధానంగా నాలుగు ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి గ్రోయిన్ ఏరియా అంటే తొడల మధ్య భాగం రెండు మేల్ ప్రైవేట్ పార్ట్స్ మూడు ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ మరియు నాలుగు ఆనల్ ఏరియా అంటే మలద్వార భాగం అంతేకాదు ఈ నాలుగు భాగాలను ఎలా క్లీన్ చేయాలి ఏవి అస్సలు చేయకూడదు 60 సంవత్సరాల తర్వాత ఎందుకు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఆయుర్వేదం దీనిని ఎలా చూస్తుంది మరియు ఎప్పుడు డాక్టర్ను కలవాలి అన్నీ ఈరోజు చాలా సింపుల్ గా మాట్లాడుకుందాం.
(02:51) హైజీన్ అంటే ఇప్పుడు వచ్చిన మోడర్న్ ట్రెండ్ అని భావిస్తాం. కానీ వేల సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేదం దీని గురించి చాలా స్పష్టంగా చెప్పింది. ఆయుర్వేదంలో దినచర్య అంటే మన రోజువారి అలవాట్లలో శరీర శుభ్రతకు చాలా ప్రాధాన్యత ఉంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మలమూత్రాల విసర్జన తర్వాత శుభ్రత పాటించడం రోజు స్నానం చేయడం ఎప్పుడూ శుభ్రమైన బట్టలు ధరించడం ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవితం కోసం మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పినవే చరక సమితలో స్నానం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు.
(03:35) పవిత్రం ఋష్యమాయుష్యం శ్రమస్వేద మలాపహం శరీర బల సంధానం స్నానమోజస్కరం పరం స్నానం ఓజస్కరం పరం అంటే స్నానం అనేది కేవలం శరీరాన్ని నీటితో తడపడం మాత్రమే కాదు శరీరంలోని చెమటను మలినాలను తొలగించి మనసుకు ఉత్సాహాన్ని శరీరానికి బలాన్ని ఇచ్చే ఒక గొప్ప దినచర్య అందుకే ఆయుర్వేదం పరిశుభ్ర త అనేది ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం అని చెప్తుంది.
(04:09) ఇప్పుడు ఆ అద్భుతమైన సూత్రాన్ని మన ప్రస్తుత కాలంలో పరిశుభ్రత పద్ధతులతో కలిపి ఎలా పాటించవచ్చో చూద్దాం. నెంబర్ వన్ గజ్జల భాగం మొదటిది గ్రోయన్ ఏరియా అంటే మన రెండు తొడల కలిసే ప్రాంతం అన్నమాట. చాలామంది దీని గురించి పెద్దగా ఆలోచించరు. కానీ ఇక్కడ చర్మం ముడతలు పడుతుంది. అంటే చెమట, తేమ, డెడ్ స్కిన్ మరియు కొన్నిసార్లు యూరిన్ లీకేజ్ ఇక్కడ ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంటుంది.
(04:40) ముఖ్యంగా 60 దాటిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ తగ్గవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం జరగవచ్చు, మొబిలిటీ తగ్గవచ్చు, బరువు పెరగవచ్చు కొంతమందికి యూరినరీ లీకేజ్ ఉండవచ్చు. [సంగీతం] దీంతో తేమ ఎక్కువసేపు నిలిచిపోయి ఇర్రిటేషన్ రాషెస్ తో పాటు ఫంగల్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను.
(05:11) వాష్ డ్రై చేంజ్ మొదటిది వాష్ స్నానం చేసేటప్పుడు గ్రోయిన్ ఏరియాని సున్నితంగా శుభ్రం చేయాలి. గోరువెచ్చని నీటితో ఎలాంటి స్మెల్ లేని మైల్డ్ సోప్ ఉపయోగిస్తూ మీ చేతులతోనే మెల్లగా శుభ్రం చేయాలి. అక్కడ చర్మాన్ని అస్సలు గట్టిగా రుద్దకూడదు. రెండవది డ్రై ఇది చాలా ముఖ్యమైనది. స్నానం చేసిన తర్వాత ఒక మెత్తటి టవల్ తో గజ్జల భాగాన్ని గట్టిగా రుద్ది తుడవకూడదు.
(05:42) ఎందుకంటే శుభ్రం చేయడం మాత్రమే ఆరోగ్యం కాదు. తేమ లేకుండా చూసుకోవడం కూడా శుభ్రత కిందికే వస్తుందని గుర్తుంచుకోండి. మూడవది క్లీన్ కంఫర్టబుల్ బ్రీతబుల్ లో దుస్తులను ధరించండి. చెమటతో తడిసిన యూరిన్ డ్రాప్స్ వల్ల తడిసిన వీలైనంత త్వరగా మార్చేయండి. ఒకవేళ అక్కడ ఇంకా తడి లేదా చెమట వల్ల తేమ ఉన్నట్లు అనిపిస్తే కాన్ స్టార్చ్ తో చేసిన పౌడర్ లేదా జింక్ ఉన్న బారియర్ క్రీమ్ ను రాయవచ్చు.
(06:16) 60 ఏళ్ళు దాటిన వారి కోసం ఒక చిన్న రిమైండర్ మీ పిల్లలకు చిన్నప్పుడు మీరు ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు స్నానం చెయ్ బట్టలు మార్చుకో క్లీన్ గా ఉండు అని ఇప్పుడు మీ మీద కూడా అదే శ్రద్ధ పెట్టుకునే సమయం వయసు పెరిగింది కాబట్టే హైజీన్ తగ్గకూడదు ఇంకా పెరగాలి. 72 ఏళ్ల రాధాకృష్ణ గారి కథ ఇది. కొంతకాలం క్రితం ఆయనకు గజ్జల భాగంలో తీవ్రమైన దురద మంట చర్మం ఎర్రగా కందిపోవడం లాంటి సమస్యలు మొదలయ్యాయి.
(06:49) కానీ వయసు పైబడిన తర్వాత ఇలాంటి విషయాలు కొడుకులతోనో కూతుర్లతోనో ఎలా చెప్పాలో తెలియక విపరీతమైన మొహమాటంతో ఆయన ఆ బాధను లోపలే దాచుకున్నారు. ఇంట్లో దొరికే ఏవో కొన్ని పౌడర్లు రాస్తూ కాలక్షేపం చేశారు. కానీ ఆ చిన్న నిర్లక్ష్యం వల్ల సమస్య కాస్త ముదిరి [సంగీతం] అక్కడ తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా మారిపోయింది. చర్మంపై పగుళ్లు వచ్చి నడవడానికి కూడా వీలులేని పరిస్థితి వచ్చాక కానీ ఇంట్లో వాళ్ళు గమనించలేదు.
(07:20) ఆ తర్వాత ఆయన మా హాస్పిటల్లో చికిత్స చేయించుకొని పూర్తి స్థాయిలో ఆ సమస్య నుంచి కోలుకోవడంతో పాటు గజ్జల భాగాన్ని ఎంత శుభ్రంగా తడి లేకుండా ఉంచుకోవాలో తెలుసుకోవడం కూడా జరిగింది. చూశారు కదా రాధాకృష్ణ గారి లాగా చిన్న సమస్యే కదా అని వదిలేస్తే అది ఎంత పెద్ద ప్రమాదానికి దార తీస్తుందో ఆ భాగంలో టాల్కం పౌడర్లను అస్సలు ఉపయోగించకూడదు.
(07:45) ఎందుకంటే [సంగీతం] కొన్ని టాల్కం పౌడర్ల వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని పరిశోధనలో తేలింది. కాబట్టి [సంగీతం] వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. గాలి బాగా ఆడే కాటన్ లో దుస్తులను మాత్రమే ధరించాలి. టైట్ గా ఉండేవి అస్సలు వాడకూడదు. ఒకవేళ వయసు పైబడిన వారు కాటన్ లో దుస్తులకు బదులుగా ఏవైనా వాడుతుంటే వాటిని తడి అవ్వగానే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
(08:12) నెంబర్ టూ మేల్ పర్సనల్ హైజీన్ ఇప్పుడు పురుషులు అందరూ కొంచెం శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి చాలామంది ఇప్పటికీ మొహమాట పడతారు. కానీ ఇది ఏమాత్రం సిగ్గుపడాల్సిన విషయం కాదు ఇది ప్యూర్లీ మీ హెల్త్ కి సంబంధించిన విషయం. పురుషాంగం పురుషాంగం యొక్క ముందు భాగం ఋషణాలు ఈ సున్నితమైన భాగాలకు కూడా డైలీ హైజీన్ అంటే రోజువారి పరిశుభ్రత చాలా ముఖ్యం స్నానం చేసే సమయంలో పురుషాంగం రుషనాలు అలాగే మలద్వారం చుట్టుపక్కల భాగాలను మైల్డ్ సోప్ తో లేదా గోరువెచ్చని నీటిలో కొంచెం సాల్ట్ వేసి కానీ లేదా కొంచెం స్పటిక వేసి కానీ శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సుంతి కానీ
(09:00) పురుషులు పురుషాంగం పై చర్మాన్ని మెల్లగా వెనక్కు లాగి లోపలి భాగాన్ని వేలితో చాలా సాఫ్ట్ గా క్లీన్ చేయడం ఎంతో ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ సోప్స్ తో గట్టిగా రుద్దకండి. అలాగే పర్ఫ్యూమ్లు డియోడరెంట్లు టాల్కం పౌడర్ లేదా మంచి స్మెల్ వచ్చే ప్రొడక్ట్స్ ని జననేంద్రియాల మీద అస్సలు వాడకండి. ఇవి చర్మానికి ఇరిటేషన్ తెప్పిస్తాయి.
(09:28) ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్మెగ్మా అసలు స్మెగ్మా అంటే ఏంటో చాలా మందికి తెలియదు. చర్మాన్ని వెనక్కి లాగి రోజు శుభ్రం చేసుకోకపోతే అక్కడ డెడ్ స్కిన్ సెల్స్ జిడ్డు తేమ అంతా కలిసిపోయి ఒక తెల్లటి పదార్థంలా పేరుకుపోతుంది. దీన్నే స్మెగ్మా అంటారు. దీనివల్ల అక్కడ విపరీతమైన బ్యాక్టీరియా చేరి చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది.
(09:57) స్మెగ్మా పెరిగిపోయి అలాగే ఉండిపోతేనే అసలు ప్రాబ్లం. అలా ఉంటే బ్యాడ్ స్మెల్ రావడం బ్యాక్టీరియా పెరగడానికి ఛాన్స్ ఉండడం రెడ్నెస్ ఇన్ఫ్లమేషన్ ఇరిటేషన్ లాంటి సమస్యలు రావచ్చు అందుకే స్మెగ్మా పేరుకుపోవడాన్ని నిర్లక్ష్యం చేయకండి అలాగే మీ పురుషాంగంలో వచ్చే ఏ చిన్న మార్పునైనా అస్సలు తేలికగా తీసుకోకండి. రోజు స్నానం చేసేటప్పుడు పురుషులు ఈ సింపుల్ చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి.
(10:28) క్లీన్ చేయడం అలానే చెక్ చేయడం రెండ ఇంపార్టెంటే ఏదైనా కొత్త పుండు గడ్డ రాష్ స్కిన్ కలర్ మారడం బ్లీడింగ్ బ్యాడ్ స్మెల్ డిస్చార్జ్ లేదా ఫోర్ స్కిన్ వెనక్కి తీసుకోవడంలో కష్టంగా ఉండడం వంటివి ముఖ్యంగా గమనించాలి. ఇవి క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు లేదా వేరే కామన్ సమస్యల వల్ల కూడా రావచ్చు. ఏదేమైనా ఇలాంటి మార్పులు ఉంటే డాక్టర్ ని కలిసి చెకప్ చేయించుకోవడం మంచిది.
(11:02) ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వారు శరీరంలో ఏ చిన్న మార్పు వచ్చినా వెంటనే అలర్ట్ అవ్వండి. ఫోర్ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ మూడు సింపుల్ స్టెప్స్ ను ఖచ్చితంగా పాటించండి. ఫోర్ స్కిన్ ఉన్నవాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయడానికి పాటించాల్సిన చిన్న పద్ధతి ఏంటంటే ముందుగా మీ పురుషాంగాన్ని నాచురల్ గా వెనక్కి జరపాలి. ఆ తర్వాత లోపలి భాగాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ ఫోర్ స్కిన్ ని కవర్ చేయాలి.
(11:30) విపరీతమైన టైట్నెస్ పెయిన్ వాపు బ్లీడింగ్ లేదా ఏదైనా డిస్చార్జ్ లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మర్చిపోకండి. ఇకపై మీరు ఈ జాగ్రత్తలు పాటించాలని ఫిక్స్ అయితే కామెంట్ సెక్షన్ లో హైజీన్ అని కామెంట్ చేయండి. నెంబర్ త్రీ మహిళల పర్సనల్ హైజీన్ ఇప్పుడు మహిళలతో ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
(11:55) మహిళల పర్సనల్ హైజీన్ విషయంలో ఒక ముఖ్యమైన తేడాను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్ గా డాక్టర్లు దీనిని చాలా సింపుల్ గా చెప్తూ ఉంటారు. మహిళల శరీరంలో బయటకు కనిపించే మొత్తం భాగాన్ని వల్వా అని లోపల భాగాన్ని వెజైనా అని అంటారు. వెజైనాను మహిళలు స్పెషల్ గా ఎలాంటి క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో నుండి వచ్చే వైట్ డిస్చార్జ్ బ్యాక్టీరియాను డెడ్ సెల్స్ ను ఆటోమేటిక్ గా బయటకు నెట్టేస్తుంది.
(12:24) అంతేకాదు అక్కడ ఉండే నాచురల్ అసిడిక్ పిహెచ్ ఎన్విరాన్మెంట్ [సంగీతం] ఇన్ఫెక్షన్లు రాకుండా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లా కాపాడుతుంది. మరి బయట ఉండే వల్వాను ఎలా శుభ్రం చేయాలి బయట ఉండే వల్వా చెమట, యూరిన్, పీరియడ్స్ బ్లడ్ వల్ల త్వరగా జిడ్డుగా మారుతుంది. కేవలం నీటితో శుభ్రం చేస్తే ఆ జిడ్డు వదలకపోవచ్చు అందుకే కేవలం మీ చేతులతో గోరువెచ్చని నీటిలో కొంచెం సాల్ట్ వేసి కానీ లేదా కొంచెం స్పటిక భస్మం వేసి కానీ ఏదైనా మైల్డ్ లేదా స్మెల్ లేని సోప్ లేదా క్లెన్సర్ ఉపయోగించి కానీ క్లీన్ చేసుకోండి.
(13:03) ఇక్కడ శుభ్రం చేయడానికి వాష్ క్లాత్స్ ను అస్సలు వాడొద్దు. [సంగీతం] ఎందుకంటే వాటి వల్ల బ్యాక్టీరియా చేరే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇక మహిళల కోసం పాటించాల్సిన ఐదు గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది వల్వా భాగాన్ని ఎప్పుడూ చాలా సున్నితంగా శుభ్రం చేసుకోండి. రెండవది పర్ఫ్యూమ్ స్ప్రేలు డియోడెంట్లు సువాసన వెదజల్లే వైప్స్ నుండి దూరంగా ఉండండి.
(13:29) మూడవది ఈ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా రుద్దకండి. నాలుగవది స్నానం చేసిన తర్వాత ఆ భాగాన్ని పొడిగా ఉండేలా మెత్తటి టవల్తో సున్నితంగా తుడవండి. ఐదవది దురద మంట పుండ్లు నొప్పి లేదా మెనోపాస్ తర్వాత అనుకోకుండా రక్తస్రావం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించండి.
(13:58) 60 ప్లస్ వయసున్న మహిళలకు మరో ముఖ్యమైన విషయం వయసు పైబడుతున్న కొద్దీ మెనోపాస్ తర్వాత హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా కొంతమందిలో వజైనా భాగంలో పొడి బారడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ ఎక్కువగా శుభ్రం చేసుకుంటే ఈ సమస్య పోతుంది అనుకోవడం అపోహ మాత్రమే నిజానికి పదే పదే శుభ్రం చేయడం వల్ల ఆ సమస్య తగ్గకపోగా ఇబ్బంది ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
(14:26) అందుకే గుర్తుంచుకోండి పరిశుభ్రత ముఖ్యం కానీ అవసరమైనంతవరకే శుభ్రం చేసుకోండి. నెంబర్ ఫోర్ ఆనల్ కేర్ ఇప్పుడు చాలామంది అస్సలు ఊహించని అస్సలు మాట్లాడడానికి ఇష్టపడని నాలుగో ప్రైవేట్ ఏరియా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అదే ఆనల్ ఏరియా అనగా మలద్వారం చుట్టూ ఉండే ప్రాంతం. ఈ అంశం గురించి మాట్లాడడానికి ఎటువంటి సిగ్గు మోమాటం అసలు అవసరం లేదు.
(14:57) ఇది పూర్తిగా మన వ్యక్తిగత పరిశుభ్రత అనగా పర్సనల్ హైజీన్ కి సంబంధించిన అత్యంత కీలకమైన విషయం. ప్రతిసారి మల విసర్జన అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని చాలా సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. కేవలం సాధారణ నీటితో కడుక్కోవచ్చు ఒకవేళ అవసరమైతే మైల్డ్ క్లెన్సర్ ని మాత్రమే ఉపయోగించాలి. కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి.
(15:25) ఆనల్ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా రుద్దకండి పదే పదే స్క్రబ్ చేయకండి సెంట్స్ పర్ఫ్యూమ్స్ ఉన్న పౌడర్స్ ను అస్సలు యూస్ చేయకండి శుభ్రం చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే గట్టిగా రుద్ది తుడవకుండా సాఫ్ట్ క్లాత్ తో తుడవాలి. దాన్నే ప్ాట్ డ్రయింగ్ అంటారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఈ యనల్ హైజీన్ ఎందుకంత ముఖ్యం అంటే వయసు పెరుగుతున్న కొద్దీ కొందరిలో మలబద్ధకం గట్టి మలం పడడం మొలల సమస్య నడవడానికి ఇబ్బందిగా ఉండే మొబిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు.
(16:03) ఒకవేళ బోవెల్ లీకేజ్ సమస్య ఉంటే మలం మరియు తేమ ఎక్కువసేపు చర్మానికి అంటుకొని ఉండిపోయి తీవ్రమైన మంట ఇరిటేషన్ కూడా కలుగుతాయి. అందుకే వయసు పైబడిన వారు ఈ ప్రాంతాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే దయచేసి సిగ్గుపడకండి. మొహమాటం అసలే పడకండి. మీ భార్య కావచ్చు భర్త కావచ్చు మీ పిల్లలు కావచ్చు లేదా మిమ్మల్ని చూసుకునే కేర్ టేకర్స్ కావచ్చు ఎవరి సహాయమైనా సరే ఎలాంటి సంకోచం లేకుండా తీసుకోండి.
(16:36) సహాయం అడగడం అనేది మీ బలహీనత అసలే కాదు మీ ఆత్మగౌరవం అన్నిటికంటే విలువైంది. దానిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు మీరు చేసిన మిస్టేక్స్ ను ఇకపై రిపీట్ చేయకూడదని భావిస్తే కామెంట్ సెక్షన్ లో కేర్ అని టైప్ చేయండి. గుర్తుంచుకోవాల్సిన ఏడు ముఖ్యమైన రూల్స్ ఇక్కడ నేను మీతో ఒక అత్యంత ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలి. ఆయుర్వేదం పేరు చెప్పి ప్రతి ప్రైవేట్ పార్ట్ లో పౌడర్స్, ఆయిల్స్, డికాషన్స్ యూస్ చేయమని నేను ఎప్పుడూ చెప్పను.
(17:09) మరీ ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ లో సొంతంగా ఇలాంటివి అస్సలు ఉపయోగించకూడదు. మరి ఆయుర్వేదం మనకి ఏం నేర్పుతుంది అదే దినచర్య శౌచం స్నానం శరీర పరిమార్జన మరియు మల ప్రవృత్తి నియమం అంటే శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం క్రమం తప్పకుండా స్నానం చేయడం శుభ్రమైన దుస్తులు ధరించడం మలమూత్ర విసర్జన తర్వాత సరైన శుభ్రత పాటించడం రెగ్యులర్ బోవెల్ హ్యాబిట్స్ కలిగి ఉండడంతో పాటు మన శరీరాన్ని మనం నిశితంగా గమనించడం ఇదే ఆయుర్వేదం చెప్పే అసలైన ప్రాక్టికల్ విజ్ఞానం అందుకే ప్రైవేట్ హైజీన్ విషయంలో మీరు ఈరోజే పాటించాల్సిన ఏడు సూపర్ రూల్స్ ఇక్కడ
(17:57) ఉన్నాయి. రూల్ నెంబర్ వన్ మీ ప్రైవేట్ భాగాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోండి. రూల్ నెంబర్ టూ కడిగిన తర్వాత ఆ భాగం ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి. రూల్ నెంబర్ త్రీ తడిసిన లేదా చెమట పట్టిన లో దుస్తులను వెంటనే మార్చేయండి. రూల్ నెంబర్ ఫోర్ సెంట్లు పర్ఫ్యూమ్లు లేదా హార్డ్ కెమికల్ ప్రొడక్ట్స్ ను ప్రైవేట్ పార్ట్స్ లో అస్సలు వాడకండి.
(18:23) రూల్ నెంబర్ ఫైవ్ సున్నితమైన చర్మాన్ని ఎప్పుడూ గట్టిగా రుద్దకండి. రూల్ నెంబర్ సిక్స్ స్త్రీలు బయటి భాగాన్ని మాత్రమే శుభ్రం చేసుకోండి. లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి అస్సలు ప్రయత్నించకండి. రూల్ నెంబర్ సెవెన్ మీ శరీరంలో లేదా ప్రైవేట్ పార్ట్స్ లో ఎలాంటి చిన్న మార్పు అసౌకర్యం కనిపించినా వెంటనే గమనించి అప్రమత్తం అవ్వండి.
(18:47) డాక్టర్ ను ఎప్పుడు కలవాలి చివరిగా అందరూ తప్పక గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన హెచ్చరిక మీ ప్రైవేట్ పార్ట్స్ లో ఇప్పుడు చెప్పబోయే లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా అస్సలు మొహమాట పడకండి టైం అస్సలు వేస్ట్ చేయకండి వెంటనే మహిళలైనా పురుషులైనా డాక్టర్ను సంప్రదించండి. ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా పొడిబారడం [సంగీతం] అస్సలు తగ్గని దురద లేదా మంటగా అనిపించడం దుర్వాసన వస్తూ వైట్ లేదా ఎల్లో కలర్ లో డిస్చార్జ్ [సంగీతం] అవ్వడం యూరిన్ కి వెళ్ళే సమయంలో లేదా పార్ట్నర్ ను కలిసే సమయంలో నొప్పి మంట పుట్టడం ప్రైవేట్ పార్ట్స్ పై గడ్డలు పుండ్లు బొబ్బలు రాషస్
(19:27) కనిపించడం ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు స్నానం చేయించాం [సంగీతం] వాళ్ళ బట్టలు మార్చాం వాళ్ళు టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకోవడం నేర్పించాం. వాళ్ళకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకూడదని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం. కానీ మన వయసు పెరిగే కొద్దీ మన మీద మనం పెట్టుకునే శ్రద్ధ మాత్రం తగ్గిపోకూడదు.
(19:52) వయసు 60 అయినా 70 అయినా లేదా 80 అయినా మీ శరీరం మీద మీకు ప్రేమ ఉండాలి. ఎవ్వరు చూడని భాగాలను కూడా మన శరీరంలోని ప్రతి అంగుళాన్ని ఎంతో గౌరవంగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ హైజీన్ అనేది సిగ్గుపడాల్సిన విషయం అస్సలు కాదు. మన తల్లిదండ్రులకు మన తాత బామ్మలకు మన ఇంట్లో ఉన్న 60 ఏళ్ళు దాటిన పెద్దవారికి ఇలాంటి విషయాలు చెప్పేవారే ఎవరు ఉండకపోవచ్చు.
(20:21) వాళ్ళతో ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనకు కాస్త మొహమాటం అనిపించవచ్చు కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో మాత్రం ఎప్పుడూ ఎలాంటి సిగ్గు ఉండకూడదు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడకపోయినా వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
(20:47) ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ అండ్ జెన్యూన్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. [సంగీతం] జీవితాంతం ఈ నొప్పులతోనే బతకాలా ప్రతిరోజు మెడిసిన్స్ వాడాల్సిందేనా అని మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారా ఒక్క నిమిషం మీ నొప్పులకి శాశ్వత ముగింపు పలికే సమయం వచ్చింది.
(21:12) గత 27 ఏళ్లుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా ఎటువంటి సర్జరీలు అవసరం లేకుండా 10 లక్షల మందికి వెన్నెముక సమస్యలతో బాధపడే వాళ్ళకినాలుగు లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాము.ఒక ఒక లక్ష మందికి పైగా కీళ్ళ సర్జరీలను కూడా మేము అవాయిడ్ చేయగలిగాం. సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజమైన వైద్యంతో ఆపరేషన్ భయం లేకుండా మళ్ళీ హ్యాపీగా జీవించండి.
(21:36) మా బ్రాంచెస్ నారాయణగూడా తార్నాక బంజారా హిల్స్ విజయవాడ మరియు కర్నూల్లో అందుబాటులో ఉన్నాయి. నొప్పు లేని జీవితం మీ హక్కు ఇప్పుడే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కు కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారావాట్ లో మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ ఆరోగ్యం కోసం ఇలాంటి సులువైన పాటించదగిన సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కూడిన ఆరోగ్య సమాచారాన్ని మీకు అందిస్తూనే ఉంటాం.
(22:00) మీ శరీరంలోని ప్రతి భాగాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎవ్వరూ మాట్లాడని ఆ ప్రైవేట్ భాగాలను కూడా మీరు ఆరోగ్యంగా ఆత్మవిశ్వాసంతో సరైన జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా జీవించాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్ నమస్కారం [సంగీతం]

No comments:

Post a Comment