🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(244వ రోజు):--
25. తర్వాతి కొన్నేళ్లు
వ్యక్తిపరిపూర్ణతద్వారా విశ్వపరి పూర్ణత ! ప్రతివ్యక్తిలోని ఆధ్యాత్మిక వికాసం ద్వారానే ప్రపంచాన్ని మార్చ టం సాధ్యపడుతుంది - రాజకీయా లవల్ల జరుగదది, ఆధ్యాత్మిక పరిణామం వల్లనే.
- స్వామి చిన్మయానంద,1972
తన ప్రజానీకానికి సరిపడేటన్ని ఆహారధాన్యాలు పండించే సామ ర్థ్యం లేదని చెప్పినవారి జోస్యం తప్పని 1970 నాటికి భారతదేశం నిరూపించింది. కొంతవరకూ, బియ్యం కావాలంటే రాజకీయంగా వారి పక్షానే ఉండాలనే నిర్బంధపు షరతు విధించిన అమెరికన్ల నుంచే దీనికి ప్రేరణ లభించిందనే చెప్పాలి. (హనోయ్ పై బాంబులు వేయటాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ బాహాటంగా విమర్శించారనే నెపంతో అమెరికన్లు 1965 కరువురోజుల్లో ధాన్యసరఫరా కై చేసిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకు న్నారు. నిరాశచెందిన భారత రాయ బారి శ్రీమతి ఇందిరాగాంధీ చెప్పిన దంతా క్రైస్తవమతాధిపతైన పోపు, ఆనాటి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్సైన ఊథాoటు అంతకు ముందు చెప్పినవేనని జాన్సన్ ప్రభు త్వపు అధికారులకు గుర్తుచేయటాని కి ప్రయత్నిస్తే, "వారిద్దరికీ మా గోధు మలు అవసరం లేదు" అని పెడస రంగా బదులిచ్చారు) భారతదేశం అంతర్జాతీయ పరిథిలో ఏ కూటమి లోనూ చేరకూడదని నిర్ణయించు కుంది ; బ్రిటిష్ సామ్రాజ్యవాదుల జ్ఞాపకాలు మరుగునపడలేదు. అంతేకాక, పొరుగుదేశమైన ఫిలిప్పీ న్స్ తో అమెరికా వ్యవహరించిన తీరు కూడా మరువలేనిదే. భారత దేశానికి ఎవరి పక్షాన్నైనా ఉండటం కాని, ఉండకపోవటంకాని, ఇష్టం లేదు. రష్యా భారతదేశానికి ఉత్తర సరిహద్దులో ఉంది; అమెరికానుంచి గోధుమలు తెచ్చుకోవటం కోసం చాలా శతాబ్దాలనుంచి ఉన్న సమ తౌల్యతను భగ్నంచేయటానికి భారత దేశం ఇష్టపడలేదు. స్వప్రయత్నం ద్వారానే ఆహారం విషయంలో స్వయంపోషకత్వాన్ని సాధించింది.
కాని, వ్యవసాయంమీదనే దృష్టి నంతనూ కేంద్రీకరించటంచేత మిగి లిన రంగాలు - ముఖ్యంగా పరిశ్రమ లు -వెనుకబడ్డాయి.శాసనాలద్వారా పన్నులద్వారా వ్యాపారరంగంలో సమసమాజ సిద్ధాంతాలను చొప్పిం చడానికి ప్రభుత్వం ప్రయత్నించడం చేత, పరిశ్రమలలో పెట్టుబడి నిలిచి పోయింది; దేశపు ఆర్థికపరిస్థితి కుంటుపడింది. ప్రభుత్వం అనుసరిం చిన ఆదాయపన్ను విధానం వ్యక్తుల పైన, సంస్థలపైన పన్నులభారాన్ని అతిగామోపి, అక్రమార్జనకూ, నల్ల బజారు వ్యాపారానికీ (పన్నులు ఎగ గొట్టడానికీ రశీదులులేకుండా చేసే వ్యాపారం) దోహదం చేసింది. నల్ల బజారు వ్యాపారం ఆంగ్లేయుల పాలనాకాలం లోనే మొదలైంది. ఐతే, ఆరోజుల్లో పన్నులు ఎగగొట్టడ మంటే, విదేశీదొంగలనుంచి సొమ్ము అపహరించినట్లే భావించేవారు. బహుశా నూతనప్రభుత్వం ఈ దురలవాటు మాన్పించడానికి అవ సరమైనంత విశ్వాసాన్ని పొందలేక పోయిందేమో.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment