Tuesday, June 3, 2025

 *శక్తి ఆరాధన.....*

*సనాతన హిందూ ధర్మంలో ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు శాక్తేయులుగా పిలువబడుతారు. ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.*

*ఈ శక్తిని శివుని భార్య పార్వతిదేవిలో ఉన్నాయని భావన. ఆ భావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె విష్ణువులా రాక్షస సంహారిణి. లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది. ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరువాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేకరూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానికి గ్రామదేవతలు ఉంటారు.* *ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాలలో కనిపిస్తుంది.*

*ఆరాధనా పద్ధతులు దేవీ నామాలు శ్రీవిద్య సంప్రదాయం ప్రకారం నవావరణ పూజ చేస్తున్న శాక్తేయ గురువు శ్రీ అమృతానందనాథ సరస్వతి సహస్రాక్షిమేరు మందిరం, దేవీపురం సింధూ నాగరికతలో శివుని పశుపతిగానూ లింగమూర్తిగానూ ఆదిశక్తిని లోకమాతగానూ జన్మకారిణిగానూ భావించి ఆరాధించినట్లు పురాతన అవశేషాలు చెప్తున్నాయి. ఊరి పొలిమేర్లను కాచే దేవిగానూ పెద్ద అమ్మవారుగా పిలువబడే అంటు వ్యాధి మసూచి నివారిణిగా భావించే అమ్మగా రేణుకాదేవి తెలుగునాట పోలేరమ్మగానూ తమిళనాడులో ఎల్లమ్మ మరియు ఎట్టమ్మగానూ ఉరూరా వెలసి పూజింపబడుతుంది.*

*ఉడుపుచలమ అని చెప్పబడే ప్రత్యేక వాయిద్య సహాయంతో చెప్పబడే కథలో రేణుకాదేవి వృత్తాంతం చెప్పడం జమదగ్ని భార్య రేణుకాదేవి రోగాలబాధ నుండి విముక్తి కలిగించే మారెమ్మ అని నిర్ధారణ చేస్తుంది. ఈమె మూర్తి తలవరకు మాత్రమే ఉంటుంది. తలకు మాత్రమే పూజలు చేస్తారు. నామాలు పల్లెలూ, గ్రామాలూ, ఊర్లూ, పట్టణాలూ ఒక్కో ప్రదేశానికీ ఒక్కో రూపంలో పూజింపబడే అమ్మవార్ల నామాలు కోకొల్లలు. వాటిలో కొన్ని విజయవాడ కనకదుర్గ, కంచి కామాక్షీ, మధుర మీనాక్షి, ముంబాయిలోని మాంబాదేవి, కలకత్తా కాళీ, మైసూరు చాముండి, మూగాంబికా, వైష్ణవీమాత, కాశీ విశాలాక్షీ, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ప్రముఖ నామాలలో కొన్ని.*

*గ్రామదేవతలైన పోలేరమ్మ, ఎల్లమ్మ, పైడితల్లి, బతుకమ్మ, రేణుకా, కాకతమ్మా, మాహురమ్మా, శ్రీనాధుని రచనలలో వర్ణింపబడిన మూలగూరమ్మ, పిఠాపురం పీటలమ్మ, సామర్లకోట చామలమ్మ, దాక్షారామం మాణిక్యాలమ్మ లాటి రూపాలు మరికొన్ని దేశదిమ్మరులూ లైన కొండ దొరలు భవిష్యత్తు చెప్పడం చెప్పించుకోవడం ఒక అలవాటు. వారు చెప్పే ముందు "అంబ పలుకు, జగదంబ పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు కాశీవిశాలాక్షి పలుకు" అని ముందుగా దేవి ఆనతి తీసుకుని దేవి పలుకులుగా భవిష్యత్తు చెప్పడం అలవాటు.*

*ఈ అలవాటు ఎరుకలసానులు అనబడే సోది చెప్పే ఆడవారిలో కూడా ఉంది. గంగిరెద్దును తీసుకు వచ్చి బిక్షాటన సాగించే బుడబుక్కల వాళ్ళు అమ్మపేరుతో ఆశీర్వచనాలు గృహస్తులకు ఇస్తుంటారు. వామాచారం తాంత్రిక పూజలు ప్రజలను భీతావహకులను చేసే క్షుద్రపూజలు మరియు మాంత్రిక శక్తులను సాధించడానికి దేవీ రూపాలలో పూజించడం అలవాటు. దీనిని ఉపాసన అనడం ఆనవాయితీ. వీరు కాళీమాత, రాజరాజేశ్వరీ, లలిత, బాలా త్రిపురసుందరీ మొదలైన నామాలతో ఆరాధిస్తారు.*

*వాగ్గేయకారులూ దేవిని అంబ, వారాహి, వైష్ణవీ, శారదా, అఖిలాండేశ్వరి, వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు. దేవి ఆరాధకుడైన కవి కాళిదాసుచే ఆరాధించ బడిన కాళి, కవులచే ఆరాధించబడిన శారదాంబ, వీరిలో కొందరు. ముత్తు స్వామి దీక్షితులచే ఆరాధించబబడిన అంబ జలంధర పీఠవాసిని, శ్యామశాస్త్రిచే ఆరాధించబడిన కామాక్షీ చెప్పుకో తగినవి...*

*┈━❀꧁ఓం నమశివాయ꧂❀━┈*
         *SPIRITUAL SEEKERS*
🍃🪷🍃 🙏🕉️🙏 🍃🪷🍃

No comments:

Post a Comment