🔔 *అనగనగా..* 🔔
ఒక మర్రి చెట్టుపై ఒక చిలుకల జంట గూడు కట్టుకుంది. ఆడ చిలుక గూడులో రెండు గుడ్లు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత, గుడ్ల నుండి రెండు పిల్లలు బయటకు వచ్చాయి. ఆ పిల్ల చిలకలను తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు. కొన్ని వారాల తర్వాత, ఆ చిన్న చిలుకలు కొంత ఎదిగి, కొద్ది కొద్దిగా ఎగరడం నేర్చుకున్నాయి.
ఒకరోజు మగ పక్షి ఇలా అంది, “మన పిల్లలను మనం బాగా చూసుకున్నాం. మంచి ఆహారం కూడా ఇచ్చాం. అవి కలిసి ఆడుకున్నాయి, కలిసి ఎగరడం నేర్చుకున్నాయి. ఇప్పుడింక అవి తమను తాము చూసుకోగలవు, క్రమంగా అవి స్వంతంగా బ్రతకగలిగేలా మనం అవకాశం ఇవ్వాలి."
ప్రతి ఉదయం, ఆ పక్షులు తమ పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయలుదేరేవి. సాయంత్రం పిల్లలకు ఆహారం ఇవ్వడానికి తిరిగి వచ్చేవారు. ఈ దినచర్య కొంతకాలం కొనసాగింది.
చిలుకల ఈ దినచర్యను ఒక వేటగాడు కొంతకాలంగా గమనిస్తున్నాడు. పెద్ద పక్షులు ఉదయాన్నే వెళ్లిపోతాయని అతనికి తెలుసు. అవి వెళ్లిపోయిన తర్వాత, వేటగాడు ఆ పిల్ల చిలుకలను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం వేటగాడు పిల్ల చిలుకలను పట్టుకున్నాడు. చిన్న చిలుకలు వేటగాడి బారి నుండి తమను తాము విడిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. రెండు పిల్లచిలుకల్లో ఒకటి వేటగాడి నుండి తప్పించుకుని ఎగిరిపోయింది, వేటగాడు ఆ రెండో చిలుకను బోనులో బంధించి ఇంటికి తీసుకెళ్లాడు.
"నేను రెండు చిలుక పిల్లలను పట్టుకున్నాను కానీ ఒక చిలుకను పోగొట్టుకున్నాను," అని వేటగాడు బాధపడ్డాడు!
వేటగాడి పిల్లలు ఆ చిలుకతో ఆడుకునేవారు. త్వరలోనే, ఆ వేటగాడి ఇంటిలోని చిలుక కొన్ని మాటలు మాట్లాడటం నేర్చుకుంది.
వేటగాడి పిల్లలు తండ్రితో, "నాన్నా, మన చిలుక కొన్ని మాటలు నేర్చుకుంది," అన్నారు.
ఒకరోజు, ఒక బాటసారి వేటగాడి గుడిసె వద్ద నుండి వెళ్తూ, అలిసిపోయి, విశ్రాంతి తీసుకోవడానికి గుడిసె దగ్గర కూర్చున్నాడు. అక్కడ అతనికి చిలుక గొంతు వినిపించింది.
చిలుక, "మూర్ఖుడా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీ గొంతు కోస్తాను!" అని అంది.
అలాంటి అహితమైన, కఠినమైన మాటలు విని బాటసారి చాలా బాధపడ్డాడు. వెంటనే లేచి గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతదూరం నడచిన తర్వాత ఒక ఆశ్రమం చేరుకున్నాడు. ఆశ్రమంలోని చిలుక అక్కడి సమీపంలోని చెట్టుపై కూర్చొని ఉంది.
ఆ చిలుక, "ప్రియమైన యాత్రికుడా, స్వాగతం! ఈ ఆశ్రమానికి స్వాగతం. ఈ అడవిలో మనకు చాలా మంచి ఫలాలు ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తినండి. ఇక్కడ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని బాగా ఆదరిస్తారు" అని అంది.
ఆ బాటసారి ఆశ్చర్యపోయాడు. అతను చిలుకతో ఇలా అన్నాడు, "నేను ఒక వేటగాడి గుడిసె దగ్గర ఒక చిలుకను కలిశాను, అది చాలా కఠినమైన మాటలు మాట్లాడుతోంది, నేను వెంటనే అక్కడ నుండి వచ్చేసాను, ఇక్కడ నిన్ను కలిసాను, నువ్వు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు. నీవు ఒక దయగల, మృదువైన హృదయం ఉన్న ప్రాణిలా ఉన్నావు. నువ్వు, ఆ చిలుక రెండూ ఒకే విధమైన పక్షులైనా, మీ భాషలో ఎందుకు అంత తేడా ఉంది?"
ఆశ్రమంలోని చిలుక ఇది విన్న వింటేనే ఆ రెండో చిలుక తన సొంత సోదరుడేనని ఊహించింది. అప్పుడు ఇలా చెప్పింది... “ఓ బాటసారీ, ఆ రెండో చిలుక నా సోదరుడు. కానీ మేము రెండు వేర్వేరు ప్రదేశాలలో పెరిగాం. నా సోదరుడు వేటగాళ్ల భాష నేర్చుకుంటే, నేను భక్తిపరుల భాష నేర్చుకున్నాను. మా సహవాసమే
మా మాటలను, చర్యలను రూపొందిస్తుంది.”```
*’పర్యావరణం’ అంటే ఏమిటి?*
```
గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది, పోలీస్ స్టేషన్/ఆసుపత్రిలో ఉన్నప్పుడు మనకి అశాంతి కలుగుతుంది, ఇలా రకరకాల వాతావరణాలకు అనుగుణంగా మన మానసిక స్థితి మారుతుంది. ఎందుకని?
ఎప్పుడైనా ఈ మార్పుపై దృష్టి పెట్టారా?
కాసేపు ఆగండి, ఈ మార్పు గురించి ఆలోచించండి, ధ్యానం చేయండి: మన ఆలోచనలు పర్యావరణాన్ని సృష్టిస్తాయి. అదే మన చర్యలను ప్రభావితం చేస్తుంది.✍️```
♾️♾️♾️♾️♾️
అవగాహన అనేది మేధోపరమైన విషయం కాదు, నిజమైన అవగాహన హృదయంలోనే ఉంటుంది.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment