Thursday, October 16, 2025

 *ఏ తాళికైతే విలువిచ్చి నలుగురిలో తలవంచి నీచేత తాళి  కట్టించుకుందో, నేడు ఆ నలుగురి ముందే మీప్రవర్తన వల్ల ఆమెను నవ్వుల పాలు చేసి, ఆ ఇల్లాలి కన్నీళ్లకు కారణం అవ్వకండిరా. నీతో కలిసి తాగడానికి వచ్చే నీస్నేహితులు, నీబంధువులు, నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు కనిపించరు. కానీ తలవంచి నీచేత తాళి కట్టించుకున్న భార్య మాత్రమే నీ బాధను భరించి, నీ తప్పుని క్షమించి నిన్ను బాధ్యతగా నీ కష్టాలను మోస్తుంది రా. మిమ్మల్ని కట్టుకున్న పాపానికి ఆ ఇల్లాలిని కంటికిరెప్పలా చూసుకోకపోయిన పర్వాలేదు. కానీ నీకోసమే జీవిస్తున్న ఆ "ఇల్లాలిని" ఎప్పటికీ కంటతడి మాత్రం పెట్టించకండి రా ప్లీజ్.*

*సంసారం ఒక చదరంగం. సంసారం అనే సాగరంలో నావ గట్టు చేరాలంటే భార్య భర్తలిద్దరూ కలిసిమెలిసి ఉండాలి. సంసారం అనే సాగరంలో సరుద్దుకుపోయే గుణం ఇద్దరికీ ఉండాలి. కేవలం ఒక్కరు మాత్రమే సర్దుకుపోతే ఇంకోకరు సమస్యగానే కనపడతారు. సంసారమంటే కలిసుండటమే కాదు ఎన్నికష్టాలొచ్చిన కన్నీరే ఏరులై పారినా ఒకరినొకరు అర్ధం చేసుకోని కడ వరకు తోడు వీడకుండా కలిసి మెలిసి ఉండడం. ఒక మంచి భర్త "భార్య కన్నీరు" తుడుస్తాడేమో కానీ, అర్ధం చేసుకునే భర్త తన భార్య కన్నీళ్లకు కారణాలు తెలుసుకుని తనకళ్లలో కన్నీరు రాకుండ చూసుకుంటాడు*

*అమ్మ మనకు జన్మనిస్తుంది భార్య ఆజన్మాంతం ప్రేమిస్తూ మనకు పునర్జన్మనిస్తుంది. మన "అమ్మ" తర్వాత మనల్ని భార్య మాత్రమే ఆ స్థాయిలో ప్రేమను పంచగలదు. అమ్మ "భారం" కాదు భార్య "బానిస" అంతకన్న కాదు. మిత్రమా నీకు ఎంతమంది బంధువులు స్నేహితులు ఉండొచ్చు కానీ వారేవ్వరు నిత్యం నిన్ను కంటికిరెప్పల చూసుకోలేరు ఒక్క నీ భార్య తప్ప. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు.*

No comments:

Post a Comment