*🙏నేడు యోగినీ ఏకాదశి ...!!*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿దైవనామస్మరణతో మనసు మీదా, ఉపవాసంతో శరీరం మీదా అదుపుని సాధించి..
🌸 భగవంతునికి చేరువకావడమే ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న పరమార్థం.
🌿 అందుకే ఏడాది పొడవునా ప్రతి ఏకాదశికీ ఏదో ఒక విశిష్టతను కల్పించారు పెద్దలు.
🌸అలా ఈనాటి జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే యోగినీ ఏకాదశి.
🌿 ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి.
🌸ఈ ఏకాదశి ఆచరణ గురించి ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే...
🌿అలకాపురిని ఏలుతున్న కుబేరుడు పరమ శివభక్తుడు. శివార్చన కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని
🌸 కుబేరుడు, హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు.
🌿 మానససరోవరం నుంచి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు.
🌸ఒకనాడు భార్య సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు.
🌿అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు తన చెంతకి ఎంతకీ పుష్పాలు రాకపోయేసరికి చిరాకుపడిపోయాడు.
🌸 కుబేరుడు మండిపడుతూ ‘నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది.
🌿అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకం మీద జీవించమం’టూ శపించాడు.
🌸 కుబేరుని మాటలకు హేమమాలి గుండె పగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది.
🌿 ఇక కుబేరుని శాపాన్ని స్వీకరించి కుష్టువ్యాధిగ్రస్తుడై, భూలోకం మీద సంచరించసాగాడు.
🌸హేమమాలి అదృష్టమో, లేక ఇన్నాళ్లుగా అతను శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలమోగానీ అతనికి మార్కండేయ రుషి దర్శనం లభించింది.
🌿హేమమాలిని చూసిన మార్కండేయ రుషికి చెప్పలేనంత జాలి కలిగింది. ‘యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే
🌸 నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావు’ అంటూ ఉపాయాన్ని సూచించారు మార్కండేయులవారు.
🌿మార్కండేయులు సూచించిన మేరకు జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి,
🌸 మనసులో దైవాన్ని పదే పదే ప్రార్థించి హేమమాలి తన శాపవిమోచనాన్ని సాధించాడు.
🌿 తిరిగి అలకాపురిని చేరుకుని తన భార్యను కలుసుకున్నాడు.
అలా కేవలం హేమమాలి మాత్రమే కాదు
🌸 ఎవరైతే యోగినీ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత పాపకర్మల నుంచి విమోచనం పొందుతారన్నది కృష్ణుని ఉవాచ.
🌿హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు! జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక.
🌸ఆ మోహాన్ని జయించేందుకు ఏకాదశి ఒక సాధనం అని తెలియచేసే ప్రతీక!
హరినామ స్మరణం సమస్త పాప హరణం ...🚩🌞🙏🌹🎻
🎻🌹🙏ధర్మసందేహాలు -సమాధానం....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿ప్ర. ఏకాదశీవ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసిందేమిటి? ముందు రోజు కూడా ఉపవాసముండాలా ?
🌸జ. ఏకాదశి ముందు రోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి.
🌿 లక్ష్మీనారాయణులను పూజించి పారాయణం, జపం, ధ్యానం సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి.
🌸 ( వృధా సంభాషణలు, నింద, పరుషవచనాలు పలుక రాదు.) మరుసటి రోజున (ద్వాదశినాడు) మళ్ళీ పూజ చేసి, శుచిగా వండిన ఆహారాన్ని భగవంతునికి నివేదించి విష్ణుస్వరూపంగా భావిస్తూ శక్త్యనుసారం విప్రునకు భోజనం పెట్టి, తదనంతరం తాను భుజించాలి.
ఇది ఏకాదశీ వ్రతవిధి...
🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸
No comments:
Post a Comment