Thursday, October 16, 2025

 *మీఇంట్లో ఆడపిల్లలున్నారా?*

*అయితే మనం అందరం ఎలా జాగ్రతగా ఉండాలి తెలుసుకోండి!*

*1) మన కుటుంబ సభ్యులు కానివారి నుంచి పిల్లలని దూరంగా పెట్టండి..*

*2) పిల్లలని ఒంటరిగా ఆడుకోమనడం, పక్క ఇళ్ళకు పంపడం అంత మంచిది కాదు..*

*3) మనతో ఎంతో చనువుగా ఉన్నా బయట వాళ్ళు కూడా పిల్లలకి ప్రమాదకారులే కావచ్చు..*

*4) ఇతరులు మన పిల్లలని ఎత్తుకుని ముద్దులిడుతున్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి..*

*5) చాక్లెట్ కొనిపెడతా షాపుకు తీసుకెళతా అంటూ మీ దగ్గర నుండి పిల్లలని తీసుకున్న వ్యక్తుల కోరికను సున్నితంగా తిరస్కరించండి..*

*పరిచయం ఉన్న వ్వక్తులకు పిల్లలని అప్పగించి బయటకు తీసుకెళ్ళమని మీరే పురమాయించకండి..*

*6) అత్యవసర పరిస్థితుల్లో పిల్లలని వేరే ఇంట్లో వదలిగానీ లేదా మీ ఇంట్లోనే వదలి వెళ్ళలసి వస్తే ఆ ప్రయత్నం మానుకొండి..*

*7) పిల్లలు ఆడుకొనే చోటగాని స్కూలుకు వెళ్ళే దారిలోగాని స్కూల్లో జరిగే విషయాల్లో గాని ఆరా తీస్తూ ఉండండి..*

*8) కొంచెం ఎదిగిన పిల్లలకి దేహంలో ఎక్కడ ముట్టుకుంటే తప్పో అసభ్య  ప్రవర్తన ఏవిధంగా గుర్తించాలో వివరించండి..*

*8) అలాంటి వ్వక్తులనుంచి ఎలా తప్పించుకొవాలో ధైర్యంగా ఎలా నిలబడలో స్వయం రక్షణ ఎలా చేసుకోవాలి వివరించాలి..*

*9) ఇంటి టెలిఫోన్ నెంబర్, పోలీస్ స్టేషన్ నెంబర్ పిల్లల వద్ద ఉంచి అత్యవసర సమయాల్లో ఇతరుల సహాయంతో ఫోన్ చేసేలా పిల్లలకు నేర్పండి..*

*10) ఇంటికి దూరపు చుట్టాలు వచ్చినప్పుడు మీ పిల్లలని మీ బెడ్ రూంలోనే పడుకోబెట్టుకోవడం ఉత్తమమైన పని..*

*11) పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా అని గంటలు గంటలు పనిలో తలమునకలై, పట్టించుకోకుండా ఉండడం అంత మంచిది కాదు..*

*12) పిల్లలు ఏదైనా చెప్పడానికి సంకోచిస్తున్న లేదా మూడీగా ఉన్నా భయం భయంగా చూస్తున్న వాళ్ళల్లో వాళ్ళే మధనపడుతున్నా ఏదో జరిగింది అని గ్రహించి ప్రేమగా ఆరా తియ్యండి..*

*13) లైంగిక విషయాలలో ఎవరిమీద అయినా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు..*

*14) 12 ఏళ్ల బాలురు నుంచి వృద్దులు వరకూ పిల్లలకు లైంగిక శత్రువులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి..*

*15)మీ పిల్లలతో ప్రేమగా ఉండండి..*

*మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని టెక్నిక్స్ వున్నాయి వాటిని నేర్పించoడి..*

*స్కూల్ లో ట్యూషన్ లో  ఇతరుల బిహేవియర్ ఎలా ఉందొ రోజు కనుక్కోండి..*

*ప్రతీ మనిషి దగ్గిర ఒక పది అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయమని ఇంస్ట్రుక్షన్స్ ఇవ్వండి..*

*ఏదైనా డేంజర్ ఉంది అని అనిపిస్తే ఫస్ట్ గట్టిగా అరిచి గోల చేయమని చెప్పండి.. నెక్స్ట్ అందుబాటులో వున్న రాయి కర్ర ఇసుక యూస్ చేసి తప్పించుకోవడంలో ట్రైనింగ్ ఇవ్వండి.. పారిపోవడానికి దారులు చూసుకోవడం నేర్పించండి..* 

*అన్నిటికి మించి ఏ విషయం అయినా ఇంట్లో చెప్తే తిడతారు అన్న భయాన్ని పోగొట్టండి.. ఫ్రీ గా వాళ్ళ ఫీలింగ్స్ ని  భయాలను ఎక్సప్రెస్స్ చేసే చనువు ఇవ్వండి..*

*అన్న తమ్ముళ్లు ఉంటే‌ సోదరికి సపోర్టివ్ గా ఉండటం నేర్పించండి.*

*మన ఇంటి మహాలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మనదే!!*

No comments:

Post a Comment