*ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా‘సంపూర్ణl ఆరోగ్యానికి ఖర్చులేని మందు, మానసిక వికాస సిద్ధి, శరీరం - మనసు మధ్య సమతుల్య సాధనకు సహాయపడేది యోగాఒక్కటే' అనే నినాదం మార్మోగుతోంది.*
*యోగ (Yoga) మరియు వ్యాయామం (Exercise) రెండు శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం చేస్తారు, కానీ వాటిలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. వ్యాయామం అనేది సాధారణంగా శారీరక బలం, ఓర్పు మరియు శక్తిని పెంచడంపై దృష్టి పెడుతుంది, అయితే యోగా శారీరక కదలికలతో పాటు శ్వాస నియంత్రణ, ధ్యానం మరియు మానసిక ప్రశాంతతను కూడా కలిగి ఉంటుంది.*
*ప్రపంచవ్యాప్తంగా అందరి ఆదరణ దక్కేలా చేసింది. అందుకే యోగాని అలవాటుగా చేసుకుంటే లైఫ్ మరింత హెల్దీగా, హ్యాపీగా ఉంటుంది. యోగాకు 5వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం ఫిజికల్ ఫిట్నెస్ పై మాత్రమే ప్రభావం చూపించదు. ఇంటర్నల్. బాడీ (శరీరం లోపల) పనితీరుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు రక్తప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది. తద్వారా నరాల లోపల ఏదైనా అడ్డుపడితే తొలగిపోయి... గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది.*
*మనందరిలో ఫిజికల్, సైకలాజికల్ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమ బద్ధం అవుతుంది. మొదలు పెట్టేప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో రెండు రోజులు, మూడు రోజులు యోగా చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల తలనొప్పి వచ్చినా.. ఎందుకొచ్చింది? ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఫుడ్ పరంగా ఎక్కడ మిస్టేక్ అయ్యింది? ఈ సందేహాలకు సమాధానాలు వెంటనే తెలిసిపోతాయి. కోపం, అసహనం, చిరాకు వల్ల బంధాలలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు.*
No comments:
Post a Comment