Monday, September 8, 2025

 .  *రాముడు వనవాసంలో ఎదురయ్యే* 
      *కష్టాలను సీతకు వివరించటం*
*꧁❀❀━❀♻️🌏♻️❀━❀❀꧂*

*రాముడు: సీతా! నువ్వు ఉత్తమమైన రాజవంశంలో పుట్టి పెరిగావు. ధర్మాచరణమందు నిష్ట కలిగినదానవు. నేను తిరిగి వచ్చేవరకు నువ్వు ఇక్కడే ఉంటూ, నీ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. అప్పుడే నేను సంతోషంగా ఉండగలుగుతాను. అట్లాకాదని మూర్జించి నాతో వస్తే అనేక కష్టాలు ఎదురవుతాయి. అవన్నీ నువ్వు సహించలేవు. నా మాట విని నువ్వు నాతో అడవులకు వచ్చే ఆలోచన మానుకో. అది మన ఇద్దరికీ శుభకరం. నీకిక్కడ అలవాటైన సుఖాల్లో ఒక్కటికూడా అడవుల్లో దొరకదు. తర్వాత నువ్వు తీవ్రంగా దుఃఖీస్తావు.* 

*ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ అంత బీభత్సంగా ఉంటుంది. ఎత్తైన పర్వతాల మీద నుండి లోతైన లోయల్లోకి నీరు పారేటప్పుడు పుట్టే శబ్దాలు కఠోరంగా ఉంటాయి. అంతేకాదు కొండగుహల్లో సింహాలు చేరి గర్జిస్తూ ఉంటాయి. ఆ గర్జనలు కఠోరంగానే కాదు,* *భయంకరంగా కూడా ఉంటాయి. బలిసిన క్రూరమృగాలు మనుష్యులను చూడగానే భీకరంగా మీదపడి చంపుతాయి. నదుల్లో బలమైన మొసళ్ళు తిరుగుతూ ఉంటాయి. మదించిన ఏనుగులు కూడా గుంపులు గుంపులుగా సంచరిస్తాయి. పగలల్లా కష్టపడి తిరిగి ఉంటాం, పోనీ రాత్రయినా సుఖంగా నిద్రిద్దామన్నా ఎండిన ఆకులపైనే పడుకోవాలి. అట్లాగే ఆహారం కూడా వేళకు లభించదు. ఎక్కడైనా పండిరాలిన ఫలాలు నేలపై కనిపిస్తే వాటిని తిని ఆకలి తీర్చుకోవాలి. అరణ్యంలో నివసించే వారంతా నారబట్టలు, జటలు ధరించవలసి ఉంటుంది. అడవుల్లో ఆహారం దొరకని రోజల్లా ఉపవాసమే గత్యంతరం. ఎప్పుడు రాలిన పండ్లు దొరకుతాయో ఆనాడే విందు. దేవతలను, పితృదేవతలను, అతిథులను నిత్యమూ పూజిస్తూ ఉండాలి. వనవాసంలో నియమవంతులై రోజూ ముప్పూటలా స్నానం చేస్తూవుండాలి. నీళ్ళకోసం చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది.*

*ఓ సీతా! పూజకోసం మనమే స్వయంగా పూలను పండ్లను సమకూర్చుకోవలసి ఉంటుంది. బుషిప్రోక్తానునారంగా పూజలు చెయ్యాలి. వర్గం పడితే కుండపోతగా కురుస్తుంది. ఇక రాత్రుళ్ళు చీకటి చెప్పవలసిన పనేలేదు. వాటన్నిటినీ మించి ఆకలిబాధ మరీ భయంకరమైనది; ప్రాణాపాయం కూడాను. అడవుల్లో భయంకరమైన సర్పాలుంటాయి, అవి ఎటునుండి వస్తాయో, ఎప్పుడు ఎదురవుతాయో ఎవరూ ఊహించలేరు. పక్షులు, తేళ్ళు, కీటకాలు, ఈగలు, దోమలు నిత్యం మనలను పీక్కు తింటూ ఉంటాయి. అబలవైన నువ్వు ఇన్ని కష్టాలు భరించలేవు. సుఖంగా ఇక్కడే ఉండు. ఇవికాక అనేకమైన జబ్బులుచేసి శరీరం కృశించిపోతుంది. వైద్యం చేయించుకుందామా, అంటే అక్కడ వైద్యులే ఉండరు.*

*ఓ సీతా! అరణ్యవాసం చేయవలసి వస్తే కామక్రోధ లోభాలన్నిటినీ విడచి ధ్యాసనంతా తపస్సుపైనే నిలపాలి. అందువల్ల నీవు అరణ్యానికి రావద్దు. నువ్వు అబలవు. ఇన్ని కష్టాలు పడలేవు.*

*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🏹🍁 🙏🕉️🙏 🍁🏹🍁

No comments:

Post a Comment