అమ్మరాసిన ఉత్తరం
*******************
చిరంజీవి శ్రీనుని ఆశీర్వదిస్తూ నీ ప్రియమైన అమ్మ వ్రాయునది.
శ్రీనూ !నిన్న నీ స్నేహితుడు హరిని నీపక్కన చూశాకా ,మీ ఇద్దరిమధ్య తేడా బాగా కనిపించింది.హరి మంచి రంగుతేలాడు.సహజంగా వయసుకు తగ్గట్టు కొంచం వళ్ళుచేసాడు.మొత్తానికి చూడడానికి చాలా ఆరోగ్యంగా అందంగా కనిపించాడు.
నువ్వు ఓవర్ గా ఎక్సర్ సైజ్ లు చేయడంవల్లకానీ, లేదా అన్నం అసలు తినకుండా,పూర్తిగా చపాతీలే తినడంవలనకానీ, అదికూడా డైటింగ్ పేరుతో బాగా తగ్గించి తినటంవలనకానీ బాగాచిక్కిపోయావు. నీ శరీరానికి,నీవు చేసే ఎక్సర్ సైజుకు సరిపడా తగినంత ఆహారం తినకపోవడంవలనే బాగా నీరసంగా కనిపిస్తున్నావు.ఫిట్ గా వుండడం వేరు,ఆరోగ్యంకనిపించడం వేరుకదాచిన్నా!
బహుశా!నువ్వు నెయ్యి,నూనెలు కొలష్ట్రాలంటూ అసలు తీసుకోకపోవడం మానేశావు. నూనె నెయ్యి మానేయడంవనే వయసులోవున్నా నీ శరీరంలో నునుపులేక,మృదుత్వం కోల్పోయి డల్ గాకనీపిస్తోంది.ఏదిఏమైనానువ్వుబాగా నీరసంగా కనిపిస్తున్నావు.కళ్ళు లోపలికిపోయి,చెంపలు పీక్కుపోయి అనారోగ్యంతో బాధపడేలావాడిలా ,సమతుల ఆహారం లోపించినవాడిలా వున్నావు.
నీ మరో స్నేహితుడు కార్తికేయ కూడా బాగా చిక్కిపోయాడు చూసావుకదా!అతడికి షుగర్ వుందని అన్నావు.దాని వల్ల అతడు చిక్కిపోయాడు.అది వాళ్ళ జీన్స్ లోనేవుందని అన్నావు. పైగా శరీరంపై పెద్దగా అతడు శ్రద్దపెట్టడనికూడా అన్నావు.నాన్నా మన జీన్స్ లో మా మీఅమ్మవైపునుంచీ,మీ నాన్నగారివైపునుండిగానీ షుగర్ , కొలస్ట్రాల్ బెంగలేదు.అయినా టెష్టులన్నీ చేయించానంటున్నావు.అలాంటివేవీ లేవని రిజల్ట్ వచ్చింది కనుక ఒక నెలరోజులు ఎక్సర్ సైజులు బాగాతగ్గించి,అలాగే రన్నింగులూ, వాకింగులూకూడా బాగాతగ్గించు. నెయ్యి,నూని శరీరానికి తగినంత
వేసుకొని, కడుపునిండుగా చపాతీ తోపాటుగా అన్నంకూడా తినిచూడు.అలాగే పొద్దుట టిఫిన్ బదులుగా,రాత్రి పాలలో వేసి తోడుపెట్టిన అన్నంతినిచూడు. ఇష్టమైతే నీరుల్లిపాయ నంజుకుని తిను అమృతంలా పనిచేస్తుందది.అలా ఒకటి రెండునెలలు తినిచూడు నీశరీరంలోని మార్పునీకే కనిపిస్తుంది.
మరో చిట్కాకూడా చదివానెందులోనో కానీ,వేడినీళ్ళలో మంచి ఆవునెయ్యను ఒకచంచా వేసుకొని,దానితోపాటుగా ఇనిస్టెంటు కాఫీపొడి వేసుకు తాగిచూడు.ఆ చిట్కాపాటించినందుకు వాళ్ళా మొహంలో చక్కని నిగారింపు వచ్చిందని నా స్నేహితురాలు చెప్పింది. నువ్వు కూడా అలాచేసిచూడు ఒకనెలరోజులపాటు.నువ్వు నేనుచెప్పినట్లు పాలలో తోడుపెట్టిన అన్నంతోపాటుగా, ఆవునెయ్యి చిట్కాను కూడా పాటించినట్లైతే, మళ్ళీనెలలో జరిగే పిన్నికొడుకు వర్థన్ ఒడుగుకు వచ్చేటప్పటికే, మాకు నీలోమంచి మార్పు కనిపిస్తుందనుకొంటున్నాను.
అమ్మ ఎదురుగావున్ననాకు ఇలా వాట్సఫ్ మెసేజి పంపిందేమిటి అనుకొంటున్నావుకదా నానీ! నిన్ను చూసినవారందరూ అదేమిటి అలా చిక్కిపోయావు?ఏమైయ్యిందినీకు?అని అడుగుతుంటే నువ్వు చిరాకుపడుతున్నావు నేనుగమనించాను.వాళ్ళకేకాదు నాకూ నిన్నుచూసిన వెంటనే చాలాబాధనిపించింది.చిన్నా!చెప్పకపోవభడమేం,ఎందుకంతగా చిక్కిపోయావోనని భయంకూడా వేసింది. అదరిలాగా నేనూ అడిగితే నీకు నచ్చదని తెలిసి
ఇలా ఫోన్ లో ఉత్తరం రాసేను. అన్నిటెష్టులూ చేయించాను అన్నావు. ఏమీ తేడాలేదన్నావు.మరి అనారోగ్యం లేనప్పుడు ఆరోగ్యంగా కనిపించడానికి ఆహారంలో మార్పులు చేసి చూస్తే తప్పులేదుకదా !అలా ప్రయత్నించి చూడు.అన్నానికి పుట్టిన జీవులం మనం అనేది అమ్మమ్మ.తరతరాలనుండీ మనవాళ్ళంతా అన్నంతినే ఆరోగ్యంగా బతికేరు.అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారుకదా!ప్రతి బియ్యంగింజపైనా తినేవాడి పేరురాసుంటుందంటారు.మరెందుకో ఈతరంపిల్లలు అన్నాన్ని ధ్వేషిస్తున్నారు.కొందరువివిధ మాధ్యమాలలో అన్నం తినడం విషం తినడంతో సమానంఅని విష ప్రచారంచేస్తున్నారు.నిన్నమొన్నటివరకూ ఈ ప్రచారకర్తలందరూ ఈ అన్నంతినే గా ఇంతగా శరీరాలను పెంచి ఈవయసు వరకూ పెరిగారు.ఇప్పుడు చిరుధాన్యాలకు ప్రకటనదారులైనారుకనుక ఇలా అన్నంమీద విష ప్రచారంచేస్తున్నారనిపిస్తోందినామటుకునాకు. అయినా ఏరాష్ట్రంవారు ఆ రాష్ట్రంలో పండే పంటను ప్రధాన ఆహారంగా తింటారు.ఉదాహరణకు పంజాబు,ఉత్తరప్రదేశ్ మొదలైనరాష్ట్రాల వారు గోధుమనే ప్రధాన ఆహారంగా తింటారు.
మన తెలుగురాష్ట్రాల ప్రధాన ఆహార పంటవరిపంట. అందుకనే మన ఇరురాష్ట్రాలనూ రైస్ బౌల్ అని,వరి ధాన్యాగారాలనీ పిలుస్తారు.మన ఆధ్రరాష్ట్రనికి అన్నపూర్ణ అనే పేరుందికదా! మరెందుకోగానీ, ప్రచారకర్తలైన వారు మన రాషష్ట్రలో లభించే ఆరోగ్యాన్నందించే
పాతబియ్యంగురించికానీ,అలాగేదంపుడుబియ్యంగురించికానీ ,వాటి శ్రేష్ఠతగురించికానీ ఒక్కమాటకూడా చెప్పరుగమనించండి.
పోనీ మాతరంవాళ్ళలా మీరు ఎక్కువగా అన్నం తినకుండా,కూరలు ఎక్కువగాతినండి.అలాగేపప్పులు కూడా ఏదోరూపంగా ఎక్కువగాతినండి. వందల సంవత్సరాలనుండీ మన ఆధ్ర రాష్ట్రలోని జనంతోపాటు మన బంధువులూ,స్నేహితులూ అందరూ వరి అన్నంతినే ఆరోగ్యంగా ఆనందంగా దగ్గర దగ్గరగా వంద సంవత్సరాలు జీవించారుకదా!అప్పుడు అన్నం కూరలూ మొదలైనవన్నీ వార్చేసేవారు.కుక్కర్లో వంటలు వచ్చేకా వార్పులుమాట మరచిపోయాము.అందుకనే సుగరు జబ్బు వచ్చిపడింది.ఇప్పుడు మళ్ళీ సుళువుగా వార్పులకు అనేకరకాల మంచి వంటపాత్రలొచ్చేయి. కోడల్ని తనకు అనుకూలంగా వండేవాటిని తీసుకొని వార్చుకొని వండుకోండి.కూరల్లో పురుగు మందులుంటున్నాయని గోలపెడుతున్నారు.వండేముందు ఉప్పువేసి బాగా కడుక్కొని ఎక్కువనీరుచేర్చి,వుడికించి వార్చుకొని తింటే,ఆభయంకూడావుండదు.దొరికితే ఖరీదెక్కువైనా,బాగా పాతబియ్యంకానీ,లేదా దంపుడుబియ్యంకానీతినండి. వాటిలోని పిండిపదార్థాలు హానిచెయ్యవు.అందుకనే బాలింతలకూ,రోగిష్టులకూ ఆ బియ్యంతో అన్నంవండి పెడతారు. అమ్మకి చాదస్తం పెరిగిపోయిందనుకోకుండా, నేనుచెప్పినట్లు చేసిచూడు.అన్నాన్ని అయిష్టంగా కాకుండా చక్కగా ఇష్టంగా తినిచూడు. నువ్వుకూడా చక్కగా అన్నంతిని అందంగా ఆరోగ్యంగా కనిపిస్తావని ఆశీస్తూ, ఆశీర్వదిస్తూ
మీఅమ్మ
సత్యవాణి
No comments:
Post a Comment