89e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.218.
నేటి....
*ఆచార్య సద్భోదన*
➖➖➖✍️
```
స్వర్గం, నరకం ఉన్నాయా అంటూ చాలామంది సందేహం.
అవి రెండూ ఉన్నాయనే శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. మొత్తం 14 లోకాల్లో భూలోకం పైన స్వర్గ లోకం, కింద పాతాళం తర్వాత రౌరవాది నరక లోకములు 21 భేదాలతో ఉన్నాయట.
విష్ణు పురాణం, గరుడ పురాణం వంటి గ్రంథాలలో యాతనా శరీరమనే సూక్ష్మదేహంతో జీవుడు పడే బాధలన్నీ విపులంగా వర్ణించారు. పాపాలు చేసిన వాళ్ళు నరకలోక శిక్షలను అనుభవిస్తారు. అలాగే పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకంలో సుఖములను అనుభవిస్తారు.
ఆఖరి జన్మలో పుణ్యపాపాలు రెండింటినీ నిశ్శేషంగా తొలగించుకుని దేవయానం అని పిలిచే అర్చిరాది మార్గములో పయనించి విరజానది దాటి దివ్యదేహంతో జీవుడు పరమపదం చేరుకుంటాడు.```
*మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః* ```
మానవులు కర్మబంధము నుంచి విడుదల అయి మోక్షప్రాప్తిని పొందేందుకు మనస్సే కారణం.
మన మనస్సే స్వర్గాన్ని, నరకాన్ని రెండింటినీ అనుభవింప చేయగలదు. మనస్సు విషయం పూర్తిగా తెలుసుకుని, దాన్ని నిగ్రహించి, నియమించి, నిశ్చలం చేసుకునే మార్గం మనం ఆలోచించాలి, ఆచరించాలి.
ఆధ్యాత్మిక సాధనలన్నింటికీ ఇదే మొదటి మెట్టు.✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment