Monday, March 31, 2025

 మిత్రమా..
జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను..... 
తినడానికి టైం దొరకని రోజులను..


 నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను,
 ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, 
ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని,
 పాతాళానికి తొక్కే మోసాన్ని,
 బాధలో తోడుగా ఉండే బంధాన్ని,
 బాధించే బంధువులను, 
వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని,
ఎవరి కంటికి కనిపించని దీనావస్థని..... 
జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది..

 నీకు నచ్చినా నచ్చకపోయినా వీటి అన్నింటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసిందే...!!

జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు,
 నీకు కావలసిన ప్రతీ ఒక్క ఐటమ్ ని నువ్వే స్వయంగా వెతికి, శోధించి, సాధించి వడ్డించుకుని తినాలి..
 
 నువ్వు ఐదు నిమిషాల్లో తినే అన్నం,
 వండడానికి అమ్మకి గంట పడుతుంది,
 అమ్మకి గంటలో వండిన ఆ అన్నం సంపాదించడానికి నాన్నకి ఒకరోజు పడుతుంది,
 నాన్న ఒక రోజులో సంపాదించిన అన్నం పండించడానికి రైతుకి మూడు నెలలు పడుతుంది. 

అంటే దీన్ని బట్టి ఏమర్ధమయ్యింది మిత్రమా...,
 ఐదు నిమిషాల్లో నీ దగ్గరకి వచ్చినంత మాత్రాన అది సులభంగా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు  5 నిమిషాల్లో తిన్న ఆ అన్నం నీ దగ్గర కి రావడానికి ఎందరు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు కష్టపడ్డారో తెలుసుకో..

అలాగే నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతీ ఒక్క సుఖం,  సౌకర్యవంతమైన జీవితం మొత్తం కూడా నీ తల్లిదండ్రుల, గురువుల,  కర్షకుల, కార్మికుల, సైనికుల త్యాగ ఫలితం, భిక్షే అని తెలుసుకో...

 కాబట్టి జీవితంలో కష్టం ఎదురైనప్పుడు వారిని గుర్తు చేసుకో,  నీ కష్టం ఏ పాటితో నీకే Easy గా అర్ధమవుతుంది.. అంతేగాని ప్రతీ చిన్న కష్టానికి బెంబేలెత్తిపోయి, ప్రతీ కష్టానికి చావుని  ఆశ్రయించకు, చచ్చే రోజు వస్తే ఎలాగూ చస్తావు, చచ్చే రోజు వచ్చే దాక  బతికి చూపించు. అదే నీకు జీవితం నేర్పిన, నేర్పుతున్న, నేర్పబోయే గుణపాఠం.. ఆ పాఠం నుంచి ఎంతోకొంత నేర్చుకో, అంతేకాని ఆ గుణపాఠం నుంచి తప్పించుకోవాలని చూడకు నేస్తమా..

No comments:

Post a Comment