🌹🌷🌹🪷🧘🏻♂️🪷🌹🌷🌹
*ధ్యానం ప్రారంభించండి .*
*కలుపు మొక్కలు తోటని, ఫలప్రదమైన ఫొలాలని తినేస్తాయని అందరికీ తెలుసు., అందుకని అటు తోటమాలి, ఇటు రైతు కలుపు మొక్కల్ని ఏరుతూనే వుండాలి., ఉంటారు కూడా మిత్రమా...*
*మన వ్యక్తిత్వం పెంచుకోవడానికి కూడా ఇదే మార్గం...*
*మనకున్న లోపాలు, మన లక్షణాలు మనకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదు. అందుకని వాటిని సరిదిద్ది ఆ కలుపు మొక్క లాంటి గుణాలను మనమే ఏరిపారేయాలి మిత్రమా...*
*అప్పుడే మన ఎదుగుదల గొప్పగా శక్తివంతంగా ఫలప్రదంగా సాగుతుంది....*
*మనం భగవంతునికి(ప్రకృతికి) శరణాగతి అయి, మనలను మనం సమర్పించుకుంటే, అందుకు ప్రతిగా భగవంతుడే మనకు లభిస్తాడు...*
*ఇది ప్రకృతి నియతి...*
*ఈ పుడమినందు సమస్తము ఆత్మస్వరూపమే...*
*ఈ బ్రాహ్మణ జాతి, ఈ క్షత్రియ జాతి, ఈ లోకములు, ఈ దేవతలు, ఈ భూతములు, ఈ సర్వమును సృష్టి, స్థితి, లయ కాలములయందు ఆత్మయందు పుట్టుచు, ఆత్మయందే లీనము అగుచు, స్థితి కాలమునందు ఆత్మ స్వరూపము అయిఉన్నది నీవే అన్నది గుర్తుంచుకోండి మిత్రమా...*
*సృష్టి లెక్క ఎప్పుడూ సరిగానే ఉంటుంది మిత్రమా., మన బుద్ధి ఆలోచనలే నిలకడను కోల్పోయి చిందర వందరగా ఉంటుంది.,*
*బుద్ధిని నియంత్రించి సరైన మార్గాన్ని నిర్దేశించడానికి “ధ్యానం సాధన” ఉపయోగపడుతుంది మిత్రమా...*
*"ధ్యానం" అంటే ప్రకృతితో కలిసి ఉండడం.. అంటే, ఈ విశ్వంతో కలిసి ఉండటం.!!*
*అందువలననే “ఈ విశ్వమంతయును ఆత్మస్వరూపమే” అని అన్నారు “యోగులు మహర్షులు ఋషులు దేవతలు అవధులు గురువులు సాధకులు...”*
*గ్రహించినవాడు యోగి...*
*గ్రహించనివాడు రోగి..*
*ఇంతటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించిన గురువుగారు “శ్రీ బ్రహ్మర్షి పితామహా పత్రీజీ గారికి” మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మిత్రమా...*
*
No comments:
Post a Comment