Thursday, October 16, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

    మహర్షికి ఒక భక్తుడు క్షౌరం చేసేవాడు. ఒకసారి ఆ భక్తునికి మోకాలు నొప్పి చేసింది. కానీ పని చెయ్యటానికి వెళ్లాడు. 

    మహర్షి ఆ విషయాన్ని గ్రహించి కరుణతో "కాళ్ళు నొప్పులు చేసినవి కదూ! నీవు ఈ బల్లమీద కూర్చో. నేను బల్లకింద కూర్చుంటాను" అన్నారు.

    అతని మనస్సు కరిగి "అక్కరలేదు భగవాన్! అక్కరలేదు!!" అంటూ బ్రతిమాలి మహర్షిని ఎత్తుపీట మీదే కూర్చోపెట్టి నిలబడే పని చేశాడు.

    మహర్షి కొన్ని రోజులకు నిర్యాణం(మహా సమాధి) అవుతారనగా పని చేయటానికై వెళ్లాడు అతను. తీరా చూస్తే మహర్షి స్థితి ఏమీ బాగా లేదు. కళ్లు మూసుకొనే ఉన్నారు. అతను వెనక్కి వెళ్లిపోదామని అనుకుంటుండగానే మహర్షి ఎట్లా గ్రహించారోకాని ప్రయత్నం మీద కండ్లు తెరచి “ఊ! వచ్చావా?” అంటూ అతి ప్రయాసతో సోఫా దిగి నిర్యాణగది ప్రక్కన ఉన్న స్నానాల గదికి వస్తూ తమలో తాము కొంచెం చిన్నగా "ఎవరూ ఆశాభంగం చెందరాదు" అని అనుకుంటున్నారు.

No comments:

Post a Comment