ఓ ప్రొఫెసర్ నాస్తికుడు.
ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా దేవుడులేడన్న విషయం బోధిస్తూంటాడు.
ఓ రోజు ఆ ప్రొఫెసర్‌కి, కొందరు విద్యార్ధులకి దైవం ఉనికి మీద చర్చ వచ్చింది.
“ఇంతకీ దేవుడున్నాడంటారు?” వెటకారంగా ప్రశ్నించాడాయన.
“అవును సర్.” చెప్పాడు ఓ విద్యార్థి.
“ఈ లోకమంతా దేవుడే చేసాడంటావు? ఆయన సృష్టించనిది ఏదీ లేదంటావు?”
“అవును సర్.”
“ఐతే మనిషిలోని దుర్మార్గాన్ని కూడా దేవుడు సృష్టించినట్లేగా? అంటే దేవుడు దుర్మార్గుడన్నట్లేగా?” వెటకారంగా నవ్వుతూ ప్రశ్నించాడాయన.
విద్యార్ధులు ఆ లాజిక్‌కి సమాధానం చెప్పలేక తెల్లమొహాలేసారు.
ఆయన క్లాస్‌లో దేవుడున్నాడని నమ్మే ఓ విద్యార్ధి కూడా ఉన్నాడు.
🌿“ప్రొఫెసర్ గారూ, మిమ్మల్ని రెండు ప్రశ్నలు వేస్తాను. సరేనా?”..
“సరే. అడుగు.”
☘“చలి అనేది ఉందంటారా? లేదంటారా?”
“ అదేం పిచ్చి ప్రశ్న ఉంది. ఎందుకు లేదు?”
“నిజానికి చలి అనేదే లేదు సార్. వేడి లేని స్థితిని మనం చలిగా చెప్పుకుంటున్నాం. జీరో సెల్సియస్ అంటే, జీరో వేడిమి అని అర్ధం.
☘నా రెండో ప్రశ్నకి జవాబు చెప్పండి సార్. చీకటి అనేది వుందా?..
“ఎందుకు లేదు? ప్రతీ రాత్రి మనం దాన్ని చూస్తూనే వున్నాంగా?”
“చీకటనేదే లేదు సార్. వెలుతురు సోకని స్థితిని మనం చీకటిగా చెప్పుకుంటాం.
👉వేడిమి లేకపోతే చలి, వెలుతురు లేకపోతే చీకటి ఎలా వుంటాయో అలాగే “ప్రేమ” అనే దివ్యత్వం లేకపోవడాన్ని మనం దుర్మార్గంగా చెప్పుకుంటాం.
🌿దుర్మార్గం అనేది మీరు చెప్పినట్లు దేవుడి సృష్టి కాదు సార్. అది ఆయన ఉనికి సోకని స్థితి మాత్రమే.” వివరించాడా విద్యార్ధి.🍁
No comments:
Post a Comment