Thursday, October 16, 2025

 *🕉సంతృప్తి సంతోషానికి దారి తీస్తుంది* 


మనిషికి జీవితం లో సంతృప్తి ఎంతో అవసరం.ఎంత ధనవంతులైనప్పటికి, అతను సంతృప్తిగా లేకుండా ఉంటే సంతోషంగా ఉండలేడు.

కోరికలను సంతృప్తి పరచడానికి చాలా ప్రయత్నాలు కృషి అవసరం. ఈ ప్రక్రియలో సంతోషం ఏమిలేదు. ఒకవేళ ఆ వస్తువును పొందినప్పటికి, దానిని కాపాడటంలో ఎంతో కష్టం వున్నది. ఇక్కడ కూడా మనం ఆనందాన్ని అనుభవించటం లేదు. ఒకవేళ కష్టపడి సంపాదించిన వస్తువు పోతే దుఃఖం మాత్రమే మిగులుతుంది. అందువల్ల కోరిక మీద కోరికలను పెంచకూడదు. పాత రోజుల్లో ఋషులు అడవులలో నివసించేవారు. సౌకర్యాలు లేకపోయినా వారు సంతోషంగా ఉండేవారు. అది వారి మానసిక సంతృప్తి కారణంగా ఆలా జరిగేది.

మనం ఎంత ధనవంతులైనప్పటికీ, ఓ సాధారణమైన వ్యక్తిగా సంతృప్తికరంగా
ఉండగలం. మనం ప్రయత్నాలు చేపట్టకుండా, ఒకవేళ సంపద మనకు వస్తే దానిని కూడా మంచి ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలి. అలా చేయడం వల్ల మన జీవితాలు శుద్ధి అవుతాయి. పురాణాలలో పరమేశ్వరుడు పులి చర్మం తో కప్పబడి బూడిదను పూసుకోవాలి. ఎద్దుపై స్వారీ చేస్తున్నట్లు చిత్రికరించబడి ఉంటుంది. అది ఇంద్రియ సుఖాల నుండి నిర్లిప్తతను, విముఖతను సూచిస్తుంది.

అందుకే ప్రాజ్నులు ఎమన్నారంటే ? నిజమైన ధనవంతుడు మరియు నిజమైన పేదవాడు ఎవరు అనే దాని గురించి ఈ క్రింది విధంగా పలికారు. 'ఎవడు ధనవంతుడు అంటే ? కోరికలు లేకుండా సంతృప్తి కరంగా ఉండేవాడు. ధనవంతుడు ఎవరు ఇలా ఉండలేరో వారు పేదవాళ్లు అని '.

అందువల్ల సంతృప్తి తో నిండిన ఆనందాన్ని జీవితం లో ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం వలన ప్రతీ ఒక్కరకి ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి.

🕉🙏

No comments:

Post a Comment