ఓం నమో భగవతే శ్రీ రమణాయ
విదేశీ భక్తుడు :
భగవాన్! ఒక సాధకుడు ఏ విధంగా జీవితంలో వ్యవహరించాలి?
మహర్షి :
తానే కర్తననే అభిప్రాయం లేకుండా ప్రవర్తించాలి. అంటే అతడొక నిర్దిష్ట ప్రయోజనాన్ని ఆశించిగాని, ఒక సడలింపరాని ప్రణాళికాబద్ధుడైగాని వ్యవహరించకూడదు.
ఉదాహరణకు నీవు పారిస్ నుండి బయలుదేరేటప్పుడు నీ ప్రయాణపు పథకంలో ఈ ఊరుకు(అరుణాచలం) రావటమనేది కూడా చేర్చబడ్డదా!
విదేశీ భక్తుడు :
లేదు భగవాన్.
మహర్షి :
చూశావా! ముందుగా పథకం వేసుకోకుండానే నీవు ఇక్కడకు వచ్చావు కదా! "గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు ఎవ్వరూ ఊరికే కూర్చోలేరనీ, ప్రతివారి జన్మ ప్రయోజనము కూడా వారి వారి ఇష్టం, అయిష్టాలతో ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటుందని ఉద్ఘాటించాడు." కాబట్టి ఎటువంటి ప్రయోజనం అయినా సరే, తనంతట తాను సాఫల్యాన్ని పొందటానికే వదలివేయటం ఉత్తమం.
No comments:
Post a Comment