Thursday, October 16, 2025

 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) సంవత్సరాన్ని యూనిట్ గా తీసుకుంటే జనవరి ఒకటిన మాత్రమే ఉత్సవం.
క్షణాన్ని యూనిట్ గా తీసుకుంటే ప్రతి క్షణమూ ఉత్సవమే.

2) ఏమీ చేయవలసిన అవసరం లేనిదాని కోసం ఏదేదో చేస్తుంటారు.

3)  నీ జీవితగాథను ప్రపంచంలో ఎలా చూడాలంటే.. ఓ నటుడు తాను నటించిన చిత్రాన్ని తానే చూస్తున్నట్లుగా ఉండాలి.

4) మోక్షం పొందాలనే ఇచ్ఛ నీకు తగినంత బలంగా ఉంటే గురువో, సత్సంగమో లేక మరొకటో ఆత్మశక్తి వల్ల నీకు కావాల్సినవన్నీ సమకూరుతాయి. నువ్వు చిత్తశుద్ధితో ఆత్మపై ధ్యానం చేస్తే మీకు కావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి.

5) నీవు చైతన్యం అయినప్పుడు కర్మ నీ ఆధీనంలో ఉంటుంది. అప్పుడు కర్మ జడం అవుతుంది. నీవు జడం అయితే కర్మ నీ జీవితాన్ని శాసిస్తుంది.

6) మబ్బులను పట్టుకోవడం కాదు ఆకాశాన్ని పట్టుకో. ఆలోచనలను పట్టుకోవడం కాదు ఆత్మను పట్టుకో.

7)ఆత్మ యొక్క అభివ్యక్తమే ప్రపంచం.
అని మనకు తెలపడానికి వచ్చేదే స్వప్నం.

No comments:

Post a Comment