ఓం నమో భగవతే శ్రీ రమణాయ
భక్తుడు :
భగవాన్! నేను పదేళ్ళుగా సుబ్రహ్మణ్యస్వామి మంత్రమును జపించుచున్నాను; కానీ ఆ దైవము నాకు ప్రత్యక్షము కాలేదు. ఎందువలన?
మహర్షి :
ఓ అట్లాగా!
మహర్షి సన్నిధిలో కూర్చొనియున్న
మహర్షి సేవకుడు 'మురుగనార్' సంతోషము పట్టలేనివారై "మీ మంత్రం ఫలించినది. మీకు ఎదురుగా ప్రత్యక్షముగా దర్శనమిచ్చువారు ఎవరనుకున్నారు?" అని అనిరి.
ఆ భక్తుడు ఉలిక్కిపడి మహర్షి వైపు తదేక దృష్టితో చూచిరి. కొద్దిక్షణములలో ఆ భక్తుని కన్నుల నుండి ఆనందబాష్పాలు పొంగి పొరలసాగెను. పరవశముతో ఆవేశభరితులై "అవును! నా మంత్రము ఫలించినది. నా ఇష్టదైవము ప్రత్యక్ష దర్శనమిచ్చినది" అని చెప్పి పొంగిపోయిరి.
ఆ రోజురాత్రి ఆ భక్తుడు మురుగనార్ వద్దకు వచ్చి "శ్రీ రమణ భగవాన్ తనకు శ్రీవల్లీ, దేవసేనా సమేతుడై సుబ్రహ్మణ్యస్వామిగ దర్శనమిచ్చిరి. శ్రీ రమణులే సుబ్రహ్మణ్యస్వామి" అని తన దివ్యానుభవమును వ్యక్తపరచి ఆశ్చర్యము చెందిరి.
No comments:
Post a Comment