Wednesday, November 4, 2026

ప్రతి భర్త తెలుసుకోవాల్సిన భార్య మనసు రహస్యం! | భార్య మనసులోని మాట | #sudheertalks

ప్రతి భర్త తెలుసుకోవాల్సిన భార్య మనసు రహస్యం! | భార్య మనసులోని మాట | #sudheertalks

Author Name:Sandra Sudheer Kumar

Youtube Channel Url:https://www.youtube.com/@SandraSudheerKumar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hIP5Z85ZksI





Title: ప్రతి భర్త తెలుసుకోవాల్సిన భార్య మనసు రహస్యం! | భార్య మనసులోని మాట | #sudheertalks

Author Name: Sandra Sudheer Kumar

Description: Sudheer Sandra is very passionate about Psychology and intends to spread awareness about both psychology and mental health. The process of finding your purpose involves first finding your passions which made to choose psychology after my Engineering. he is passionate about Training and Counseling. he working as a Freelancer Life Skills Coach, Psychologist, Career Counselor, and Motivational Speaker.

For appointments call 8886138871

1. How to Choose a Career? Confused about Career... by Sudheer Sandra
https://www.youtube.com/watch?v=2cMWK...

2. Why Do Children lie? || How to Handle it ?
https://www.youtube.com/watch?v=toWEb...

3. Beautiful Quotation for Parents... Teach Values by Sudheer Sandra
https://www.youtube.com/watch?v=Httjw...

4. Best Ways To Improve Your Child’s Social Skills.. by SUDHEER SANDRA.. Teach Values
https://www.youtube.com/watch?v=mrKgy...

Inspiring TEDx Talk by Sudheer Sandra (4 Ways to Overcome Mental Blocks): https://www.youtube.com/watch?v=Nkupa...

Sudheer Sandra Career Counseling Center has been established in Hyderabad with the intent to provide solutions to all kinds of career confusion among students and professionals.
Sudheer Sandra wants to spread happiness into others' lives and ultimately make India Suicide Free.

#sudheersandra #Motivation #CareerGuidance

Click here for more Latest Video updates,

►Subscribe to our Youtube Channel:    / sudheer047  

►Like us on facebook   / sandrasudheerkumar  

►Follow me on Instagram :   / sandrasudheer  

✆ Feel Free to Contact Us: 8886138871

Like & Subscribe & Comment
Thank You all members for watching!

   / @sandrasudheerkumar  

భార్య చేసే ఈ 10 పనులు కుటుంబంలో ప్రేమను రెట్టింపు చేస్తాయి! ❤️ | సంతోషకరమైన కుటుంబ రహస్యం
#telugufamilytimes #bharya #familylove #happyfamily ❤️

#bharyabharthalu #telugufamilytimes #familylove #happyfamily #telugumotivation #teluguvlogs #teluguwomen #wifeduties #familyrelationships #marriagelife #relationshiptips #manchimatalu #bharyabharthalu #telugustories #familyvalues #teluguvideos #teluguyoutube #angermanagement #parentingtips #positiveparenting #gentleparenting #parentingadvice #calmparenting #stopyelling #mindfulparenting #emotionalcontrol #parentingjourney #childpsychology #happyparenting #parentingskills #mentalhealth #familywellness

#sudheersandra #childpsychologist #teluguparenting #parentingworkshop #parentingcoach #careerguidance #parentingtips #careergrowth #parentinghacks #psychologist #mentalhealthawareness #lifeskillscoach #motivationalspeaker #mentalhealthmatters #careercounselor #positiveparenting #studentguidance #mentalwellbeing #psychologylovers #mindfulness #emotionalhealth #wellnesscoach #holistichealth #teenmentalhealth #stressmanagement #personaldevelopment #mentalhealthsupport #lifepurpose #selfimprovement #youthempowerment #careerdevelopment #mentalhealthadvocate #positivethinking #mentalhealtheducation

