Saturday, June 21, 2025

 *అహంకారం, గర్వం, పొగరు... చాలా ఖరీదైనవి. మనకువాటిని కొనుక్కునే స్తోమత లేదు.*

*అందుకే... చవగ్గా దొరికే సంతోషం, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయత, సర్దుకుపోవడం... అనే వాటితోనే సరిపెట్టుకుందాం.*

*ప్రమాదమైనా సింహాన్నే ప్రేమించు, ప్రమాదం లేదనుకుని నక్కలతో చెలిమి వద్దు. అసలు ప్రమాదం గుంట నక్కలతోనే.!!*

*ఇతరుల కష్టాలు తీర్చే స్థోమత లేకున్నా, ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు... కష్టాల్లో ఉన్నా వారికి మనమే దేవుడు అవుతాం*

*మనిషి మంచివాడు కావాలంట, మంచి పనులు చేయక్కరలేదు, ఎదుటివారి గురించి ముందొక మాట, వెనుకొక మాట మాట్లాడకుంటే చాలు.!!*

*మనిషిది చాలా విచిత్రమైన స్వభావం... ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ... సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు ఎందుకో.!!*

*మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం... నమ్మకం ఎంత బలపడితే నమ్మకద్రోహం అంత గట్టిగా తగులుతుంది.!!*

*కష్టాలు కన్నీళ్ళనే కాదు నిజాలను బయటకు రప్పిస్తుంది, దాపరికాల ముసుగును తొలగిస్తుంది... వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది... కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే... మనలో ధైర్యాన్ని... మన సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది... మన భవిష్యత్తుకు... గమ్యాన్ని వెతికేలా చేస్తుంది.!!*
 
*జీవితంలో ఎప్పుడూ మంచివాళ్ళను నొప్పించకు ఎందుకంటే... వాళ్ళు వజ్రం లాంటి వాళ్ళు... చేజారితే పగిలిపోరు... నీ జీవితం నుండి జారిపోతారు.!!*

*కంటికి నచ్చే ఎన్నో విషయాల గురించి... పరుగులు తీస్తూ ఉంటాం... కానీ గుండెకు నచ్చే విషయం గురించి వెతకండి... నయనానందం క్షణికం... హృదయానందం శాశ్వతం...☝️*

      *- సదా మీ శ్రేయోభిలాషి...👏*
💎💎💎 🥰🙇‍♂️🥰 💎💎💎

No comments:

Post a Comment