🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(245వ రోజు):--
సమాజపు విపత్కరపరిస్థితి, వ్యక్తుల పెరుగుతున్న అవసరాలు - ఇవన్నీ కలిసి స్వామీజీ విరామం లేకుండా పనిచేయడానికి అవసర మైన ప్రేరణనిచ్చాయి. ఆయన భాష ణలు వినడానికి తండోపతండాలు గా వచ్చే జనమే ఆయనలోని తరగని శక్తికి కారణమనిపించేది. 1970 వ సంవత్సరం వచ్చేసరికి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం విషయంలో గణనీ యమైన అభివృద్ధి సాధించటం జరిగింది. దేశంలోని పెద్దనగరాల్లో ముఖ్యమైన వేదాంతోపనిషత్తులను బోధించటం జరిగింది.వాటిని చాలా భారతీయభాషల్లోకి అనువదించటం కూడా జరిగింది. ఒక 12మంది బ్రహ్మచారులు ముఖ్యనగరాల్లో బోధనకార్యక్రమాల్లో నిమగ్నులయ్యారు.
తన విద్యార్థులు ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టడంచేత తన కార్య భారం కొంత తగ్గించుకుని, చిన్మయ మిషన్ చేపట్టిన వివిధాకార్యక్రమాల్లో పనిచేస్తున్నవారికి సలహా ప్రోత్సా హం ఇస్తూ మరింతకాలం గడపాల నుందని స్వామీజీ సూచించారు. అనారోగ్యకారణాలవల్ల కొన్నిసార్లు ఆయన తనపనిని తగ్గించుకోవాల్సి వచ్చింది. తన శరీరం మునుపటంత శ్రమను తట్టుకోలేకపోతోందని ఆయన గ్రహించారు. 1957 లోనే గొంతునొప్పి, జ్వరంవల్ల ఢిల్లీలో జరి గిన యజ్ఞాన్ని 4 రోజులు నిలిపి వేయాల్సి వచ్చింది. అదేసంవత్సరం ఎర్నాకులంలో చాలారోజులు జ్వరం తో మంచానపడ్డారు. అప్పుడు ఆయన బాగోగులను కౌచిఅమ్మ చూచుకున్నారు. ఆయనకు సేవ చేయాలనే అతృతతో చుట్టూచేరిన చిన్మయమిషన్ సభ్యులు ఆయనకు ఒక్క క్షణమైనా ప్రశాంతి లేకుండా చేశారు. వైద్యుడు పరీక్షించడానికి వచ్చినపుడు కొంచెం గంభీరతతోనే, "వీళ్లంతా నన్ను ఒక్కనిముషమైనా ఒంటరిగా ఉండనీయటంలేదు. నాకు కొంచెం విశ్రాంతి దొరికే ఆసు పత్రి ఏదైనా ఉంటుందా" అని అడిగారాయన.
కఠినశ్రమ, మధ్యమధ్య జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి కొద్దిరోజుల పాటు ఉండే అనారోగ్యాలు పదేళ్ల పాటు కొనసాగాయి. మైసూరులో యజ్ఞం ప్రారంభించిన ఐదురోజుల తర్వాత 1970 మార్చి 21వ తేదీన స్వామీజీకి గుండెనొప్పి వచ్చింది. మర్నాడు ముగించాల్సిన పాఠానికి మొదట అనుకున్న సమయం చాలదనీ, అందుచేత అందరూ ఎక్కువసేపు ఉండటానికి సిద్దపడా లనీ ముందురోజే ప్రకటించారు. ఆ రోజు ఆదివారం కావటంచేత ఎక్కువ కాలం గడపటం అందరికీ సులభం కూడా. రోజూకంటే ఎక్కువసేపు మాట్లాడాల్సివచ్చినా, ఆయన ఎప్పటిలాగే ఉత్సాహంగా కథలతో నూ, చతురోక్తులతోనూ అందరినీ నవ్విస్తూ వేదాంతపాఠాన్ని సోదా హరణంగా వివరించారు.
ఆరాత్రి, విశ్రమించిన ఒకగంట తర్వాత ఆయన పక్కగదిలో నిద్రిస్తు న్న ఇంటియజమానిని లేపి తనకు ఛాతిలో తీవ్రమైన బాధగా ఉందని చెప్పారు. వెంటనే ఒక హృద్రోగనిపు ణుడిని పిలిపించటం జరిగింది. కొద్దిసేపు పరీక్షించగానే, ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా రు. రోగుల్ని మోసుకుపోయే బల్ల మీద పడుకోబెట్టి వ్యానులో తీసుకు వెళ్తుంటే, చుట్టూచేరిన కుటుంబ సభ్యులకు ఇలా ధైర్యంచెప్పా రాయన : "కంగారుపడాల్సినదేమీ లేదు. శరీరానికి శ్రమ ఎక్కువైనది ; అంచేత కొంచెం మరమ్మత్తు, విశ్రాం తి అవసరం. అంతకంటే ఇంకేంలేదు."
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment