*ఇప్పుడు అందంగా కనిపించే సీతాకోకచిలుక కూడా ఒకప్పుడు మనం అసహ్యించుకునే పురుగే కదా ..*
*ఏదైనా అంతే మార్పు సహజం ఆ మార్పుని ఆస్వాదించడం కూడా అంతే సహజంగా ఉండాలి ..*
*సమస్యనా సంతోషమైన నీకోసం అక్కడ ఆగిపోదు వస్తుందంటే కాస్త ఓపిక పడితే వెళ్ళిపోతుంది ఎలా వచ్చిందో అలా ..*
*వినడానికి వింతగా ఉన్న వాస్తవాన్ని నమ్మి తీరాలి*
*అసలు నువ్వు పుట్టింది దగ్గర్నుంచి ఎప్పుడు సంతోషంగా ఉన్నావని సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్న అంతే సంతోషం అంటే ఏంటి ..*
*మన దృష్టిలో కోరికలు తీరడం కోరుకున్నది మనకు అనుకూలంగా జరగడం ఒకటి రాగానే మరొకటి కావాలని మన మనసు కోరుకుంటుంది అక్కడ ఆగుతుందా లేదు మళ్లీ అదే కంటిన్యూ అవుతుంది ..*
*అందుకే మనిషికి సంతోషానికి చిరునామా ఎప్పటికి అప్పటికి వెతుక్కోవడమే అయిపోతుంది మనసుకి ఎప్పుడైతే నిలకడ అనేది వస్తుందో అప్పుడు నీ బాధలన్నీ సంతోషాలుగా మారిపోతాయి..*
*అంతవరకు నువ్వు రావాలి అంటే నువ్వు తట్టుకోలేని గాయాలు నీ గుండె మొయ్యాలి ఆ పెయిన్ ఎప్పుడైతే అనుభవిస్తావో జీవితం పైన ఎప్పుడైతే నీకు విరక్తి పడుతుందో అప్పటి నుంచి నీకు దేని మీద కోరిక ఉండదు అప్పటినుంచి నీకు అసలు జీవితం అంటే బాధే ఉండదు కష్టమే ఉండదు..*
*అన్ని ప్రశాంతంగా ఎలా నడిచిపోతూ ఉంటాయి. మన మనసుతో సహా ఆ బాధ రావడానికి కారణం కూడా మనమే మన కోరికలే అవేమీ పాపాలు కాదు కానీ పాపిష్టి మనుషులు ఉన్నారని ఆలోచించకుండా అమాయకంగా మనం వాళ్లని నమ్మడం ..*
*అవసరం ఉన్నప్పుడు నీకు కాళ్ళ దగ్గరకు వచ్చినవాడు అవసరం తీరాక నీ నెత్తి మీద కూర్చుంటాడు సహాయం చేసినప్పుడు దేవుళ్ళ కనిపించిన మనం. తిరిగి మనకి రావాల్సిన మనం అడిగితే దెయ్యంలా కనిపిస్తాం ..*
*ఇదిగో ఇలాంటి మనుషులని నమ్మడం వల్లే కోరి కష్టాలు తెచ్చుకోవడం అశాంతి పాలు కావడం బీపీలు పెంచుకోవడం హాస్పటల్ లెస్ అవడం గొడవలు పడడం అల్లరి అవడం ఈ దరిద్రాలన్నీ మన అతి మంచితనం తెచ్చిపెట్టే బాధలు..*
*అందుకే మంచితనం పనికిరాదు అన్ని పోగొట్టుకుని అన్ని బాధలు పడ్డాక ఈ జీవితం ఇంతే అని లైఫ్ని వదిలేసి కష్టాన్ని సుఖాన్ని ఒకే రకంగా తీసుకుని ముందుకు సాగుతాం ..*
*అదేదో మన దగ్గర అన్ని ఉన్నప్పుడే కాస్త ప్రశాంతంగా కాస్త నిదానంగా ఆలోచించి మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఆలోచించండి...*
No comments:
Post a Comment