🙏 *రమణోదయం* 🙏
*అష్టమూర్తిగా ప్రకాశించు భగవంతుని అనుగ్రహాన్ని సద్గురువు అనుగ్రహం లేనిదే పొందలేము. అది శ్రవణ మననాల ద్వారా కూడా లభ్యమవదు. గురుభక్తితోనే ఆ దివ్యానుగ్రహం లభిస్తుంది.*
వివరణ: *భగవంతుడే సద్గురువు కాబట్టి గుర్వనుగ్రహం లేనిదే భగవదనుగ్రహం లేదు.గురుభక్తే భగవద్భక్తి. అదొక్కటే దైవానుగ్రహాన్ని లభింపజేస్తుంది.*
శాంతి మన సహజస్వభావం.
క్రొత్తగా సంపాదించుకోవలసిన పనిలేదు..
మనస్సును నిశ్చలమొనరిస్తే శాంతి దానంతటదే
చేకూరుతుంది..గీతాపద్దతియైన అభ్యాస వైరాగ్య
లొక్కటే దానికి ఉపాయం..వైరాగ్యం భావవిక్షేపాలను
తొలగించడానికి తోడ్పడగా, అభ్యాసం ఒకే భావంపై
మనస్సు నేకాగ్రంచేసి శాంతి సంధాయకమవుతుంది.
ఆత్మనైన నాకు...
చర్మంతో చెక్కిన ఈ బొమ్మను
అందాక ఆడుకోమని ఇచ్చావా?
అరుణాచలా!
అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.726)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె
పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment