Friday, September 18, 2020

ఒక తండ్రి ఆవేశంగా అడిగిన ధ్యానం ప్రశ్న...

🌹 ఒక తండ్రి ఆవేశంగా అడిగిన ప్రశ్న... మీరు ధ్యానం ఎందుకు మా పిల్లలకు నేర్పిస్తున్నారు వారి సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నారు.. ఆ సమయం లో వారు చదువుకుంటే ఏదోఒకటి అవుతారు..🌹 అవును నిజమే మీరు చెప్పింది... వారు చదువుకుంటే ఏదో ఒక్కటి మాత్రమే అవుతారు.. కానీ ధ్యానం చేస్తే మొట్ట మొదట ఓపికతో విని నేర్చుకొనే మంచి "విద్యార్థి "అవుతాడు 🌹తన తపోప్పులను సరిచేసుకొంటూ ఆలోచనలను క్రమబద్దీకరిస్తూ ఉన్నతంగా ఎదిగే ఒక "ఇంజనీర్" అవుతాడు. 🌹శరీరంలో వచ్చే అనారోగ్యాలను, ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా ధ్యానశక్తి ద్వారా తానే సరిచేసుకొనే "డాక్టర్" అవుతాడు. 🌹ధర్మ అధర్మాలను విచ్చక్షణ చేసి ఖచ్చితత్వంతో ధర్మం కోసం పోరాడే "లాయర్" అవుతాడు 🌹కుటుంబాన్ని, దేసాన్ని, ప్రకృతిని.. రక్షిస్తూ సాటిమనుషులను, సాటి జీవులను ప్రేమించే ఒక "సైనికుడు" అవుతాడు 🌹జీవితం లో ఎదురయ్యే అత్యంత జటిలమైన సమస్యలకు వెన్నుచూపక పోరాడే గొప్ప "ఫైటర్" అవుతాడు.🌹 ఎప్పటికప్పుడు తనలోని సృజనాత్మకతను మెరుగులు దిద్దే" ఆర్కిటెక్ట్" అవుతాడు.🌹ధ్యానం లో కూర్చొనే విశ్వపు రహస్యాలను తెలుకొనే ఆ "సైంటిస్ట్ "ని మించిన వాడవుతాడు 🌹తనని తాను ప్రేమించుకుంటూ, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, తల్లి తండ్రులను గౌరవించి ప్రేమిస్తూ మంచి పుత్రునిలా, మానవత్వం వికసించిన మనిషినిలా తయారవుతాడు. 🌹తను నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రపంచానికి పంచె ఒక యోగిలా గొప్ప "గురువుగా "అవుతాడు. 🌹మరి మీరు చెప్పింది వందశాతం నిజమే కదా ధ్యానం చేయకపోతే ఏదోఒక్కటి మాత్రమే అవుతారు.
🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment