🦚జ్ఞానప్రసూనాలు🚩
14/10/2025
1) నాది అంటే అరణ్యవాసం నేను(అహం) అంటే అజ్ఞాతవాసం. అరణ్యవాసాలు.. అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకం
2) ఆత్మ గురించి ఎంత మాట్లాడినా అది మనసు గురించే అవుతుంది. కాబట్టి మాటల వలన లాభం లేదు.
3) గిరి గీసి కేంద్రంలో బాణం వేసేవాడు సాధకుడు. బాణం వేసి దాని చుట్టూ గిరి గీసేవాడు సిద్ధుడు.
4) దేవుడు సహస్రాక్షుడు అంటే
దేవుడికి వేయి కళ్లు ఉంటాయని కాదు. కళ్లు అన్నీ ఆయనవే అని అర్ధం.
5) నీ మనసు అనంతంగా ఉండాల. ఆ స్థితిలో దేవాలయం అయినా ఒకటే. శ్మశానం అయినా ఒకటే.
6) ఆత్మ యొక్క అభివ్యక్తమే ప్రపంచం.
అని మనకు తెలపడానికి వచ్చేదే స్వప్నం.
No comments:
Post a Comment