Saturday, June 21, 2025

 *ఓం నమో భగవతే వాసుదేవాయ...*

*నీకు ఏది రావాలని ఉంటే అది రాక తప్పదు... నీది కానిది, నీకు రానిదేదీ నీకు దక్కదు.! ఈ విషయములో అనవసర ఆందోళనలు పడడం వృధా* 

*ఆశలు పెంచుకుంటూ నాకు అది కావాలి, ఇది కావాలి అని భగవంతుణ్ణి అడిగి బిచ్చగాళ్ళు కాకండి...*

*నాకు ఇష్టమైనది కాదు, మీకు ఇష్టమైనదే ఇవ్వండి, అదే నాకు ఇష్టం' అని భగవంతుణ్ణి వేడుకో... ఆయనకు సదా శరణాగతుడవై ఉండు...* 

*నీవేదీ అడగకుండానే అన్నీ నీ దగ్గరికే పంపిస్తాడు... నీకు సరైన రక్షణ కల్పిస్తాడు, నీ సకల బాధ్యతలు ఆయనే చూస్తాడు.. భగవంతుణ్ణి నమ్మక చెడినవాడు ఉన్నాడేమో కానీ నమ్మి చెడినవాడు ఎక్కడా లేదు... కనుక గట్టిగా నమ్ము...*

*హరేకృష్ణ...🙏*

No comments:

Post a Comment