*యదార్ద ఘటన :*
*(కొంచం జాగ్రత్త గా చదవండి)..*
*ఒక బ్రాహ్మణుడు దుర్గా మాత గుడి లో పూజారి గా పని చేస్తున్నాడు. ఒక రోజు తన కూతురికి పెళ్లి నిమిత్తం చేయించిన 2 లక్షల విలువైన బంగారాన్ని ఆమె కు ఇవ్వడానికి బస్సు ఎక్కాడు.*
*దురదృష్ట వశాత్తు ఆ బంగారాన్ని బస్సు లో మరిచిపొయి మధ్య లో బస్సు దిగాడు. కొంత సేపడికి గుర్తు వచ్చింది.*
*బంగారం సంగతి!*
*చుట్టుపక్కల అడిగాడు మాకు ఏమి దొరకలేదు అన్నారు.*
*హడావుడిగా బస్టాండ్ కి పోయి తను వచ్చిన*
*బస్సు లో వెతికాడు. బస్సు అంత ఖాళి గ వుంది.*
*ఎంతమందిని అడిగిన ఏమి ప్రయోజనం కలుగలేదు.*
*మనసు అంత భాద తో దిగాలు గా కూర్చున్నాడు.*
*భాధ తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చేశాడు. కలికాలం ప్రబావం ఏమో ఎందుకు ఏడుస్తున్నావ్ అని కూడా ఎవరు అడగలేదు. భాద తోటే అమ్మవారి దండకం స్తోత్రం చదువుతున్నాడు. కొద్ది సేపు అలా భాద పడి తిరుగు ప్రయాణం అయి బస్సు ఎక్కుదాం అని వెళ్ళాడు.*
*బస్సు ఎక్కే టైం కి ఒక వృద్దురాలు వెనుకగా ఒచ్చి నేట్టిందట వెంటనే ఇతను అమ్మ నీకు తొందర గా వుంటే నువ్ ఎ బస్సు ఎక్కు ముందు ఎందుకు నేడుతావ్ అన్నాడు వారిద్దరి మద్య సంబాషణ చుడండి.*
*వృ....వృద్దురాలు*
*వ్య....వ్యక్తీ*
*వృ....ఎక్కడికి రా నువ్ పోయేది*
*వ్య....జాగ్రత గ మాట్లాడు అమ్మ*
*అరె అంటావ్ ఏంటి నీకు ఎందుకు నా గురించి*
*వృ....నిన్ను నేను పోనివ్వను గాని ఎందుకు రా ఆడపిల్ల ల* *ఏడుస్తున్నావ్ ఏమైంది*
*వ్య నీకు ఎందుకమ్మా నువ్ ఏమన ఆరుస్తావా తీరుస్తావా నా భాద నాది*
*వృద్దురాలు ఏమైందో చెప్పి కదులు అన్నది అప్పుడు తన బాద అంత చెప్పాడు.*
*వెంటనే అతనిని లాక్కుని బస్సు కంట్రోలర్ దగ్గరికి పోయినది కంట్రోలర్ ఫోన్ మాట్లాడుతున్నాడు.*
*వృద్దురాలు అరేయ్ నీ ఫోన్ తరవాత మాట్లాడోచు ముందు ఈ వ్యక్తీ చెపేది విను అన్నది కంట్రోలర్ కూడా అరేయ్ అంటావ్ ఏంటి అని అడిగాడు వెంటనే ఆమె నీది కూడా నా కొడుకు వయస్స్సు కనుక అరేయ్ అన్నాను.. అని బంగారం పోయిన సంగతి ప్రయాణికుడి టికెట్ చూపించి అడిగింది.*
*కంట్రోలర్ నీ టికెట్ తో ఏమి కాదు అంటూ బూతులు మాట్లాడాడు వెంటనే ఆమె బూతులు నా దెగ్గర కాదు జాగ్రత్తగా మాట్లాడు. ముందు మా సరుకు ఎక్కడ మిస్ ఐనదో మీ వాళ్ళని అడిగి చెప్పు లేకుంటే రేపు ఇదే బస్టాండ్ లో అడుక్కు తినేల చేస్తా జాగర్త అన్నది కంట్రోలర్ ఈమె బాద పడలేక ఏవో 2 బస్సు స్టేషన్ ల కి కాల్ చేసి మీకు ఏమన బంగారం దొరికితే ఇవ్వండి అని చెప్పి...*
*వీళ్ళని ఆ స్టేషన్ లకి వెళ్ళమన్నాడు (దొరుకుతుంది అనే నమ్మకం లేదు కాని మీ భాద మీరు పడండి అన్నాడు కంట్రోలర్ )*
*వెంటనే ఆమె బయటకి వచ్చి చప్పట్లు కొట్టి ఒక ఆటో వాడ్ని పిలిచింది. వాడు వస్తూనే అమ్మగారు దండాలు అన్నాడు.*
*ఆమె బాదితుడిని చూపిస్తూ అరేయ్ వీడిని వైరా అనే వూరు తీసుకెళ్ళు అన్నది ఆటో వాడు సరే అమ్మ గారు అన్నాడు కిరాయ్ ఎంత ఇస్తే అంత తీసుకో అన్నది సరే అన్నాడు ఆటో వాడు.*
*కాని బంగారం పోయిన వ్యక్తీ మాత్రం నా దగ్గర 60 రూపాయలే వున్నై తరవాత ఎక్కువ డబ్బులు అడిగితె కష్టం అన్నాడు వెంటనే ఆమె నిన్ను వాడు ఏమి అల డబ్బు ఎక్కువ అడగడు గాని నువ్ నోరు మూసుకుని ఆటో ఎక్కు అన్నది.*
*అతను ఆటో లో ఎక్కాడు కొంత దూరం వెళ్ళాక ఆటో వాడు*
*సర్ మీకు ఆవిడ బందువులా? అన్నాడు*
*ఆమె పాలు అమ్ముకునేది నాకు ఎం బందువు కాదు అన్నాడు ఈ వ్యక్తి*
*వెంటనే ఆటో వాడు అదేంటి అండి అలా అంటారు ఆమె వంటి నిండా నగలు పచ్చని దేహ చాయ చంద్ర వంక లాంటి బొట్టు కలిగి మెరిసిపోతూ వుంటే అని జ్ఞానోదయం కలిగించాడు. అలా ఇద్దరు వైరా వెళ్లి బస్టాండ్ లో అడిగారు వాళ్ళు కూడా ఏమి పట్టించుకోకుండా సరే ఆ పక్కన కూర్చోండి అని చెప్పారు.*
*ఆటో వాడు ఈయన ఇద్దరు ఒక ముల కూర్చున్నారు 2, 3 గంటల నిరీక్షణ తరువాత కంట్రోలర్ వచ్చి*
*ఒక 50000 ఇస్తావా అన్నాడు. వెంటనే ఇతను అయ్యా నేను బ్రాహ్మణుడిని కావాలంటే నా గురించి మా వూరు లో అడగండి నేను ఇవ్వలేను అన్నాడు.*
*మళ్ళి ఒక గంట నిరీక్షించిన తరువాత అరేయ్ లోపల వున్న బాగ్ తీసుకురా అని పోలీసులు మీడియా అందరి సమక్షం లో పొయిన బంగారం మొత్తం ఇతనికి అప్పగించారు.*
*అప్పుడు అర్ధం అయ్యింది .ఇతనికి వృద్దురాలి రూపం లో అమ్మవారే నడిచి వచ్చి తన కూతురు కాపురాన్ని తన జీవితాన్ని కాపాడింది. అని గ్రహించి తను పని చేసే గుడి లో అమ్మవారికి 40 బిందెల పాలు అబిషేకం చేసి క్షమాపణ వేడుకున్నాడు.*
*చూడండి భక్తుల ఆర్తిని తీర్చుటకు అమ్మవారు ఎలా నడిచి వచ్చినదో..*
*మనం ఏ పని చేసినా నమ్మకం తో చేసినప్పుడే ప్రతిఫలం.*
*ఓం శ్రీ మాత్రే నమః🙏🚩*
No comments:
Post a Comment