*హరిఓం. - - _ఎప్పుడూ..మన వైపు నుండే కాదు... అప్పుడప్పుడూ, ఎదుటివాళ్ళ_*
*_వైపు నుండి కూడా ఆలోచించాలి_..*
*అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం* *దొరుకుతుంది.. యథార్థమైన సత్యం అర్థమౌతుంది...*
*మనిషిని పరిచయం చేసుకోవటంలో గొప్పతనం ఏమీ లేదు... వాళ్ల మనసుని అర్థం చేసుకోవటంలోనే మన గొప్పతనం ఉంది.. అభిమానం అప్పు లాంటిది, దాన్ని ఎప్పుడూచెల్లిస్తూనే ఉండాలి...*
*గౌరవం సంపద లాంటిది, ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి… అందుకే లక్షలు ఉన్న వాళ్ల కోసం కాదు, లక్షణాలు ఉన్న వాళ్ల కోసం వెంటపడాలి… లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్న వాళ్లను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం...*
*ఎందుకంటే చిమ్మచీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది...*...... - 🙏🙏 ..... - వలిశెట్టి లక్ష్మీ శేఖర్ . - Ph.98660 35557. - HYD. 20.06.2025.
No comments:
Post a Comment