Transcript:
(00:01) భర్త చేసే ఈ 10 పనులు భార్య జీవితంలో ఆనందాన్ని రెట్టింపజేస్తాయి. లాస్ట్ వీడియోలో భార్య చేయాల్సిన 10 పనుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో భర్తలు చేయాల్సిన 10 పనుల గురించి మనం తెలుసుకుందాం. భర్తలందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ భార్య కోసం ఎంత కష్టపడుతున్నారు ఉదయం ఆఫీస్ కి వెళ్తారు రాత్రి ఇంటికి వస్తారు ఈఎంఐలు కడతారు పిల్లల ఫీస్ కడతారు కుటుంబానికి అవసరమైనవన్నీ కొనిస్తారు.
(00:30) ఇవన్నీ చాలా ముఖ్యమైనవే కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ కుటుంబానికి అన్ని ఇస్తున్నారు కానీ మీ భార్యకు మీ సమయం మీ ప్రేమ మీ గౌరవం కూడా అందుతున్నాయా ఒక భార్యకి మంచి ఇల్లు ఉండొచ్చు మంచి బట్టలు ఉండొచ్చు ఆర్థిక సౌకర్యం ఉండొచ్చు ఇవన్నీ ఉన్నా కూడా ఆ ఇంట్లో ఆమె ఒంటరిగా అనిపించుకోవచ్చు. ఎందుకంటే డబ్బుతో అవసరాలు తీర్చవచ్చు కానీ భావోద్వేగ అనుబంధానికి మన సమయం శ్రద్ధ కూడా కావాలి.
(00:57) ఈరోజు భర్తగా మీరు మార్చుకోగల 10 విషయాలను మాట్లాడుకుందాం. మీ భార్యను ఇంట్లో పనిచేసే వ్యక్తిగా కాదు. జీవిత భాగస్వామిగా చూడండి. మన తెలుగు కుటుంబాల్లో కొన్ని చోట్ల ఇప్పటికీ ఒక ఆలోచన కనిపిస్తుంది. భర్త సంపాదించాలి, భార్య ఇంటి పనులు చూసుకోవాలి. ఇద్దరు కలిసి అలా నిర్ణయించుకుంటే తప్పులేదు కానీ ఇంటి పనుల్ని భార్య బాధ్యతే అనుకోవడం సరైంది కాదు.
(01:22) ఉదయం లేచిన దగ్గర నుంచి వంట, పిల్లలు, స్కూలు, బట్టలు, ఇంటి నిర్వహణ, పెద్దవాళ్ళ అవసరాలు ఇవన్నీ కూడా పనేనండి. ఆమె ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా ఆమె సమయానికి విలువ ఉంది. రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా ఏం చేస్తావ్ అనే మాటను మీ జీవితంలో నుంచి తీసేయండి. భార్య ఇంట్లో చేసే పని కనిపించకపోవచ్చు. కానీ ఆ పని లేకపోతే దాని విలువ తెలుస్తుంది. రెండోది ఈరోజు వంట నేను చేసుకుంటాను.
(01:48) ఇంటి పనుల్లో సహాయం కాదు బాధ్యత పంచుకోండి. ఒకరోజు మీరు వంట చేస్తే చూడు నీకు ఎంత హెల్ప్ చేశాను అనడం కన్నా ఈరోజు వంట నేను చూసుకుంటాను నువ్వు కొంత విశ్రాంతి తీసుకో అని చెప్పండి. పిల్లలకు స్నానం చేయించడం స్కూల్ పనులు చూడడం ఇంటి సరుకులు కొనడం పిల్లలను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఇవన్నీ తండ్రిగా భాగస్వామిగా మీ బాధ్యతలు కూడా ముఖ్యంగా భార్య ప్రతి చిన్న పనిని గుర్తు చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాకూడదు.
(02:18) మీరు స్వయంగా గమనించి ఇది మాత్రం చేయండి. మంచి భర్త ఇంటి పనుల్లో అప్పుడప్పుడు సహాయం చేసేవాడు మాత్రమే కాదు ఇంటి బాధ్యతను సమానంగా పంచుకునేవాడు కూడా మూడోది ఆమె చెప్పేది వినండి వెంటనే సొల్యూషన్ ఇవ్వకండి మీ భార్య మీతో ఏదైనా సమస్య చెప్పింది అనుకోండి ఆఫీస్ లో ఎవరో బాధ పెట్టారు ఇంట్లో ఏదో జరిగింది పిల్లల విషయంలో ఒత్తిడి అనిపించింది వెంటనే ఇందులో ఏముంది నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు నువ్వు ఇలా చేయాల్సిందే చిన్న విషయానికి ఇంత బాధ ఎందుకు అని చెప్పకండి ముందుగా వినండి ఒక మంచి మంచి ప్రశ్న అడగండి.
(02:51) నీకు నేను ఇప్పుడు సొల్యూషన్ చెప్పాలా లేక కాసేపు నీ మాట వినాలా ఇది చిన్న ప్రశ్నల అనిపించొచ్చు కానీ ఎదుటివారి అవసరాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మన భాగస్వామికి సలహా కంటే వినే వ్యక్తి అవసరం. ఆమె సమస్యను వెంటనే పరిష్కరించలేకపోయినా ఆ సమయంలో ఆమె ఒంటరిగా లేదనే భావన మనం కలిగిస్తే చాలండి.
(03:16) నాలుగోది మీ భార్యను మీ కుటుంబం ముందు అవమానించకండి. కొన్ని ఇళ్లల్లో భార్య ఏదైనా అభిప్రాయం చెప్పగానే నువ్వు ఊరుకో నీకేం తెలుసు మా ఇంటి విషయాల్లో జోక్ ఏం చేసుకోకు అనే మాటలు వినిపిస్తుంటాయి. ఒక్కసారి ఆలోచించండి ఆమె కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యురాలే కదా ఆమె అభిప్రాయానికి కూడా విలువ ఉండాలి కదా మీ అమ్మ నాన్నలు గౌరవించండి అలాగే మీ భార్యను కూడా గౌరవించండి.
(03:40) మీ భార్యకు మీ తల్లిదండ్రులకు మధ్య సమస్య వస్తే ఎవరో ఒకరు పక్షం గుడ్డిగా తీసుకోకండి. ఏం జరిగిందో తెలుసుకోండి అన్యాయం జరిగితే ఆపండి ఆరోగ్యకరమైన హద్దులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉండండి. మంచి కొడుకుగా ఉండడానికి చెడ్డ భర్తగా మారాల్సిన అవసరం లేదు. మంచి భర్తగా ఉండడానికి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇవి చాలా చాలా ముఖ్యం.
(04:04) ఐదోది ఆమె కలలను కూడా మీ కలలుగా గౌరవించండి. పెళ్లికి ముందు ఆమెక ఎన్నో కలలు ఉండి ఉండొచ్చు. చదువుకోవాలని ఉద్యోగం చేయాలని వ్యాపారం ప్రారంభించాలని కొత్త నైపుణ్యం నేర్చుకోవాలని కానీ పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో వాటిని పక్కన పెట్టి ఉండొచ్చు. ఒక్కసారి మీ భార్యని అడగండి నువ్వు ఎప్పటి నుంచో చేయాలనుకొని చేయలేకపోయిన పని ఏదైనా ఉందా నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేనేమైనా సహాయం చేయగలుగుతాను.
(04:31) ఆమె కెరియర్ ఆదాయం, చదువు, అభిరుచులు ఇవన్నీ కెరియర్ లాగానే ముఖ్యమైనవి. ఆమె విజయం మీకు పోటీ కాదు. భార్య ఎదుగుదలను చూసి గర్వపడే భర్త ఇద్దరూ ఎదిగే కుటుంబాన్ని చాలా బాగా స్ట్రాంగ్ గా నిర్మిస్తారు. ఆరోది ఫోన్ కి ఇచ్చే సమయం భార్యకి ఇవ్వండి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు సోఫాలో కూర్చున్నారు ఫోన్ తీసుకున్నారు రీల్స్ న్యూస్వాట్ YouTube ఒక గంట గడిచిపోయింది.
(04:57) మీ భార్య ఏదో మాట్లాడడానికి ప్రయత్నించింది. ఒక్క నిమిషం అంటారు ఆ ఒక్క నిమిషం అరగంట అవుతుంది. ఇలా పదే పదే జరిగితే ఎదుటి వారికి తాను ముఖ్యమైన వ్యక్తిని కాదేమో అనే భావన కలగొచ్చు. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి మాట్లాడండి. ఆమె రోజు ఎలా గడిచిందో అడగండి. మీ రోజు గురించి ఆమెకు చెప్పండి అప్పుడప్పుడు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళండి ఒకే ఇంట్లో గడిపే సమయం అంతా కలిసి గడిపిన సమయం కాదు.
(05:25) [గురకలు] కొన్నిసార్లు తన ఫ్రీ టైంలో మీరు అలా నడుచుకుంటూ బయటిక వెళ్లి మనస్ఫూర్తిగా మాట్లాడుకునే మాటలు మనస్ఫూర్తిగా షేర్ చేసుకునే విషయాలు మీ ప్రేమని ఇంకా బలపరుస్తాయి. ఏడోది ప్రేమను మనసులో మాత్రమే కాదు మాటల్లో పనుల్లో చూపించండి కొంతమంది భర్తలు అంటారు ప్రేమ లేకపోతే ఇంత కష్టపడతాను మీ కష్టంలో ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమని మీ భార్య గుర్తించగలిగేలా వ్యక్తపరచడం కూడా అవసరం.
(05:53) అప్పుడప్పుడు నువ్వు నాకు చాలా ముఖ్యం ఈరోజు చాలా బాగా చేశవ్ నీతో జీవితం పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది అని చెప్పండి. ఆమెకు ఇష్టమైన చిన్న వస్తువు తీసుకురండి. ఆమె అలిసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకొనివ్వండి ఆమె పుట్టిన రోజును గుర్తుంచుకోండి ఆమెకు ఇష్టమైన విధంగా ప్రేమను వ్యక్తపరచండి ప్రేమ ఉందని అనుకోవడం ఒక్కటే సరిపోదు ప్రేమ ఎదుటి వారికి అనుభూతి కావాలి.
(06:16) ఎనిమిదవది మీ కోపాన్ని మీ భార్యపై చూపించకండి. ఆఫీస్ లో బాస్ తో సమస్య వచ్చింది. బిజినెస్ లో నష్టం వచ్చింది ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డారు. ఇంటికి వచ్చి భార్యపై అరుస్తారు. ఒక్కసారి ఆలోచించండి మీ ఒత్తిడికి మీ భార్య కారణం కాకపోతే ఆమె ఎందుకు ఆ కోపాన్ని భరించాలి ఒత్తిడి ఉంటే చెప్పండి ఈరోజు చాలా టెన్షన్ గా ఉంది నాకు కొంచెం సమయం కావాలి.
(06:39) కానీ అరవడం బెదిరించడం వస్తువులు విసరడం కొట్టడం ఎప్పటికీ సమర్ధనీయం కాదు. మీ కోపానికి మీరే బాధ్యత తీసుకోవాలి. అవసరమైతే నిపునుల సహాయం తీసుకోండి. మీ భార్య మీతో ఉన్నప్పుడు భయపడకూడదు సురక్షితంగా అనిపించండి. తొమ్మిదోది డబ్బు విషయంలో ఆమెని భాగస్వామిని చేయండి. ఇంటి ఆదాయం ఎంత అప్పులు ఎంత పొదుపు ఎంత? ఇన్సూరెన్స్ వివరాలు ఏమిటి? పిల్లల భవిష్యత్తు కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇవన్నీ భార్యా భర్తలు ఇద్దరికీ తెలిసి ఉండాలి.
(07:06) నేను సంపాదిస్తున్నాను నీకెందుకు అనే ధోరణి ఎప్పటికీ సరైంది కాదు. అలాగే భార్య సంపాదిస్తున్న డబ్బు పై ఆమెకు కూడా నిర్ణయాధికారం ఉండాలి. పెద్ద ఆర్థిక నిర్ణయాలను ఇద్దరు కలిసి తీసుకోవాలి. ఆమెకు ఆర్థిక స్వాతంత్రం ఉండేలా గౌరవించండి. కుటుంబానికి డబ్బు సంపాదించడం బాధ్యత. ఆ డబ్బు గురించి కలిసి నిర్ణయాలు తీసుకోవడం కూడా భాగస్వామ్యమే.
(07:29) చివరిగా 10వది ఆమెను కేవలం తల్లిగా కాదు ఒక వ్యక్తిగా చూడండి. మీ భార్య పిల్లలకు తల్లి మీ తల్లిదండ్రులకు కోడలు మీ కుటుంబానికి సభ్యురాలు కానీ వీటన్నిటికంటే ముందు ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది ఆమెకు కూడా విశ్రాంతి కావాలి ఆమెకు కూడా స్నేహితుడు కావచ్చు ఆమెకు కూడా తనకంటూ సమయం కావాలి. ఆమెకు కూడా ప్రేమ, సన్నిహిత్యం, గౌరవం కావాలి.
(07:52) మీ ఇద్దరి మధ్య శారీరక సన్నిహిత్యం విషయంలో కూడా పరస్పర అంగీకారం, సౌకర్యం, గౌరవం ముఖ్యం. పెళ్లయిందనే కారణంతో ఎవరికీ ఎదుటివారి శరీరంపై హక్కు ఏర్పడదు. ఆమె ఆరోగ్యం భావాలు అవసరాలను అర్థం చేసుకోండి. మీ భార్య మీ జీవితంలో ఒక పాత్ర పోషించడానికి మాత్రమే రాలేదు. మీతో కలిసి తన జీవితాన్ని కూడా జీవించడానికి వచ్చింది. చివరిగా భర్తలందరికీ ఒక ప్రశ్న అడుగుతాను.
(08:16) మీ భార్య మిమ్మల్ని చూసినప్పుడు తన మనసులో ఉన్నది చెప్పుకోవచ్చని నమ్మకం కలుగుతుందా? తప్పు చేస్తే మీరు అవమానిస్తారనే భయం కలుగుతుందా? ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు చూసుకుంటారనే భరోసా ఉందా? ఆమెకు ఒక కల ఉంటే మీరు ప్రోత్సహిస్తారని నమ్మకం ఉందా? ఒక్కసారి ఆలోచించండి మీరు మంచి సంపాదనపరులు కావచ్చు మంచి తండ్రి కావచ్చు మంచి కొడుకు కావచ్చు కానీ మీ భార్యకు మీరు మంచి భాగస్వామిగా ఉన్నారా భార్యకు అన్ని కొనివ్వడం మాత్రమే ప్రేమ కాదు ఆమె తనలా తాను జీవించగలిగే గౌరవాన్ని స్వేచ్ఛను భద్రతను ఇవ్వడం కూడా ప్రేమే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యను ఒక్క ప్రశ్న
(08:50) అడగండి. నాతో నీ జీవితం ఇంకా సంతోషంగా ఉండాలంటే నేను ఏం మార్చుకోవాలి ఆమె చెప్పేది పూర్తిగా వినండి వెంటనే సమర్థించుకోకండి ఆమె భావాలను అర్థం చేసుకోండి మార్పు అవసరమైతే ప్రారంభించండి ఎందుకంటే ఒక మంచి భర్త భార్య జీవితంలోకి వచ్చి ఆమె ప్రపంచాన్ని చిన్నది చేయడు ఆమెతో కలిసి ఇద్దరి ప్రపంచాన్ని మరింత అందంగా నిర్మిస్తాడు.
(09:12) అలాంటి భర్తలుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని వీలైనంత మంది కుటుంబాలకు షేర్ చేసి భార్యా భర్తల బంధాన్ని పెంచే విధంగా చేద్దాం. థాంక్యూ ఇకపై మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కూడా ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి థాంక్యూ మీ సుదీర్ సాండ్ర

No comments:

Post a Comment